`
pizza

Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda- Samajavaragamana Glimpse Unveiled
శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, ‘సామజవరగమన’ గ్లింప్స్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2023
Hyderabad

Hero Sree Vishnu has been attempting different genres from the beginning, but comedy is his biggest forte. After a long time, he is doing a wholesome entertainer Samajavaragamana under the direction of Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments, while Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie.

Wishing Sree Vishnu on his birthday, the makers of Samajavaragamana have unveiled a glimpse. The video begins with pleasant music and then Sree Vishnu who is willing to marry his girlfriend reveals the problem in their marriage. The glimpse guarantees that Samajavaragamana is a complete family entertainer with a unique concept. Sree Vishnu is too good and his comic timing is superb. The presence of several comedians pledges there will be enough entertainment in the movie. Ram Abbaraju has come up with another intriguing project, while Raam Reddy’s camera work is spotless, and Gopi Sundar’s background score elevates the fun part.

Bhanu Bogavarapu penned the story, while Nandu Savirigana has written the dialogues. Director Ram Abbaraju himself has written the screenplay of the movie. A team of talented technicians are handling different crafts of the movie. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director.

The film is in the last leg of shooting and it is slated to release in the summer, this year.

Cast: Sree Vishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.

Technical Crew:
Anil Sunkara Proudly Presents
Screenplay & Direction - Ram Abbaraju
Producer - Razesh Danda
Co-Producer - Balaji Gutta
Banners- Ak Entertainments, Hasya Movies
Story - Bhanu Bogavarapu
Dialogues - Nandu Savirigana
Music Director - Gopi Sundhar
Cinematographer - Raam Reddy
Editor - Chota K Prasad
Art Director -Brahma Kadali
Costume Designer - Lakshmi Killari

శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, ‘సామజవరగమన’ గ్లింప్స్ విడుదల

హీరో శ్రీవిష్ణు మొదటి నుంచి విభిన్నమైన జోనర్‌లతో అలరిస్తూవున్నారు. అయితే శ్రీవిష్ణు బిగ్గెస్ట్ స్ట్రెంత్ కామెడీ. చాలా కాలం తర్వాత వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ అనే హోల్సమ్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు శ్రీవిష్ణు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.

శ్రీవిష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, సామజవరగమన మేకర్స్ ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు. వీడియో ఆహ్లాదకరమైన సంగీతంతో ప్రారంభమౌతుంది. తన గర్ల్ ఫ్రండ్ వివాహం చేసుకోవాలని సిద్ధపడిన శ్రీవిష్ణుకు ఒక సమస్య ఎదురౌతుంది. సామజవరగమన యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ గ్యారెంటీ ఇస్తోంది. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ చాలా బాగుంది. చాలా మంది కమెడియన్స్ ఉండటం వల్ల సినిమాలో తగినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని భరోసా ఇస్తోంది. రామ్ అబ్బరాజు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు. రాంరెడ్డి కెమెరా పనితనం అద్భుతంగా వుంది. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫన్ పార్ట్ ని ఎలివేట్ చేసింది.

భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సాంకేతిక విభాగం:
అనిల్ సుంకర సగర్వ సమర్పణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రామ్ అబ్బరాజు
నిర్మాత - రాజేష్ దండా
సహ నిర్మాత - బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ - భాను బోగవరపు
డైలాగ్స్ - నందు సవిరిగాన
సంగీతం - గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ - రాంరెడ్డి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ - లక్ష్మి కిల్లారి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved