Action King Arjun’s Directorial Venture Seetha Payanam Trailer Unveiled, Promises Love, Action & Drama
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్.. ఫిబ్రవరి 14న చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బారి ఎత్తున విడుదల
Action King Arjun returns to the director’s chair with Seetha Payanam, produced under his banner Shree Raam Films International. The film marks the debut of his daughter Aishwarya Arjun, leading an impressive ensemble that includes Niranjan, Sathyaraj, Prakash Raj, and Kovai Sarala. Arjun himself appears in a key cameo, while his nephew, Action Prince Dhruva Sarja, boosts the excitement with a special appearance. The film hits theatres on February 14th, and the makers have just dropped the theatrical trailer.
The story revolves around a young chef raised by her overprotective father. During a long drive, she reluctantly offers a lift to a stranger- on the condition that every phone call he receives is on loudspeaker. What starts off as a breezy journey gradually takes a darker turn, leading to an unexpected twist.
Arjun’s experience is evident in both his writing and direction. The fresh narrative, clean storytelling, and his impactful special appearance stand out. Niranjan makes an impressive debut as the male lead, while Aishwarya Arjun looks charming and delivers a confident, mature performance.
Sathyaraj shines as the protective father, and Prakash Raj brings emotional weight- particularly in a poignant sequence about the real meaning of marriage. Dhruva Sarja’s action-packed cameo adds extra punch.
G Balamurugan’s cinematography offers vibrant visuals, while Melody King Anup Rubens elevates the mood with a soulful score. Sai Madhav Burra’s dialogues land effectively. Ayub Khan handles the editing, and Kick Ass Kali amps up the action with dynamic stunt choreography.
With just a week to go for its Valentine’s Day release, the trailer has set high expectations for Seetha Payanam.
Cast: Niranjan, Aishwarya Arjun, Sathyaraj, Prakash Raj, Kovai Sarala, Action King Arjun, Action Prince Dhruva Sarja & others
Technical Crew:
Banner: Shree Raam Films International
Story – Screenplay – Producer – Director: Action King Arjun
Dialogues: Dr. Sai Madhav Burra
Music: Melody King Anup Rubens
Cinematography: G. Balamurugan
Editor: Ayub Khan
Art Directors: Mohan B. Keri, Shiva Kamesh D., CH Krishna
Fights: Kick Ass Kali
Line Producer: UL. Murthy
Choriography: Lalitha shobi, Shresti Verma
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్.. ఫిబ్రవరి 14న చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బారి ఎత్తున విడుదల
మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ట్రైలర్ అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను.. ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. బ్యూటీఫుల్ విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. కారులో హీరో, హీరోయిన్లు చేసే ప్రయాణం.. వారిద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మెయిన్ అస్సెట్‌గా నిలిచేట్టున్నాయి. ఈ ట్రైలర్‌లో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా చేసిన పోరాట సన్నివేశాలు మరింత అట్రాక్షన్‌గా నిలిచాయి.
మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ‘సీతా పయనం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు : నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
స్టోరీ - స్క్రీన్ ప్లే - ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్
డైలాగ్స్: Dr. సాయి మాధవ్ బుర్ర
మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: G. బాల మురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ
ఫైట్స్ : కిక్ యాస్ కాళీ
లైన్ ప్రొడ్యూసర్: UL. మూర్తి