Romanchakam First Single "Radha Ramana" Released from Bhadrakali Pictures' Production Presented by Blockbuster Director Sandeep Reddy Vanga The film is gearing up for a grand worldwide theatrical release on September 3
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న "రోమాంచకం" మూవీ ఫస్ట్ సింగిల్ 'రాధా రమణ' రిలీజ్ -సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
Presented by blockbuster director Sandeep Reddy Vanga, Romanchakam is being produced under the Bhadrakali Pictures banner by Pranay Reddy Vanga. The film stars Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead roles and is directed by debutant Venugopal Reddy.
The previously released first-look poster and glimpse generated an impressive response from audiences, creating strong anticipation for the film. Romanchakam is now set for a grand worldwide theatrical release on September 3.
The makers today unveiled the film's first single, "Radha Ramana." The song features beautiful lyrics penned by renowned lyricist Chandrabose, while music director Vasuki Vaibhav has composed a memorable melody and also lent his voice to the track. Shot with a poetic and visually appealing romantic treatment, the song beautifully captures the chemistry between the lead pair.
The song continues with soulful expressions of love and longing, making it an engaging and melodious romantic number. Blending romance, comedy, and suspense, Romanchakam promises to offer an entertaining cinematic experience. Positioned as an exciting youthful entertainer, the film is set to captivate audiences in theatres from September 3.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న "రోమాంచకం" మూవీ ఫస్ట్ సింగిల్ 'రాధా రమణ' రిలీజ్ -సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన "రోమాంచకం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు "రోమాంచకం" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'రాధా రమణ' రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అందమైన సాహిత్యాన్ని అందించగా...మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ మెమొరబుల్ ట్యూన్ తో కంపోజ్ చేసి శ్రావ్యంగా పాడారు. హీరో హీరోయిన్స్ మధ్య బ్యూటిఫుల్ పొయెటిక్ రొమాంటిక్ మేకింగ్ తో ఈ పాటను చిత్రీకరించారు. 'రాధా రమణ' పాట ఎలా ఉందో చూస్తే - 'రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో..ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో..ఓ కన్నా నీ అందమే..అలలై అలలై ముంచే, కన్నుల్లో అందుకే కలలే కథలే పెంచే, ఆవేశమే తెరచాటుగా లాగగా, బిడియాల ఆదేశమే పొరపాటనీ ఆపగా, ఈ ఊగిసలో, ఊయలలో, ఉందనా లేదనా..' అని సాగుతూ ఈ పాట ఆకట్టుకుంటోంది.
"రోమాంచకం" సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు తెరపైకి రాబోతోంది. ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రేక్షకుల్ని థియేటర్స్ లో ఎంగేజ్ చేయబోతోందీ మూవీ.