pizza

Mega Supreme Hero Sai Durga Tej met Telangana Chief Minister Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌తో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ భేటి !

You are at idlebrain.com > news today >

14 July 2024
Hyderabad

Mega Supreme Hero Sai Durga Tej met today (Sunday) with the Chief Minister of Telangana, Revanth Reddy. They had a courtesy meeting at the CM's residence in Jubilee Hills, Hyderabad. Congress MP Chamala Kiran Kumar Reddy and Congress leader Rohin Reddy were present at this meeting along with Minister Konda Surekha.

Sai Durga Tej has been at the forefront of socially conscious interventions from the beginning. Recently, he brought attention to the sacrifices of the country's soldiers and their families through the movie 'Satya', which carries a social message. He also participated in road accident prevention awareness programs on behalf of the government.

Recently, Sai Durga Tej brought to the attention of the government a social media incident involving YouTuber Praneeth Hanumanthu, who made inappropriate comments on a video to tarnish the relationship between a father and daughter. Sai Durga Tej tweeted that people like Praneeth Hanumanthu, who sexualize small children in the name of comedy, damage family values. He urged the government to take action against the YouTuber. Following this, Chief Minister Revanth Reddy and Deputy CM Bhatti Vikramarka responded promptly, and the police arrested Praneeth and three other individuals associated with the offensive content.

Today, Sai Durga Tej personally conveyed his congratulations to the Chief Minister for the Telangana government's timely response to his tweet. The actor also discussed ways to curb child abuse and make society a better place for children, both offline and online.

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌తో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ భేటి !

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్‌ రెడ్డితో, మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్‌ ఈ రోజు (ఆదివారం) భేటి అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ చామాల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి వున్నారు. కాగా మొదట్నుంచీ సామాజిక స్పృహా వున్న హీరోల్లో సాయి దుర్గా తేజ్‌ ముందు వరుసలో వుంటారు. ఇటీవల 'సత్య' అనే సామాజిక సందేశం వున్న సినిమాతో దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలిసేలా చేసిన సాయి దుర్గా తేజ్‌ ప్రభుత్వం తరపున చెపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. తాజాగా తండ్రి, కూతురి మధ్య వున్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా యూట్యూబ్‌లో ఓ వీడియోను కామెంట్‌ చేసిన వ్యవహారంలో యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు నీచ బుద్దిని సాయి దుర్గ తేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ విలువలకు మచ్చ తేచ్చేలా ఫన్‌ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్‌ చేస్తున్న, ప్రణీత్‌ హనుమంతు లాంటి వారిని కఠినంగా శిక్షించాలని ట్విట్‌ చేశారు సాయి దుర్గ తేజ్‌. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందించగా, ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన ట్విట్ట్‌కు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్‌ ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి తన అభినందనలు తెలియజేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved