pizza

Harish Shankar, Allu Aravind Launched The Concept Poster And First Look Of Deepak Saroj, V Yeshasvi, Shree Radha Damodar Studios and Vihaan & Vihin Creations’ Siddharth Roy
దీపక్ సరోజ్, వి యేశస్వి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ ‘సిద్ధార్థ్ రాయ్’ కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన హరీష్ శంకర్, అల్లు అరవింద్

You are at idlebrain.com > news today >
Follow Us

15 February 2023
Hyderabad

Young chap Deepak Saroj, a very popular child artist who worked with star heroes like Balakrishna, Prabhas, Allu Arjun, Mahesh Babu, and Ravi Teja and star directors like Trivikram Srinivas, Sukumar, Boyapati Sreenu for films like Athadu, Arya, Pournami, Bhadra, Legend etc., is making his debut as a hero with an upcoming film to be produced jointly by Jaya Adapaka, Pradeep Pudi and Sudhakar Boina under the banners of Shree Radha Damodar Studios and Vihaan & Vihin Creations as Production No 1. Debutant V Yeshasvi who worked under big-wig directors like Harish Shankar and Vamshi Paidipally is directing the movie.

The film’s title and first look have been unveiled today. The film is titled Siddharth Roy and the concept poster was unveiled by Harish Shankar, while Allu Aravind launched the first look poster. An eccentric life story is the tagline of the movie and both posters strike a chord with the youth. While in one poster Deepak Saroj appears with two cigarettes in his mouth and holding a red rose in his hand. Sporting long hair and a beard, Deepak is seen with blood all over his dress. The other poster sees him locking lips with his girlfriend played by Tanvi Negi. Needless to say, Siddharth Roy is a New Generation love story.

Although the movie is being made with debutants, it will have some popular technicians handling different crafts. Sam K Naidu, Radhan, and Prawin Pudi take care of the cinematography, music, and editing departments respectively.

The film has already finished its principal shoot in the rich and beautiful locations of Hyderabad and Vizag. The post-production work of the film is in full swing and aiming for a summer release.

The makers thanked director Harish Shankar garu and Producer Allu Aravind garu for obliging their request and launching the concept and first look posters. “We personally thank Harish Shankar garu who gave us the Title “SIDDHARTH ROY” which was supposed to be named for his film,” said they.

Cast: Deepak Saroj, Tanvi Negi, Nadini, Anand, Kalyani Natarajan and Mathew Varghese

Technical Crew:
Story, Screenplay, Dialogues and Direction: V Yeshasvi
Producers: Jaya Adapaka, Pradeep Pudi and Sudhakar Boina
Banners: Shree Radha Damodar Studios & Vihaan and Vihin Creations
Line Producer: B.Shyam Kumar
Director of Photography: Sam K Naidu
Co-Writers: Anwar Mohammad, Ludhir Byreddy
Music Director: Radhan
Editor: Prawin Pudi
Art: Chinna
Production Designer: Bala Soumithri
Action: Prithvi
Choreography: Sankar , Eshwar Penti
Lyrics: Ananth SriRam, Balaji , Purna Chary and V Yeshasvi

దీపక్ సరోజ్, వి యేశస్వి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ ‘సిద్ధార్థ్ రాయ్’ కాన్సెప్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన హరీష్ శంకర్, అల్లు అరవింద్

బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, బోయపాటి శ్రీను వంటి స్టార్ డైరెక్టర్లతో అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్ వంటి చిత్రాలకు పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ యంగ్ చాప్ దీపక్ సరోజ్.. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సిద్ధార్థ్ రాయ్’ అనే టైటిల్ పెట్టారు. కాన్సెప్ట్ పోస్టర్‌ను హరీష్ శంకర్ ఆవిష్కరించగా, అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్ ఎక్ సెంట్రిక్ లైఫ్ స్టొరీ’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. రెండు పోస్టర్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లతో, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు గడ్డంతో, దీపక్ తన దుస్తుల మొత్తం రక్తంతో కనిపిస్తున్నాడు. మరో పోస్టర్‌లో లవర్ పాత్ర పోషించిన తన్వి నేగి తో లిప్ లాక్ చేస్తూ కనిపించాడు. సిద్ధార్థ్ రాయ్ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కొత్తవారితో ఈ చిత్రం రూపొందుతున్నప్పటికీ, ఇందులో కొంత మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు . సామ్ కె నాయుడు కెమరా మెన్ గా, రాధన్ సంగీత దర్శకుడిగా ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్‌లోని రిచ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెప్ట్ , ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌గారికి, నిర్మాత అల్లు అరవింద్‌గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాకి “సిద్ధార్థ్ రాయ్” అనే టైటిల్‌ని పెట్టిన హరీష్ శంకర్‌గారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని తెలిపారు.

తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, నాదిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు

సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యేశస్వి
నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్ , విహిన్ క్రియేషన్స్
లైన్ ప్రొడ్యూసర్: బి.శ్యామ్ కుమార్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సామ్ కె నాయుడు
కో రైటర్స్ : మహమ్మద్ అన్వర్, లుధీర్ బైరెడ్డి
సంగీతం : రాధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ : చిన్నా
ప్రొడక్షన్ డిజైనర్: బాల సౌమిత్రి
యాక్షన్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శంకర్, ఈశ్వర్ పెంటి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్, బాలాజీ, పూర్ణా చారి, వి యేశస్వి

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved