pizza

Bheems Ceciroleo About Sankranthiki Vasthunam
'సంక్రాంతికి వస్తున్నాం' నా జీవితంలో జరిగిన అద్భుతం. వెంకటేష్ గారి సినిమాకి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. సంక్రాంతికి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ సినిమా చూడబోతున్నారు: సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో

You are at idlebrain.com > news today >

04 January 2025
Hyderabad

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో 'సంక్రాంతికి వస్తున్నాం' విశేషాల్ని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? మీరు ప్రాజెక్ట్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ? ఈ జర్నీ గురించి చెప్పండి ?
-ముందుగా తెలుగు ప్రేక్షకులుకు ధన్యవాదాలు. అనిల్ రావిపూడి గారి 'పటాస్' సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కుదరలేదు. ఫైనల్ గా13 ఏళ్ల తర్వాత మళ్ళీ అనిల్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి ధన్యవాదాలు.

-దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో బలగం సినిమా చేశాను. సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వెంకటేష్ గారు అనిల్ గారితో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పాట ద్వారా మీ అందరికీ చేరువైనందుకు ఆనందంగా వుంది.

-ధమాక, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్ .. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ గారితో కలసి పని చేయడం సందడిగా సంతోషంగా వుంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై వున్న అభిరుచి దీనికి కారణం.

-వెంకటేష్ గారి సినిమాకి పని చేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేష్ గారు ఆయనంతట ఆయనే వచ్చి పాడటం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా ఇది నాకో ఎచీవ్మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు సంక్రాంతికి వస్తున్నాం.

-ఈ సినిమాలో గోదారి గట్టు సాంగ్ రమణ గోగుల గారు పాడటం, ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఆనందంగా వుంది. రమణ గోగుల గారు నా పాట పాడతానని ఒప్పుకోవడం చాలా లక్కీగా భావించాను. మధుప్రియ కూడా అద్భుతంగా పాడారు. ఈ పాట ప్రతి ఇంట్లో వినిపించడం ఆనందంగా వుంది. అలాగే నేను పాడిన మీను సాంగ్ 17 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో వుంది. అలాగే వెంకటేష్ గారు పాడిన బ్లాక్ బస్టర్ సాంగ్ వైరల్ హిట్ కావడం చాలా ఆనందంగా వుంది.

-ఈ సినిమా రీరికార్డింగ్ చేశాను. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఎలా అయితే వుందో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారనే నమ్మకం వుంది. పాటలని ప్రేక్షకులు ఇంత గొప్పగా స్వీకరించిన విధానం బట్టి ఈ సినిమా ఉన్నతి ప్రగతి కనిపిస్తోంది. ఈ సినిమా చేయడం గర్వంగా వుంది.

ఇది ఏ జోనర్ సినిమా?
-ఇది ఫ్యామిలీ అంత కలిసి చూడదగ్గ సినిమా. వెరీ క్లీన్ ఎంటర్ టైనర్. అందరితో కలసి హాయిగా ఎంజాయ్ చేసేలా వుంటుంది.

రమణ గోగుల గారిని ఎలా ఒప్పించారు?
-రమణ గోగుల గారిని అజ్ఞాతంగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ వచ్చినవాడిని. తమ్ముడు పాటలు విన్నప్పుడే ఆయనతో ఒక కనెక్షన్ ఏర్పడిపోయింది. నేను లిరిక్ రైటర్ గా వున్నప్పుడు ఆయన పాటకు రాయాలని అనుకున్నాను. ఆయన ఈ పాట విన్న వెంటనే ఒప్పుకున్నారు. పాట విని ఇందులో సోల్ వుందని అన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి ఆయన పాటకి పాదాభివందనం.

వెంకటేష్ గారితో సినిమా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ?
-వెంకటేష్ గారిని నేరుగా చూసింది కూడా లేదు. అలాంటిది ఆయన సినిమాకి వర్క్ చేస్తున్నానని తెలియగానే చిన్నప్పటి నుంచి చూసిన ఆయన సినిమాలు, పోస్టర్లు కళ్ళముందు రీల్స్ లా తిరిగాయి. అయితే అనిల్ గారు నా వర్క్ ని ఈజీ చేశారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా చెప్పారు. వర్క్ చాలా ఫాస్ట్ గా చేశాం. అనిల్ గారి గారు ఇచ్చిన ఫీడ్ కారణంగానే ఆల్బమ్ ఇంత అద్భుతంగా వచ్చింది.

లిరిక్ రైటర్స్ గురించి ?
-భాస్కర భట్ల గారు రాసిన గోదారి గట్టు సాంగ్ మా అందరికీ గౌరవం తీసుకొచ్చింది. రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం గారితో కలసి పనిచేయడం ఆనందంగా వుంది. అన్నీ ట్యూన్ చేసిన తర్వాతే లిరిక్స్ రాయడం జరిగింది.

దిల్ రాజు గారి సపోర్ట్ గురించి ?
- దిల్ రాజు గారి సపోర్ట్ అద్భుతం. ఆయన నన్ను, నా పాటకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఓ చరిత్ర వున్న బ్యానర్ లో నాకు అవకాశం రావడం గర్వంగా వుంది.

ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కారు. నెక్స్ట్ పెద్ద సినిమాలే చేస్తారా ?
-నాకు ఇంకా ఎక్కువ పనిచేసే అవకాశం వచ్చిందని అనుకుంటాను కానీ మెట్టు ఎక్కినట్లు భావించను. నాకు ఇంకా ఎక్కువ పని చేసే అవకాశం వచ్చి, ఇంకా ఎక్కువ మందికి పని ఇచ్చే అవకాశంగానే చూస్తాను. అందరికీ పని దొరకాలనే కోరుకుంటాను.

మీరు ప్రజల నాడి బాగా పడుతున్నారనే మాట వినిపిస్తుంటుంది?
-నేను ప్రజలతో మమేకమై వుంటాను. ప్రజలకు ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని తిరిగి వాళ్ళకే ఇస్తున్నాను.

కొత్త సినిమాల గురించి ?
-మ్యాడ్ 2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డకాయిట్ సినిమాలు చేస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved