pizza

Prominent Director-Producer Sai Rajesh Elected Vice President of the Telugu Film Industry Employees Federation
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్

You are at idlebrain.com > news today >

16 June 2026
Hyderabad

Prominent director and producer Sai Rajesh has been elected as the Vice President of the Telugu Film Industry Employees Federation, a body that represents 24 workers' unions within the Telugu film industry. He will now contribute to the industry's welfare and development in this new leadership role.

Sai Rajesh was unanimously chosen as Vice President by the leaders of all affiliated workers' unions. He currently serves as the Treasurer of the Telugu Film Directors Association (TFDA).

Previously, Sai Rajesh held the position of Vice President in the Telugu Film Directors Association. He contested and won the last two TFDA elections with an overwhelming majority. During his tenure, he played a significant role in implementing several reforms within the directors' association and was instrumental in introducing welfare initiatives such as insurance coverage and mid-day meal programs for members.

Recognizing his contributions and commitment to the welfare of film industry workers, the Telugu Film Industry Employees Federation elected him as its Vice President.

Sai Rajesh, who delivered the cult blockbuster film Baby, is currently associated with Chennai Love Story, starring Kiran Abbavaram, as the story writer and producer.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్

ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్ మరో కొత్త పదవిలో చిత్ర పరిశ్రమకు తన వంతు సేవలు అందించబోతున్నారు. 24 విభాగాల కార్మిక సంఘాలు ఉండే సమాఖ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సాయి రాజేష్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు సాయి రాజేష్ ను ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఆయన ట్రెజరర్ గా ఉన్నారు.

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సాయి రాజేష్. ఆయన గత రెండు సార్లు టీఎఫ్ డీఏ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మోజార్టీతో గెలిచారు. దర్శకుల సంఘంలో జరిగిన పలు మార్పుల్లో భాగమయ్యారు. సభ్యులకు ఇన్యూరెన్స్, మిడ్ డే మీల్స్ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే సాయి రాజేష్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తమ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసుకుంది. బేబి మూవీతో కల్ట్ బ్లాక్ బస్టర్ రూపొందించిన సాయి రాజేష్ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి కథను అందించి, నిర్మిస్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved