pizza

"Satyabhama" will be a benchmark film in heroine-oriented films: Producers Bobby Tikka and Srinivas Rao Takkalapelly
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది - నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి

You are at idlebrain.com > news today >

4 June 2024
Hyderabad

The 'Queen of Masses,' Kajal Aggarwal, is playing the lead role in "Satyabhama." Naveen Chandra plays the pivotal role of Amarender. This film is produced by Bobby Tikka and Srinivas Rao Takkalapelly under the banner of Aurum Arts. Director Sashikiran Tikka, known for "Major," acts as presenter and presented the screenplay. "Satyabhama" is a crime thriller directed by Suman Chikkala, set for a grand theatrical release on the 7th of this month. Producers Bobby Tikka and Srinivas Rao Takkalapelly highlighted key aspects of the movie during an interview today.

- Sashikiran Tikka, director of major films, is Bobby Tikka's brother. We ventured into production after being involved in the industry for some time. "Satyabhama" marks our debut under the banner of Aurum Arts. Our goal is to deliver compelling content to audiences while providing opportunities to emerging talents. Suman, our director, makes his debut with this film. We identified singers from music bands and granted them opportunities to perform two songs.

- Although we didn't collaborate on Sashi's films, he often consulted my father and me. We shared some ideas. Following the completion of "Major," we decided to establish our own production house. We believed that having our own banner would enable us to bring our preferred stories to the screen and leverage our distribution experience.

- When we conceptualized "Satyabhama," we considered three or four options for the heroine. Kajal was our initial choice. Upon hearing the story, she immediately agreed. Typically, she takes a few days to respond, but this time, she expressed her enthusiasm right away. Kajal shared our excitement for the storyline. Naveen Chandra embraced his significant role enthusiastically.

- The storyline of "Satyabhama" draws inspiration from a real incident that occurred in the UK around twenty years ago. However, we adapted the narrative to our cultural context. When we announced "Satyabhama," some questioned why we were pursuing a heroine-oriented film instead of a hero-centric one. We believe Kajal's performance in "Satyabhama" is remarkable. An elderly viewer described it not as a heroine-oriented film but as one with heroism. Any character could assume the role of the hero in our story, but the highlight is the woman's achievement of an extraordinary feat. Sashi shared our perspective.

- Mythri Movie Makers will handle the Nizam area release of "Satyabhama," while Dheeraj Mogilineni Entertainments will oversee the release in AP. Mythri Ravi has been a consistent supporter. The film has secured excellent theater placements and a strong international release. We've finalized our OTT partner.

- The female members of the censor board praised "Satyabhama." Additionally, we're incorporating the She Safe app, which has seen 5,000 downloads, into the film. We're inviting the women who has the app and their families to a special screening. Sashi is occupied with his projects, but we aim to feature his stories under Aurum Arts. Sricharan's classical music has elevated the cinematic experience.

- Kajal provided invaluable support during filming. Her acknowledgment of Aurum Arts as her own banner brought us immense joy. Our primary focus is to make "Satyabhama" a success in Telugu before considering other languages or a pan-Indian audience for future projects.

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది - నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి

'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి.

- గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.

- శశి సినిమాలకు మేము వర్క్ చేయలేదు. కానీ తను ఫోన్ చేసి నాతో, నాన్నతో మాట్లాడేవారు. మేము కొన్ని సలహాలు చెప్పేవాళ్లం. మేజర్ సినిమా పూర్తయ్యాక మనమే ఒక ప్రొడక్షన్ హౌస్ పెడదాం అనే ఆలోచనకు వచ్చాం. సొంత బ్యానర్ అయితే మనకు నచ్చిన కథల్ని నచ్చినట్లు తెరపైకి తీసుకురావొచ్చని అనుకున్నాం. డిస్ట్రిబ్యూషన్ లోనూ మాకు అనుభవం ఉంది.

- "సత్యభామ" ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. సాధారణంగా ఆమె రెండు మూడు రోజుల తర్వాత కాల్ బ్యాక్ చేస్తా అని అంటారట. కానీ ఈ స్టోరీ లైన్ వినగానే ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. నవీన్ చంద్ర ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయనకు ఈ పాత్ర బాగా నచ్చింది.

- ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. మా మూవీ చూసిన ఒక పెద్దాయన మీది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కాదు హీరోయిజం ఉన్న మూవీ అన్నారు. మేము కథలో అనుకుంటే మరో ఏ పాత్రనైనా హీరోగా చేయొచ్చు. కానీ ఒక అసాధ్యమైన పనిని మహిళ సాధించడం అనేది ఈ కథలో హైలైట్. శశి కూడా అదే ఫీలయ్యాడు.

- మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ఏరియాలో మా "సత్యభామ" సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేస్తోంది. మైత్రీ రవి గారు మాకు ముందు నుంచీ తన సపోర్ట్ ఇస్తున్నారు. సినిమాకు మంచి థియేటర్స్ పడుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా బాగా రిలీజ్ అవుతోంది. ఓటీటీ పార్టనర్ ను లాక్ చేశాం.

- "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

- కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved