pizza

Global Star Ram Charan To Launch Carnage Of #SDT18 On Dec 12th
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డిసెంబర్ 12న లాంచ్ చేయనున్న మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ #SDT18 కార్నేజ్‌

You are at idlebrain.com > news today >

09 December 2024
Hyderabad

Mega Supreme Hero Sai Durgha Tej’s much-awaited ambitious project #SDT18 under the direction of debutant Rohith KP, with K Niranjan Reddy and Chaitanya Reddy of Primeshow Entertainment bankrolling it is fast progressing with its shoot. Given the blockbuster form of Sai Durgha Tej and also the Pan India recognition earned by PrimeShow Entertainment, post the sensational hit of HanuMan, #SDT is already making enough noise. The glimpse called "Intrude into the World of Arcady" which gave a sneak peek into the fantastic world created for the movie further heightened the curiosity.

Now, the makers came up with a big update. The film’s Carnage will be unveiled on December 12th. None other than Global Star Ram Charan will launch Carnage of SDT18 at a grand event at Shourya Convention Centre, Police Indoor Grounds in Yousufguda. With Ram Charan also gracing the event as a chief guest, the event is sure to attract wider audiences.

Sai Durgha Tej plays a first-of-its-kind powerful character in the movie, as shown in the glimpse. The highly talented Aishwarya Lekshmi is the leading lady opposite SDT.

Sensational composer B Ajaneesh Loknath provides the music for this film that will have a pan-India release in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam.

Cast: Sai Durgha Tej, Aishwarya Lekshmi

Technical Crew:
Writer, Director: Rohith KP
Producers: K Niranjan Reddy, Chaitanya Reddy
Banner: Primeshow Entertainment
Music: B Ajaneesh Loknath

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డిసెంబర్ 12న లాంచ్ చేయనున్న మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ #SDT18 కార్నేజ్‌

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. #SDT18 ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. "ఇంట్రూడ్ ఇంటు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ" గ్లింప్స్ సినిమా కోసం క్రియేట్ చేసిన అద్భుత ప్రపంచంలోకి స్నీక్ పీక్ ఇచ్చింది.

ఇప్పుడు, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌తో వచ్చారు. #SDT18 కార్నేజ్ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్, పోలీస్ ఇండోర్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ SDT18 కార్నేజ్‌ని లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో ఇది మ్యాసీవ్ ఈవెంట్ గా ప్రేక్షకులను అలరించనుంది.

గ్లింప్స్ లో చూపిన విధంగా సాయి దుర్గ తేజ్ ఈ చిత్రంలో ఫస్ట్- అఫ్ ఇట్స్ కైండ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్-ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved