pizza

#Sharwa37 Kerala schedule wrapped up
శర్వానంద్, రామ్ అబ్బరాజు, రామబ్రహ్మం సుంకర, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ #Sharwa37 కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

You are at idlebrain.com > news today >

25 September 2024
Hyderabad

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా టీం 10 రోజుల పాటు జరిగిన కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

శర్వా, సాక్షి వైద్య డైనమిక్ పెర్ఫార్మెన్స్ లతో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు. దీంతో పాటు పృథ్వీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎక్సయిటింగ్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.

శర్వా37 టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్.

హిలేరియస్ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫర్. భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

తారాగణం: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved