pizza

'Shivam Bhaje': First Look has Ashwin Babu showing his explosive rage!
గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' ఫస్ట్ లుక్ విడుదల!!

You are at idlebrain.com > news today >

11 May 2024
Hyderabad

'Shivam Bhaje' has quite a divine ring to it. And that's the title of Ashwin Babu's upcoming movie directed by Apsar and produced by Maheswara Reddy of Ganga Entertainments, which is making its debut. The film's first look was released today.

The first look is in tune with the title poster released recently. In the title poster, Lord Shiva's imagery was indicated. And now, we see Ashwin Babu in his Raudra form, baying for the blood of villains. He is seen single-handedly holding a heavy-bodied goon and attempting to cast him away. Seen in the poster also is a Trident and the idol of a powerful divine. Action, thrills and sentiment can be expected from the movie.

Ashwin, who has previously done 'Hidimbha' and 'Raju Gari Gadhi', is gearing up for the movie's release in June. 'Shivam Bhaje' has already completed its shoot.

Starring Bollywood actor Arbaaz Khan in a key role, the film has Digangana Suryavanshi as the heroine. The makers said that Hyper Aadi, Sai Dheena, Murali Sharma, Brahmaji and Tulasi have key roles. Devi Prasad, Ayyappa Sharma and comedian Shakalaka Shankar will also be seen.

Vikas Badisa and Dasaradhi Shivendra of 'HanuMan' fame are the film's music director and cinematographer, respectively. The latter recently won the Best Cinematography Award at the Dadasaheb Phalke Film Festival.

గంగా ఎంటర్టైన్మంట్స్ 'శివం భజే' ఫస్ట్ లుక్ విడుదల!!

అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'శివం భజే'.

ఈ చిత్ర దర్శకుడు అప్సర్. ఇటీవల విడుదలైన టైటిల్ 'శివం భజే' అందరి దృష్టిని ఆకర్షించగా ఈరోజు చిత్రం నుండి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో అశ్విన్ కనపడుతున్నారు. అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనక దేవుడి విగ్రహం చూస్తుంటే చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'శివం భజే'. కొత్త కథ, కథనాలతో అప్సర్ దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. టైటిల్ కంటే ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి లాంటి నటులు మా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 'బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర ఈ చిత్రంలో అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యప్తంగా జూన్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, "మా 'శివం భజే' టైటిల్ కి మించిన స్పందన ఫస్ట్ లుక్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. మా నటీ నటులు, సాంకేతిక నిపణులు, మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారి సహకారంతో అంచనాలకి మించి చిత్రం రూపొందింది. మా టీజర్, పాటలు విడుదల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అన్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved