“Romanchakam” Title Poster Released – Presented by Blockbuster Director Sandeep Reddy Vanga, Starring Sumanth Prabhas and Ananthika Sanilkumar, Produced by Pranay Reddy Vanga Under the Bhadrakali Pictures Banner
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న "రోమాంచకం" మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్
Director Sandeep Reddy Vanga, who delivered pan-India blockbusters like Arjun Reddy, Kabir Singh, and Animal, is presenting the new youthful entertainer “Romanchakam.” Passionate producer Pranay Reddy Vanga, who has been producing films directed by his brother Sandeep Reddy Vanga under the Bhadrakali Pictures banner, is backing this exciting project. Since these sensational brothers collaborate with a young team, the project naturally grabs the attention of movie lovers and raises expectations.
“Romanchakam” stars Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead roles. The film is being directed by debutant Venugopal Reddy.
With several talented young technicians working on the project, “Romanchakam” is shaping up to be an interesting youthful entertainer. The makers are expected to reveal more exciting updates about the film soon.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న "రోమాంచకం" మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ రూపొందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ప్రతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా. ఈ సెన్సేషనల్ బ్రదర్స్ ఒక యంగ్ టీమ్ తో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది, అందరిలో అంచనాలు పెంచేస్తుంది. అలాంటి క్రేజీ సినిమానే "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు.
"రోమాంచకం" సినిమా టైటిల్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మనసుకు హత్తుకునే ఫీల్ తో యూత్ ఫుల్ వైబ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ టైటిల్ పోస్టర్ తో కలుగుతోంది. ఈ చిత్రానికి పెట్టిన ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సరికొత్త కథకు సుమంత్ ప్రభాస్, అనంతిక జంట మరింత ఫ్రెష్ నెస్ తీసుకొస్తున్నారు. ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న "రోమాంచకం" సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.