సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వంగవీటి'. జీనియస్, రామ్‌లీల వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ రూపొందించిన 'వంగవీటి' చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజైంది. ఈ సందర్భంగా వంగవీటి చిత్రంలో వంగవీటి రాధా, వంగవీటి రంగా పాత్రధారి శాండీ పాత్రికేయులతో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా శాండీ మాట్లాడుతూ - ``మాది కాకినాడ. అయితే నేను చిన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌లో సెటిలయ్యింది. నటన పరంగా నేను ఎక్కడా ట్రయినింగ్ తీసుకోలేదు. సినిమాల మీద ఆసక్తితో స్కూల్లో వేసే నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అలానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. ఓసారి పూరిగారి ఆఫీస్‌లోఉన్నప్పుడు అక్కడకు వచ్చిన రామ్‌గోపాల్‌వర్మగారు నన్ను చూడగానే పిలిచి మాట్లాడారు. ఇలా వంగవీటి సినిమా గురించిన విషయాలను ఆయన నాకు చెప్పారు. నీ లుక్స్ వంగవీటి రాధాకు దగ్గరగా ఉన్నాయి. ఓసారి లుక్ టెస్ట్ చేద్దామని అన్నారు. తర్వాత ఆయన వంగవీటి రాధా కోసం లుక్ కోసం నన్ను టెస్ట్ చేసిన తర్వాత రాధా, రంగాగారి అన్నదమ్ములు, ఒకేలా ఉండటంతో రంగా క్యారెక్టర్ కూడా నాతో వేయిద్దామని అనుకున్నారు. రంగాగారి లుక్‌ను కూడా నాతో వేయించి లుక్ టెస్ట్ చేయించారు. వంగవీటి రాధా, రంగా గురించి నాకు పెద్దగా తెలియదు. కొద్దిగానే తెలుసు. వర్మగారు ఎప్పుడైతే సినిమా చేద్దామని అన్నారో అప్పుడు ఇంటర్‌నెట్‌లో ఆర్టికల్స్ చదివాను.రాధాగారి ఫోటో మాత్రమే ఉంది. దాంతో ఆయన ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ ఛేస్తారని ఆయనకు తెలిసిన వారి నుండి నాకు తెలిసిన వారి ద్వారా తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నాను. దాన్ని వర్మగారికి చెప్పటం. వర్మగారు కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వడం జరిగాయి. దాంతో రాధాగారి క్యారెక్టర్ చేశాను. అలాగే రంగాగారికి సంబంధించిన వీడియోస్ ఏవీ నా వద్ద లేవు. కొన్ని ఫోటోస్ దొరికాయి. ఫోటోస్ ఆధారంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌తో ఎలా బిహేవ్ చేస్తారో ఓ ఐడియా అనుకుని వర్మగారికి చెప్పడం, ఆయన సలహాలు తీసుకుని అలానే యాక్ట్‌చేశాను. ఈ ప్రాసెస్ కావడానికి రెండు నెలల సమయం పట్టింది. సినిమా ఫస్ట్‌లుక్ వచ్చిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజైన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత నాకెలాంటి బెదిరింపులు రాలేదు. రాంగోపాల్ వర్మగారిని ఫాలో అవుతూ ఉండటం వల్ల నాకేమీ కష్టంగా అనిపించలేదు. వర్మగారు డైరెక్టర్ కావడంతో రిస్క్ అనిపించలేదు. అనంతపూర్‌లో షూటింగ్ జరుపుకున్న స్పానిష్ లాంగ్వేజ్ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటించాను. తర్వాత పూరిగారి దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాల్లో నటించాను. మంచి కథలు వింటున్నాను. ఆఫర్స్‌వస్తున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఫైనల్ అయిన తర్వాత వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను`` అన్నారు.