25 August 2024
Hyderabad
Sridevi Movies, a production house known for its rich taste in classic films and content that's catered for the entire family has collaborated with director Mohanakrishna Indraganti for the third time after ‘Gentleman’ and ‘Sammohanam’. The film has been titled 'Sarangapani Jathakam'.
Fronted by the versatile actor Priyadarshi, its Title and First Look poster were unveiled today. It features the excited lead actor looking at his own palm amidst the setup and background that justifies the title. Seems like the content would be around the horoscope, future prediction and some superstitions.
Speaking on the occasion, Producer Sivalenka Krishna Prasad said, "Is our future predetermined? Or, is it something we can determine for ourselves? 'Sarangapani Jathakam' is a perfect blend of comedy and thrill that answers this question. It is a classic Jandhyala-style entertaining movie that will make you laugh from start to finish. Mohanakrishna Indraganti's narration made me immediately want to produce it, and this is our third film with him under Sridevi Movies. Talented actors like Priyadarshi, Vennela Kishore, Viva Harsha, Naresh VK, Tanikella Bharani, and Srinivas Avasarala are part of this story. Heroine Roopa Koduyur, along with Vadlamani Srinivas, Roopa Lakshmi, and Kalpalatha, also played significant roles. This movie is technically advanced, featuring four songs with excellent tunes provided by Vivek Sagar. Music plays a crucial role in the film. This is the 15th film produced by our banner. After the success of 'Gentleman,' 'Sammohanam,' and 'Yashoda,' we are excited to bring another great movie to the audience. We have completed 90 percent of the shooting, covering four schedules in Hyderabad, Ramoji Film City, and Visakhapatnam. We plan to finish the remaining scenes and two songs by September 5th."
Director Mohanakrishna Indraganti said, "Faith gives strength to a man. But superstition renders even a wise person weak. 'Sarangapani Jathakam' is a story of the average middle-class man that is laced with humour. Was the protagonist perennially torn between his irrational beliefs and his love interest, ending up a failure? Or, did he successfully bail himself out? The plot is told with a heart-pounding sense of humour. While Priyadarshi has masterfully cultivated the emotions and fun in the role of the male lead, Telugu girl Roopa Kaduvayur is endearing with her performance. This movie is a comedic feast that can be watched comfortably with the whole family. Sridevi Movies, which always ensures high technical standards, has not compromised anywhere in the production of this film. PG Vinda's cinematography, Vivek Sagar's music, Marthand K Venkatesh's editing and Raveender's art direction will impress the audience."
Cast:
Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani, 'IMAX' Venkat.
Crew:
Make-Up Chief: RK Vyamajala.
Costume Chief: N Manoj Kumar.
Costume Designers: Rajesh Kamarsu, Ashwin.
Production Executives: K Ramanjaneyulu (Anji Babu), P Rasheed Ahmed Khan.
PRO: Pulagam Chinnarayana
Marketing: Talk Scoop
Co-Director: Kota Suresh Kumar.
Lyricist: Ramajogayya Sastry
Stunts: Venkat - Venkatesh
Production Designer: Raveender
Editor: Marthand K Venkatesh
Director of Photography: PG Vinda
Music Director: Vivek Sagar
Line Producer: Vidya Sivalenka
Producer: Sivalenka Krishna Prasad
Writer, Director: Mohanakrishna Indraganti
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు 'సారంగపాణి జాతకం' టైటిల్ ఖరారు
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... ''మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం 'సారంగపాణి జాతకం'. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా ఇది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఆయనతో మా సంస్థలో మూడో చిత్రమిది. ప్రియదర్శి, 'వెన్నెల' కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల వంటి హేమాహేమీలు ఈ కథలో భాగం అయ్యారు. హీరోయిన్ రూప కొడువాయూర్, వడ్లమాని శ్రీనివాస్, రూపాలక్ష్మి, కల్పలత లు కూడా మంచి పాత్రలు చేశారు. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వివేక్ సాగర్ అద్భుతమైన బాణీలు అందించారు. సంగీతానికి సినిమాలో మంచి ప్రాముఖ్యం ఉంది. మా సంస్థలో 15వ చిత్రమిది. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం', 'యశోద' - హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులకి మరో మంచి సినిమా అందివ్వబోతున్నాం. 90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం. నేటి నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం'' అని అన్నారు.
సారంగపాణి జాతకం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ, మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే 'సారంగపాణి జాతకం'. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడి రెండిటికి చెడ్డ రేవడయిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశాన్ని ఉత్కంఠభరితంగా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో చెప్పాం. హీరో పాత్రలో భావోద్వేగాలను, వినోదాన్ని ప్రియదర్శి తనదైన శైలిలో అద్భుతంగా పండించగా... అచ్చ తెలుగు అమ్మాయి రూప కడువయూర్ తన అభినయంతో కట్టి పడేస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా చూడగలిగే ఒక హాస్య సంబరం ఈ సినిమా. ఉన్నత సాంకేతిక ప్రమాణాలు అందించే శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. పీజీ విందా ఛాయాగ్రహణం, వివేక్ సాగర్ సంగీతం, మార్తాండ్ కె వెంకటేష్ కూర్పు, రవీందర్ కళా దర్శకత్వం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు.
తారాగణం:
ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్.
సాంకేతిక నిపుణులు:
మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
|