10 July 2019
Hyderabad
'బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగష్టు 15 న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అలాంటి మెస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ సాహో అప్‌డేట్స్ గ్యాప్ లేకుండా రావడం తో అభిమానుల చాలా ఆనందంగా వున్నారు. ఇటీవల విడుదలయ్యిన సైకో సయ్యో అనే సాంగ్ కి బాలీవుడ్, టాలీవుడ్, తమిళ, మళయాల భాషల్లో విపరీతమైన బజ్ రావటం తో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే వరల్డ్ వైడ్ గా ప్రభాస్ అభిమానులు ఈ సాంగ్స్ మీద టిక్‌టాక్ లు డబ్‌స్మాష్ లు చేస్తున్నారు. ఈ సాంగ్ లో యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించటం తెలుగు అభిమానుల్ని సంతోషం లో ముంచింది. అలాగే హీరోయిన్ శ్రధ్ధా కపూర్ చాలా అందంగా కనిపించింది. సాంగ్ లో ప్రభాస్, శ్రథ్థా లు చేసిన డాన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సాంగ్ విడుదలని 5 సిటీస్ లో నాలుగు భాషల్లో రెబల్‌స్టార్ అభిమానులకి స్పెషల్ స్క్రీనింగ్ చేయటంతో ఫ్యాన్స్ కి పండగలా అనిపించింది. అదేరోజు హీరోయిన్ శ్రధ్ధా కపూర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఈ సాంగ్ కి సంబందించి జిఫ్ ఫైల్ పోస్ట్ చేయటంతో వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ సాంగ్ ని సెట్లో చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఆస్ట్రియా లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించారు. మరో పాటని కురేషియా లోని చిత్రీకరించారు. ఈ సాంగ్ 50 మంది మిస్ కురేషియా మెడల్స్ తో షూట్ చేసారు.
అలాగే అబుధబి లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి.. ఇప్పటికే ఛాప్టర్1, ఛాప్టర్ 2, టీజర్ లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని పెంచిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదల కి సిద్ధమౌతోంది.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..
crew: Written & Directed by Sujeeth.
Producers: Vamsi - Pramod.- Vikram
DOP: Madhie.
Production Designer: Sabu Cyril.
Editor: Sreekar Prasad.
Background Music: Ghibran.
Visual Effects RC Kamalakannan.
Choreographers: Vaibhavi Merchant, Raju Sundaram.
Costume Design: Thota Vijay Bhaskar, Leepakshi Ellawadi.
Action directors: Kenny Bates, Peng Zhang, Dhilip Subbarayan, Stunt Silva, Stefan, Bob Brown, Ram - Lakshman.
DI: B2H.
Sound design: SYNC CINEMA.
Visual Development: Gopi Krishna, Ajay Supahiya.
PRO-Eluru Sreenu