pizza

Nani is all rage in Saripodhaa Sanivaaram glimpse
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' పవర్ ప్యాక్డ్ టీజర్ విడుదల- ఆగస్ట్ 29న థియేట్రికల్ రిలీజ్

You are at idlebrain.com > news today >

24 February 2024
Hyderabad

As Natural star Nani celebrated his 40th birthday on Saturday, production house DVV Entertainment dropped the anticipated glimpse of his next, Saripodhaa Sanivaaram, with Vivek Athreya.

The one-minute-25-second glimpse opens with a voiceover (of SJ Suryah) stating rage has many forms and every person’s rage is different to that of the other. But there’s one person who uses that rage systematically and meticulously only once a week (Saturday) and he happens to be Surya (played by Nani). Surya is later seen wearing a kada and thrashing down a raft of adversaries mercilessly every Saturday. And guess what? He’s got tremendous power. His missed punch causes a hole in the wall. The glimpse ends with Vivek introducing SJ Suryah in a cop avatar in the end. He’s seen wishing happy birthday and blowing a kiss to Surya after inflicting pain on the prisoners.

Overall, the glimpse offers a peek into the world of Saripodha Sanivaaram and establishes its lead character well. Vivek Athreya, who has done soft romantic comedies so far, seems to have gone all out commercial mode with the film in the way he brought dynamism and zeal with Nani’s character. The background score by Jakey Bejoy is rousing, while the line ‘Samavarthi’ elevates the appeal of the glimpse.

Co-starring Priyanka Arul Mohan, Saripodha Sanivaaram hits the big screens on August 29 later this year in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' పవర్ ప్యాక్డ్ టీజర్ విడుదల- ఆగస్ట్ 29న థియేట్రికల్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. నానికి బర్త్ డే విషెస్ తెలుపుతూ మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

నాని పాత్ర ప్రత్యేక స్వభావాన్ని సూచించే SJ సూర్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది, అతని పాత్ర పేరు సూర్య. ప్రతి మనిషిలాగే, హీరోకి కూడా కోపం వస్తుంది, కానీ అతను దానిని ప్రతిరోజూ చూపించడు. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అతను జరిగిన సంఘటనలన్నింటినీ పేపర్‌పై వ్రాసి, శనివారాల్లో తనను ఇబ్బంది పెట్టేవారిని వేటాడడం ప్రారంభిస్తాడు. ఈ గ్లింప్స్ పోలీసుగా కనిపించిన SJ సూర్య, నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడంతో ముగుస్తుంది.

మొదటి నుంచి వివేక్ ఆత్రేయ తనదైన కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు తొలిసారిగా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. నాని క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసిన విధానం, టీజర్‌ని కట్ చేసిన విధానం ఆకట్టుకున్నాయి.

నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. అతను రగ్గడ్, స్టైలిష్ లుక్‌లో కనిపించారు. టీజర్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నానిలోని మాస్ డిస్ట్రాక్టివ్ ఎనర్జీ అందరినీ ఉర్రూతలూగిస్తుంది. అతను సిగరెట్ తాగే విధానం పాత్రకు డైనమిజాన్ని తీసుకొచ్చింది. వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని వుండగా రిక్షా తొక్కే సన్నివేశం చాలా ఎట్రాక్టివ్ గా వుంది. యాక్షన్ బ్లాక్‌లు ఇంటెన్స్ గా వున్నాయి.

మురళి జి క్యాప్చర్ చేసిన ఫ్రేమ్‌లు అత్యుత్తమంగా ఉన్నాయి, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో సమవర్ధి పాట నాని క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తం మీద, టీజర్ నాని ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది

ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved