13 April 2022
Hyderabad
Disney+ Hotstar is excited to be presenting yet another show to add to the bouquet of the entertaining content offering on the platform over the last 2 years. After successful Hotstar Specials releases like 9 Hours, Parampara (Season 1 & 2), Jhansi (Season 1 & 2), Anger Tales, our latest is Save The Tigers.
Created by renowned filmmaker Mahi V Raghav and starring Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Deviyani, Jordar Sujatha and Pavani Gangireddy, Save The Tigers is slated for release on April 27 in 7 languages - Telugu, Tamil, Hindi, Malayalam, Kannada, Bengali and Marathi.
A fun take on couple squabbles, Save The Tigers creatively draws parallels between the tigers that are going extinct and husbands with both of them being expected to save, all in a humorous note. Directed by Teja Kakamanu the show is written by Pradeep Advaitam.
The show marks the debut of Mahi V Raghav’s 3 Autumn Leaves banner’s foray into digital space and we are very excited about the association.
Announcing the show, Disney+ Hotstar organised a press meet with the creators and cast of the show.
Here’s what the team had to say at the event:
Jordar Sujatha: “This is my first web project and I’m very excited about it. I play a housewife in it. It will enthrall the audience.”
Devayani: “I’d like to thank Mahi V Raghav sir for this opportunity. I can’t forget the support of the cast and crew while filming this series.”
Pavani Gangireddy: “I learnt a lot while filing the series and we, as a team, have a lot to get inspired from the same. I feel delighted to be working with Pradeep Advaitam. This is a comedy series that can be watched by all sections of audience. It’s great to have someone like Mahi V Raghav as a show runner.”
Krishna Chaitanya: “This show is all about how husbands are to be saved and pampered! It is an excellently written series with a great knack of comedy. It has a great relatability factor as well. This is the kind of content that connects with all sections of the audience.”
Abhinav Gomantam: “I worked with Pradeep at the early stages of my career and it’s my pleasure to work with him again now. Mahi sir has done a splendid job as the show runner and his contributions are invaluable. I hope this series will enthral you all from 27 April.”
Mahi V Raghav: “The production of this series was made possible only because of Disney+ Hotstar and I’d like to credit Pradeep as well for his efforts. The filming process was fun and the whole team enjoyed it. Marriage is a joke that never fails and that is what we tried to portray in the show.”
Cast: Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Jordar Sujatha, Pavani Gangireddy, Deviyani, Rohini, Gangavva, Venu Tillu, Sunaina Harshavarshan and others.
Technical crew
Creators: Mahi V Raghav, Pradeep Advaitam
Director: Teja Kakamanu
Writer: Pradeep Advaitam
DOP: SV Visweshwara
Music: Sriram Madduri
Editor: Sravan Katakaneni
ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతోన్న ‘సేవ్ ద టైగర్స్’
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోంతోంది. గత రెండేళ్లుగా పరంపర( టూ సీసన్స్ ), యాంగర్ టేల్స్, ఝాన్సీ( టూ సీజన్స్), 9 అవర్స్ వంటి విభిన్నమైన కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోన్న డిస్నీ ప్లస్ ఇప్పుడు సేవ్ ది టైగెర్స్ వంటి మరో మంచి కథతో వస్తోంది.
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత మరియు దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. అంతరించిపోతున్న పులుల్ని మొగుళ్లని కాపాడుకుందాం అనేది ఉపశీర్షిక. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజా కాకుమాను ఈ చిత్రానికి దర్శకుడు. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాల ఫేమ్ మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం షో రున్నర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోంతోంది.
మామూలుగా కుటుంబ కథా చిత్రాలంటే.. ఆడవారి బాధలే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా కుటుంబాల్లో ఆడవారి వల్ల మగవాళ్లు పడే బాధలను ఎంటర్టైనింగ్ గా చూపిస్తూ రూపొందించిన చిత్రం ఇది. ఈ తరహా చిత్రాలకు ఓటిటిలో అద్భుతమైన ఆదరణ ఉంటోంది. ఈ సిరీస్ రిలీజ్ కు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ లేటెస్ట్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా జోర్దార్ సుజాత మాట్లాడుతూ … ఇది నా ఫస్ట్ వెబ్ సిరీస్. ఇప్పటి వరకు యాంకరింగ్ చేశాను. యాక్టింగ్ చేయడం మొదటి సారి. ఇందులో హైమావతి అనే గృహిణి పాత్ర చేశాను. భర్తను మోటివేట్ చేస్తూనే విపరీతంగా సతాయిస్తూ ఉండే భార్యగా మంచి పాత్ర చేశాను.ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు ప్రదీప్, తేజ గారికి థాంక్ యు సో మచ్... " అన్నారు.
నటి దేవయాని మాట్లాడుతూ .. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహి సర్ కు థాంక్స్ చెబుతున్నాను. మా దర్శకుడు తేజ గారితో పాటు ప్రదీప్ గారి సపోర్ట్ మర్చిపోలేను. నా కో యాక్టర్ చైతన్య తో వర్కింగ్ ఎక్సపీరియెన్ బావుంది.. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి" అన్నారు..
నటి పావని మాట్లాడుతూ .. " ఈ సిరీస్ తర్వాత చాల విషయాలు నేర్చుకున్నాము. ఈ సిరీస్ చూసిన తరవాత మా వారు కొన్ని నిజాలు తెలుసుకుంటారు. నాతో పాటు నటించిన అభినవ్ నేను టామ్ అండ్ జెర్రీ లా ఉండేవాళ్ళం. అది మా పాత్రల్లో కూడా సహజంగా కుదిరింది.. " అన్నారు.
నటుడు అభినవ్ గోమఠం మాట్లాడుతూ .. నా ఫస్ట్ డేస్ లో ప్రదీప్ అద్వైతం అన్న తో పనిచేసాను. ఇప్పుడు కొంత ఫేమ్ వచ్చిన తర్వాత మల్లి అన్నతో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది. నేను మొదటి సారి కథ విన్నప్పుడు.. అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చేలా రాసుకున్నారు. వెబ్ సిరీస్ అనగానే అందరు థ్రిల్లర్ అనుకుంటారు. బట్ ఒక క్లీన్ కామెడీ తో వస్తుండటం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచుతుంది అనుకుంటున్నాను. మహి వి రాఘవ గారు ఇలాంటి కామెడీ సిరీస్ వెనక షో రన్నర్ గా ఉన్నారు. ఈ టీం తో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం టీం అంతా హార్డ్ వర్క్ చేసింది. దర్శకుడు తేజ కాకుమాను నాకు చాల కాలంగా తెలుసు. అతని ఫస్ట్ మూవీ అయినా బాగా తీసాడు. పావని తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బావుంటుంది. ఈ నెల 27 న రిలీజ్ కాబోతోన్న సిరీస్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.." అన్నారు.
చైతన్య కృష్ణ మాట్లాడుతూ ... కోవిద్ టైం లో నాకు ఈ స్క్రిప్ట్ పంపించారు. బేసిక్ టైటిల్ సేవ్ ది టైగెర్స్ అనేది తీసేస్తే.. భర్తలను కాపాడుకుందాం అనేది మెయిన్ స్టోరీ. నేను ఒక అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటీవ్ గా నటించాను. నా వైఫ్ లాయర్. అలాంటి భార్య ఉంటే ఆ భర్తలు ఎలా నలిగిపోతారు అనేది హిలేరియస్ గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి, మా డైరెక్టర్ తేజకు థాంక్స్ చెబుతున్నాను.. " అన్నారు.
షో రన్నర్ మహి వి రాఘవ మాట్లాడుతూ.. " ముందుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళ వల్లే ఈ సిరీస్ సాధ్యం అయింది. ఈ మొత్తం క్రెడిట్ అంతా ప్రదీప్ దే అంటాను . ఏ కథ అయినా రైటింగ్ టేబుల్ పైనే తెలిసిపోతుంది. ఈ విషయం లో ప్రదీప్ ది బెస్ట్ ఇచ్చాడు.నేను ఒకే ఒక కామెడీ సినిమా చేశాను. ప్రతి ఇంట్లోనూ ఒక కామెడీ స్టోరీ ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉండే జోక్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఎవరి యుద్ధం వాళ్ళది. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెబితే వినేవారు. ఇప్పుడు భార్య భర్త జాబ్స్ చేయడం వాళ్ళ ఒక డామినేటింగ్ వస్తుంది. అది ఒక సంఘర్షణ కు దారి తీస్తుంది. ఓ టి టి లో ఫామిలీ అంతా కూర్చొని చూసే పరిస్థితి లేదు. మా సిరీస్ ఖచ్చితంగా అందరు చూసేలా ఉంటుంది. ఓ టి టి లో ఏ కంటెంట్ చూడాలి అనేది ఆడియన్స్ నిర్ణయం అది. ఇవాళ రేపు ఒక సినిమా చేయాలంటే మీడియం రేంజ్ హీరో అయినా రెండేళ్ల టైం పడుతుంది. అందుకే నేను కూడా ఓ టి టి లోనే సిరీస్ లు చేయబోతున్నాను. ఓ టి టి కి యూనివర్సల్ ఆడియన్స్ ఉన్నారు. అలాంటి కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు.. ఇప్పడు మా ఈ సేవ్ ది టైగెర్స్ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది.." అన్నారు.
ఈ నెల 27 నుంచి స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ లో నటీ నటులు
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ,జోర్దార్ సుజాత,పావని, దేవయాని, గంగవ్వ, వేణు టిల్లు, హర్షవర్ధన్, రోషిని, సద్దాం తదితరులు.
సాంకేతిక నిపుణులు :
క్రియేటర్స్ : మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం
దర్శకత్వం : తేజ కాకుమాను
రచన : ప్రదీప్ అద్వైతం
డి ఓ పి : ఎస్ వి విశ్వేశ్వర్
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని