
16 June 2019
Hyderabad
దర్శకత్వం కష్టం... హీరోయిన్‌గా చేస్తా! - అక్షత శ్రీనివాస్
`స్పెషల్` చిత్రంలో నాయిక అక్షత శ్రీనివాస్. `స్పెషల్`ను వాస్తవ్ దర్శకత్వం వహించారు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి నాయిక `అక్షత శ్రీనివాస్` ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ
ఇంటర్వ్యూ సారాంశం.
* మాది మంగళూరు. తెలుగులో `స్పెషల్` నా రెండో సినిమా. ఇంతకు ముందు `శేఖరంగారి అబ్బాయి` చేశాను. `స్పెషల్` నిజంగా
నాకు స్పెషల్ చిత్రమే. మైండ్ రీడర్‌కు సంబంధించిన కథ ఇది.
* రెమ్యూనరేషన్ కోసమో, దర్శకుడి కోసమో, పెద్ద బ్యానర్ కోసమో నేను సినిమా చేయను. నేను విన్న కథ నచ్చితేనే నేను సినిమా చేస్తా.
* కథ నచ్చగానే దర్శకుడు ఎలా ఉన్నాడని చూస్తాను. ఎందుకంటే దర్శకుడు కాన్ఫిడెంట్‌గా ఉంటే సినిమా బాగా వస్తుందని నమ్ముతాను.
* `స్పెషల్` కథ వినగానే నాకు నచ్చింది. నాకు సస్పెన్స్ జోనర్ చిత్రాలంటే ఇష్టం. ఈ సినిమాలోనూ జోనర్ సస్పెన్సే. దానికి తోడు స్క్రీన్‌ప్లే చాలా బాగా అనిపించింది.
* హీరోయిన్ ఉండాలి కాబట్టి, `స్పెషల్` నన్ను తీసుకున్నారని అనుకోవద్దు. ఇందులో నాలుగు పాత్రలు ప్రధానంగా ఉంటాయి. సినిమాకు పిల్లర్లు అవే. వాటిలో నా పాత్ర ఒకటి. మా దర్శకుడు హాలీవుడ్ ఫ్రీక్. ఆయనకు హాలీవుడ్ చిత్రాల పట్ల అవగాహన ఎక్కువ. దానికి తోడు ఆయన చాలా టాలెంటెడ్.
* నా పాత్ర చాలా బబ్లీగా ఉంటుంది. కాలేజీకి వెళ్లే పాత్ర. మహాభారతంలో చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ అర్జునుడు వచ్చినట్టు.. నా పాత్ర ఇందులో సెంటర్ కేరక్టర్ అన్నమాట.
* చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.
* మైండ్ రీడింగ్ అనేది ఉంటుంది. జ్యోతిష్యం ఎలా చెబుతారు? కొందరిమీదకి శక్తి ఎలా పూనుతుంది... అంటే ఏదో శక్తి ఉందిగా. సైకోపతి కూడా అలాంటిదే. ఓ వ్యక్తికి సంబంధించిన కథను తీసుకుని తెరకెక్కించారు.ఆ రకంగా యథార్థఘటనతో తెరకెక్కిన చిత్రమే ఇది.
* దర్శకత్వం కన్నా నాయికగా నటించడమే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నేను హీరోయిన్ కావాలని అనుకున్నా. అలాగే దర్శకత్వం చేయాలని కూడా ఉండేది. కానీ అందులో కష్టం ఎక్కువ. హీరోయిన్‌గా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకత్వం వహించినప్పుడు నాకు నిద్రపట్టేది కాదు. అనుకున్న సీన్ కరెక్ట్ గా వచ్చేంతవరకు నిద్రపట్టదు.
* నాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూశాను.
* నాయికల్లో సమంత, రష్మిక ఇష్టం. హీరోల్లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.
* పర్పస్ లేనిదే నేను ఏ పనీ చేయను. దర్శకత్వమైనా, హీరోయిన్‌గా అయినా అంతే.
* ఈ చిత్రంలో నేను దర్శకుడికి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదు. మా దర్శకుడికి ఏం చేయాలో క్లారిటీ ఉంది. కాబట్టి అసలు నేను దాని గురించి ఆలోచించలేదు.
* నేను ఇప్పటిదాకా తెలుగు, కన్నడ, తమిళ్‌లో కలిసి ఆరు సినిమాలు చేశా. ప్రతి సినిమాలోనూ నా పాత్రలు వెరైటీగా ఉంటాయి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు అన్నిటిలోకీ ఇది చాలా బావుంటుంది. ఆడియన్స్ సపోర్ట్ చేస్తే ఇది బ్లాస్ట్ అవుతుంది.
* తెలుగులోనూ ఇంకొన్ని ఆఫర్లు ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే చెబుతాను. ప్రస్తుతం `గ్రంథాలయం` అని ఓ సినిమా చేస్తున్నా.
* తెలుగు మాట్లాడటానికి బాగానే వస్తోంది. బెంగుళూరులో ఉంటే కన్నడ వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కన్నడ, తెలుగు మిక్స్ అవుతుంది.
* `మహానటి` సినిమా చూసిన తర్వాత, అంతకు ముందు `అరుంధతి` సినిమా చూసినప్పుడు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్నా.
* నా దగ్గర స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. మంచి నిర్మాత వస్తే తప్పకుండా సినిమాకు దర్శకత్వం చేస్తా.
* కన్నడలోనూ రెండు సినిమాలు ఉన్నాయి.