pizza

Renowned Lyricist Shiva Shakthi Datta Passes Away
ప్రముఖ గేయ రచయిత శివ శక్తి దత్తా కన్నుమూత..

You are at idlebrain.com > news today >

08 July 2025
Hyderabad

A wave of grief has engulfed music composer M.M. Keeravani's family, as his father Shiva Shakthi Datta passed away on Monday night at his residence. Aged 92, Datta was a respected lyricist and the elder brother of acclaimed screenwriter Vijayendra Prasad.

Shiva Shakthi Datta was born Koduri Subbarao in Kovvur, near Rajahmundry. Passionate about the arts from an early age, he left home to study at an arts college in Mumbai. After two years, he returned to Kovvur and began working as an artist under the pen name "Kamalesh". Deeply inclined towards music, he also learned to play the sitar, harmonium, and guitar.

Later, he moved to Madras (now Chennai) and entered the film industry alongside his brother Vijayendra Prasad. Their breakthrough came with the 1988 film "Janaki Ramudu", directed by K. Raghavendra Rao, starring Nagarjuna and Vijayashanti, where Datta worked as the screenplay writer.

Datta also penned lyrics for several notable films, including Baahubali 1, Baahubali 2, Chatrapathi, Rajanna, Kathanayakudu, Hanuman, and Sai. One of his most iconic works is the popular track "Saahore Baahubali".

He is survived by three children - M.M. Keeravani, Kalyani Malik, and Shiva Sree Kanchi. He was also the paternal uncle of celebrated filmmaker S.S. Rajamouli.

Several film personalities expressed their condolences. Pawan Kalyan tweeted, "I was saddened to hear about the demise of Keeravani’s father, Shiva Shakthi Datta garu. He had immense love for both the arts and literature. My heartfelt condolences to his family."

ప్రముఖ గేయ రచయిత శివ శక్తి దత్తా కన్నుమూత..

సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. శివ శక్తి దత్తా మరియు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇద్దరూ సోదరులు. ఈయన ఈయన వయసు 92 సంవత్సరాలు. ఈయన పలు సినీ గీతాలను రచించారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఈయన జన్మస్థలం రాజమండ్రి సమీపంలో గల కొవ్వూరు. మొదటి నుండీ ఈయనకు కళల పట్ల ఆసక్తి ఉండటంతో, ఇంటి నుండి వెళ్ళిపోయి, ముంబయి లో ఒక ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ కొవ్వూరు తిరిగొచ్చి, 'కమలేష్' అను కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. సంగీతంపై మక్కువతో సితార్, హార్మోనియం మరియు గిటార్ కూడా నేర్చుకోవడం జరిగింది.

తరువాత మళ్ళీ మద్రాస్ వెళ్ళిపోయి, సోదరుడు విజయేంద్రప్రసాద్ తో సినీ రంగం ప్రవేశం చేశారు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, నాగార్జున మరియు విజయశాంతి నటించిన 'జానకి రాముడు' సినిమాతో వీళ్ళిద్దరకూ మంచి గుర్తింపు రావడం జరిగింది. 1988 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు శివ దత్తా స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశారు. ఈయన బాహుబలి 1, భాహుబలి 2, ఛత్రపతి, రాజన్న, కథానాయకుడు, హనుమాన్, సై వంటి సినిమాల్లో కొన్ని పాటలను కూడా రచించారు. 'సాహోరే బాహుబలి' అనే పాట ఈయన రాసిందే. ఈయనకు ముగ్గురు సంతానం. కీరవాణి, కల్యాణి మాలిక్ మరియు శివశ్రీ కంచి. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఈయన పెద్ద నాన్న. శివ శక్తి దత్తా మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు. కీరవాణి తండ్రి, శివ శక్తి కన్నుమూశారని తెలిసి చింతించాను, ఆయనకు కళలన్నా సాహిత్యమన్నా ఎంతో అభిమానం, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ వేయడం జరిగింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved