pizza

Aadi Saikumar’s Supernatural Horror Thriller Shambala Launched, Regular Shoot Commenced
ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

You are at idlebrain.com > news today >

20 December 2024
Hyderabad

Currently, audiences are showing great interest in stories set in otherworldly realms, far from reality. One such film, set in a mystical world, is Shambala. The previously launched title poster hinted that the movie is about to take the audience into a completely different world, one that has never been experienced before.

Aadi Sai Kumar, known for his discipline and dedication, has been picking projects with different scripts. He is making sure every movie is dissimilar from the other. He plays a challenging role as a geo-scientist in this film, which was launched grandly in the presence of the core team. The regular shoot also commenced in RFC, Hyderabad.

Directed by Ugandhar Muni, who gained recognition for his distinctive film A (Ad Infinitum), Shambala will follow a unique tone and world, much like his debut film. Archana Iyer is the leading lady opposite Aadi Saikumar. Swasika, who is part of #Suriya45, plays a key role, while Ravi Varma, Meesala Laxman, and Madhunandan will be seen in crucial roles.

This supernatural horror thriller will present a storyline that has never been explored on Indian screens before. Ugandhar Muni, who trained in film making at the New York Film Academy, is making Shambala with high technical standards and grand visuals, aiming for a Hollywood-level production.

The producers, Rajasekhar Annabhimoju and Mahidhar Reddy, are ensuring that the film is made without compromising on costs, especially in terms of visuals and technical aspects, making it a "top-class" production.

The music for the film is being composed by Indian musician Sriram Madduri, who has previously worked with legendary Hollywood composers like Hans Zimmer, known for films such as Dune, Inception, Batman, and Dunkirk. The background score will feature entirely new sounds, never heard in any previous Indian film.

The film’s technical crew will be revealed soon.

ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ నూతన ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని తీస్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రయోగాలు చేస్తున్న ఆది సాయి కుమార్ హీరోగా.. 'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘శంబాల’.

శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంబాల చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఖర్చులకు రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముఖ్యంగా విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. డ్యూన్, ఇన్‌సెప్షన్, బ్యాట్ మాన్, డంకిర్క్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్వరకర్తలతో శ్రీరామ్ మద్దూరి కలిసి పని చేశారు. నేపథ్య సంగీతంలోనూ కొత్త మార్క్ క్రియేట్ చేయనున్నారు. త్వరలోనే మిగిలిన వివరాలను చిత్రయూనిట్ ప్రకటించనుంది.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved