Under Ilaiyaraaja’s Musical Composition, Oscar-winning MM Keeravani writes lyrics for ‘Edo Ye Janmalodo’ song from ‘Shashtipurthi’
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో తొలిసారి పాట రాసిన ఆస్కార్ విజేత కీరవాణి... త్వరలో 'షష్టిపూర్తి' సినిమాలోని 'ఏదో ఏ జన్మలోదో' సాంగ్ విడుదల
Featuring hero Roopesh in the lead role, “Shashtipurthi’ film is currently under production. The film is produced by MAA AAI Productions. This film has veteran actor Rajendra Prasad and double national award-winning Archana in the lead roles. Incidentally, this is the first time this legendary combo is sharing the screens after “Ladies Tailor” which released 38 years ago. Akanksha Singh is playing the female lead alongside Rupesh in the film. Pavan Prabha is directing the film while Rupesh Chowdary is producing it.
The stage is now set for the grand release of “Edo Ye Janmalodo” song from the album. The special thing about this song is that it has the music composed by Ilayaraja while Oscar-winning MM Keeravani has penned the lyrics for this song. This song marks the legendary collaboration of two of the greatest musical exponents in Indian cinema.
On the occasion, the director of the film, Pavan Prabha Said this film has five songs in total. “Chaitanya Prasad compiled the lyrics for four songs while Keeravani Garu penned the lyrics for the fifth song. Keeravani Garu was considerate enough, and also luckily had some spare time in Chennai to help us with the lyrics. This song is going to be a very special one as it marks the coming together of Ilaiyaraaja Garu and Keeravani Garu.”
Producer Rupesh Chowdary said “what more could we have asked for rather than a song composed by Ilaiyaraaja Garu and the lyrics compiled by Keeravani Garu? This film is going to be a family oriented drama with many relevant points. It was a thoroughly rewarding experience to work with veterans like Rajendra garu Prasad and Archana garu. We have completed the production and we will be announcing the release date soon.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో తొలిసారి పాట రాసిన ఆస్కార్ విజేత కీరవాణి... త్వరలో 'షష్టిపూర్తి' సినిమాలోని 'ఏదో ఏ జన్మలోదో' సాంగ్ విడుదల
రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని 'ఏదో ఏ జన్మ లోదో' సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు.
'ఏదో... ఏ జన్మలోదో... ఈ పరిచయం' సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే... ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించగా, ఆస్కార్ విజేత - ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ''మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే ఓ పాటకు కీరవాణి గారు అయితే బావుంటుందని అనిపించింది. చైతన్య ప్రసాద్ గారికి కీరవాణి గారు క్లోజ్. ఆయన ద్వారా అప్రోచ్ అయ్యాము. లక్కీగా ఆ టైంలో కీరవాణి గారు చెన్నైలో ఉన్నారు. లంచ్ టైంలో వెళ్లి కలిశాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఓకే అన్నారు. మేం స్టూడియోకు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా చిత్ర బృందం చేసుకున్న అదృష్టం. కీరవాణి గారు ఇప్పటివరకూ 60 పై చిలుకు పాటలు రాశారు కానీ , ఇళయరాజా గారి బాణీ కి రాయడం ఇదే ప్రథమం. అది కూడా కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషం '' అని అన్నారు.
సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ''ఇళయరాజా సంగీతం, కీరవాణి సాహిత్యంతో కూడిన పాట మా సినిమాలో ఉండటం కంటే ఇంకేం కావాలి? ఈ అవకాశం హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ పాట అందరికీ నచ్చుతుంది. మిగతా పాటలూ బాగా వచ్చాయి. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి సీనియర్ హీరో హీరోయిన్లతో నటించడం నాకొక లెర్నింగ్ ప్రాసెస్ అండ్ బ్లెస్సింగ్. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు.
రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్, 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి , రుహీనా, రామ్మోహన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.
'షష్టిపూర్తి' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ కంట్రోలర్ : బిఎస్ నాగిరెడ్డి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్టంట్స్ : రామకిషన్, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్: ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి - రెహమాన్ - చైతన్య ప్రసాద్, కో డైరెక్టర్ : సూర్య ఇంజమూరి, డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్ : మా ఆయి ప్రొడక్షన్స్ LLP, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి, దర్శకుడు: పవన్ ప్రభ.