pizza

Saindhav children’s day poster
విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ నుంచి చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదలం

You are at idlebrain.com > news today >
Follow Us

14 November 2023
Hyderabad

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. వెరీ ట్యాలెంటెడ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు.

పోస్టర్ లో బేబీ సారాని బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తూ చిరునవ్వుతో కనిపించారు వెంకటేష్. ఇది చిల్డ్రన్స్ డే కి పర్ఫెక్ట్ పోస్టర్ గా అందరినీ అలరించింది.

ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్ టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. శైలేష్ కొలను, వెంకటేష్‌ని మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారని ప్రశంసలు అందుకున్నారు.

నవంబర్ 21న సినిమా ఫస్ట్ సింగిల్-రాంగ్ యూసేజ్‌ని లాంచ్ ద్వారా మ్యూజికల్ జర్నీని కిక్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రం కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని కంపోజ్ చేశారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

‘సైంధవ్’ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణన్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: యస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved