pizza

Sasivadane: Vethika Ninnila song highlights girl's quest for her lover
‘శశివదనే’ చిత్రం నుంచి ‘వెతికా నిన్నిలా ..’ సాంగ్ రిలీజ్.. ఏప్రిల్ 19న సినిమా భారీ విడుదల

You are at idlebrain.com > news today >

09 April 2024
Hyderabad

Rakshit Atluri, hailed for his captivating portrayal in "Palasa 1978," is poised to enthrall audiences once more with his latest venture, "Sasivadane," a charming romantic escapade. With the film slated for release on April 19, 2024, the anticipation surrounding its arrival is reaching new heights, thanks to the meticulous promotional efforts by the makers. Expectations are high as Rakshit Atluri is renowned for his riveting performances and Komalee Prasad is popular for her captivating presence on the screen.

The film's enchanting melodies and captivating teaser have piqued the interest of movie buffs, setting the stage for a captivating cinematic experience. Today, the makers unveiled the latest track, "Vethika Ninnila," penned by the talented Kittu Vissapragada and delivered with soul-stirring emotion by Satya Yamini, set to the melodious composition by Saravana Vasudevan.

The song, featuring lead actors Rakshit Atluri and Komalee Prasad, delves into the female lead's heartfelt quest for her beloved, unraveling a tapestry of emotions that resonates deeply with audiences. Its poignant lyrics strike a chord with lovers, evoking profound sentiments that resonate with the soul.

In addition to the stellar lead duo, "Sasivadane" boasts a stellar ensemble cast, including Rangasthalam Mahesh, Sriman, Jabardasth Bobby, Praveen Yandamuri, and Deepak Prince, each adding depth to the narrative. The film's evocative background score by Anudeep, coupled with Shrie SaiKumaar Daara's exquisite cinematography, transports viewers to the picturesque landscapes of the Godavari region, enhancing the visual allure.

Helmed by the talented director Saimohan Ubbana and produced by Ahiteja Bellamkonda, "Sasivadane" marks a noteworthy collaboration between AG Film Company and SVS Studios Pvt. Ltd., renowned for their dedication to delivering compelling storytelling. With its blend of romance, emotion, and stellar performances, "Sasivadane" promises to captivate audiences and leave a lasting impression on their hearts. The promotions for "Sasivadane" create an impression of an intense romantic entertainer, rich in emotions and deeply rooted in the feelings of the lead pair.

Movie: Sasivadane
Banner: AG Film Company, SVS studios
Presented by Gauri Naidu
Starring: Rakshit Atluri, Komalee, Sreeman, Deepak Prince, Jabardast Bobby, Rangasthalam Mahesh
Written & Directed by: SaiMohan Ubbana
Produced By: Ahiteja Bellamkonda , Abhilash Reddy Godala
Executive Producer: Sripal Cholleti
Music: Saravana Vasudevan
Background score: Anudeep Dev
Cinematography: Shrie SaiKumaar Daara
Editor: Garry BH
Choreographer - JD
Costume Designer: Gauri Naidu
Production By: AG Film Company
CEO: Ashish Peri

‘శశివదనే’ చిత్రం నుంచి ‘వెతికా నిన్నిలా ..’ సాంగ్ రిలీజ్.. ఏప్రిల్ 19న సినిమా భారీ విడుదల

‘‘వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా
వెతికా నిన్నిలా.. వెతికా వెతికా...’’
అంటూ స‌త్య‌యామిని స్వ‌రం నుంచి వినిపించే పాట విన‌గానే ఆక‌ట్టుకుంటుంది. హీరో, హీరోయిన్‌కి మ‌ధ్య అనుకోకుండా ఎడ‌బాటు వ‌చ్చింద‌ని, అత‌ని కోసం ఆమె త‌ప‌న ప‌డింద‌ని ఈ పాట‌ను విన్న‌వారికి ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా... అంటూ సాగే హుక్ లైన్ ఈ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా చేస్తుంద‌ని అంటున్నారు శ‌శివ‌ద‌నే మేక‌ర్స్.

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’, గోదారి అటువైపో.. పాట‌ల‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ స్పంద‌న‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి వెతికా నిన్నిలా...’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శ‌ర‌వ‌ణ భాస్క‌ర‌న్‌ సంగీతం అందించిన ఈ పాట‌ను స‌త్య యామిని పాడారు. కిట్టు విస్సా ప్రగడ రాశారు.

శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

నటీనటులు:
రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక వర్గం:
సమర్పణ - గౌరీ నాయుడు, బ్యానర్స్ - ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు - అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం - సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ - శ్రీసాయి కుమార్ దారా, సంగీతం - శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ - అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ - జేడీ, సి.ఇ.ఒ - ఆశిష్ పేరి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved