Sigma pre release event
‘సిగ్మా’ ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. సందీప్ కిషన్ సినిమాలు వెరైటీగా ఉంటాయి. సంజయ్ వాళ్ల నాన్నగారిలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘సిగ్మా’ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి
సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నేను నేరుగా కాకా షూటింగ్ నుంచి వస్తున్నాను. ఏడు గంటల వరకు షూటింగ్ అయింది. త్వరగా ఫినిష్ చేయండి, ఈవెంట్‌కి వెళ్తానని చెప్పాను. అక్కడ అందరూ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అన్నారు. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. కానీ నేను మాత్రం ఒక వేడుకకు రావడం బాధ్యతగా ఫీల్ అవుతాను. ఇలాంటి యువ ప్రతిభావంతులు సినిమా చేసిన అది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎంతోకొంత వాళ్లకి ఉపయోగపడాలని, వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చే నాలుగు మాటలు చెప్పాలనే భావన నాకు కలుగుతుంది. నాకు ఎప్పుడూ కూడా ఒక వేడుకకు రావడం శ్రమ కాదు, అది ఒక బాధ్యత అనిపిస్తుంది. సందీప్ నన్ను చాలా ఇష్టపడతాడు. తను మా కుటుంబ సభ్యుడిలాంటివాడే. తనతో నాకు చాలా అనుబంధం ఉంది. నాకు సంజయ్, సందీప్ పట్ల ఇష్టం ఉంది. సంజయ్ తాతగారు నాకు ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. ఆయన మనవడు డైరెక్ట్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఈ వేడుకకు రావాలనిపించింది. అలాగే విజయ్ సినిమాలకు కూడా మేము ముహూర్తానికి వెళ్లడం జరిగింది. అలాంటి కుటుంబంలో ఒక పిల్లవాడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ వేడుకకు రావడం నాకు చాలా సంతోషం. సంజయ్‌ని చూస్తే విజయ్‌ని చూసినట్టుగా ఉంటుంది. తను ఎందుకు హీరో కాకూడదు అని అడిగినప్పుడు, నాకు దర్శకత్వం, రచన అంటే ఇష్టం అని చెప్పాడు. అది వాళ్ల తాతగారు, నాన్నామ్మ ద్వారా వచ్చుంటుంది. సంజయ్ తాతగారు, గారి లాగే సంజయ్ కూడా తన ప్యాషన్ తో డైరెక్షన్‌లో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. దానికి ఈ రోజు నాంది అని భావిస్తున్నాను. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘ఇరుముడి’ గొప్ప విజయాన్ని సాధించింది. అదే పరంపరలో ‘సిగ్మా’ కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సందీప్ చాలా వెరైటీ సినిమాలు చేస్తుంటాడు. తనని చూస్తుంటే నా యంగర్ డేస్‌లో నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. తను కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో చూపే శ్రద్ధ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకతను నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. ‘సిగ్మా’ అంటే తనకు నచ్చింది చేసే వ్యక్తి. బహుశ ఇందులో హీరోది అలాంటి క్యారెక్టర్. అందుకే ఈ జెన్-జీ జనరేషన్‌కి అర్థమయ్యేలా, వాళ్ల భాషలోనే అలాంటి ఒక యంగ్ డైరెక్టర్ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇది చాలా కొత్త ఆలోచన. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. చాలా హుషారుగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ నాకు చూపించాలని కోరుతున్నాను.ఫరియా ఒక సందర్భంలో స్టేజ్ మీద నాతో డాన్స్ చేయించింది. ఆ వీడియో ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌కి కంగ్రాచులేషన్స్. మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా చేస్తే అది సూపర్ హిట్. ఈ సినిమా కూడా హిట్ చేసి నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను. తమన్ ఎప్పుడు కూడా నా మనసులో ఉంటాడు. కాక ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కూడా 30 శాతం అయిపోయింది. మంచి జోష్‌తో ఉన్నాడు. తమన్ ప్రామిస్ చేసినట్టుగా ఈ సంక్రాంతి మనది. సిగ్మాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, టెక్నీషియన్స్‌కి అందరికీ పేరుపేరునా ఆల్ ది బెస్ట్. పరిశ్రమకి కొత్తవాళ్లు రావాలి. పరిశ్రమ కొత్త పుంతలు తొక్కాలి. తెలుగు పరిశ్రమలో ఎవరైనా సరే మంచి కంటెంట్ ఇస్తే వాళ్లకి స్వాగతం చెప్తాం. సంజయ్ చేసిన సినిమాని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు, సూపర్ హిట్ చేస్తారని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జైహింద్.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలో మా జనరేషన్‌కి, మా తర్వాత వచ్చే జనరేషన్‌కి గురువు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చూడని బాక్సాఫీస్ రికార్డులు లేవు. ఆయన మా అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందంటే దానికి పునాది వేసింది మెగాస్టార్ చిరంజీవి గారే. నా 16 ఏళ్ల కెరీర్‌లో 22 తెలుగు సినిమాలు, 9 తమిళ్ సినిమాలు చేశాను. రెండు హిందీ ప్రాజెక్ట్స్ చేశాను. ఫస్ట్ టైం నా ఈవెంట్‌కి ఇంత పెద్ద స్టార్ రావడం. నేను ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదు. నాకు వచ్చింది నా స్టైల్‌లో చేసుకుంటూ వెళ్లాను. ఫస్ట్ టైం నేను ఆయనని అడగడం, ఆయన నా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు చాలా స్వీట్ అండ్ క్యూట్. ఆయన నుంచి మాకు దీపావళి గిఫ్ట్స్ వస్తుంటాయి. వాట్సాప్‌లో స్టిక్కర్ పంపిస్తుంటారు. అది మాటల్లో చెప్పలేని ఆనందం. లైకా సంస్థకి థాంక్యూ. సంజయ్ డ్రీమ్‌ని నమ్మి నాతో సినిమా తీసినందుకు వారికి ధన్యవాదాలు. సంజయ్ నాకు కథ చెప్తాడని ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను నమ్మలేదు. నిజంగానే తను వచ్చి నాకు చెప్పాడు. చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఈ సినిమాకి కథ ఎవరికైనా ముందే చెప్పావా అని అడిగాను. తనకు దుల్కర్‌కి చెప్పానని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న బిజీ వల్ల అతనికి కుదరలేదు. మరి నాకెందుకు? నేనే ఎందుకు? అని అడిగితే అప్పుడు తను ఇచ్చిన సమాధానం.. నా 16 ఏళ్ల కెరీర్‌లో నేను పడిన కష్టానికి తగిన ఫలితం అనే ఆనందంగా అనిపించింది. తను నాకు ఒక తమ్ముడిలాంటి వాడు. ‘సిగ్మా’ ఫన్, యాక్షన్, కామెడీ. అలాగే యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. యాక్షన్ రెగ్యులర్‌గా ఉండదు. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓవర్ బిల్డప్ ఉండదు. 70 రోజుల్లో తీస్తానని చెప్పి 63 రోజుల్లోనే తను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేశాడు. ప్రొడ్యూసర్లు ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్‌లో ఉన్నారు. తమన్ గారు చాలా బాగా డ్యూటీ చేశారు. మీరు థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేస్తారు. స్పీకర్లు పగులుతాయి. ఇది నా సినిమా లేదా విజయ్ గారి అబ్బాయి సినిమా అని కాదు. స్వయంకృషితో, తన కష్టం మీద తానే నిలబడతానని ఒక 24 ఏళ్ల దర్శకుడి కల తప్పకుండా ఈ సినిమా మీరందరూ థియేటర్‌లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది సినిమా యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. హీస్ట్, ట్రెజర్ హంట్ లాంటి కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అవుతారు. ‘సిగ్మా’ టీమ్ అందరికీ థాంక్యూ. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన సందీప్‌కి థాంక్యూ. ఫారియాకి ఈ సినిమా తమిళ్‌లో మెమరబుల్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌కి థాంక్యూ. అక్టోబర్ 2న మీ అందరి ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. తమన్ గారికి థాంక్యూ. చాలా అద్భుతమైన, కొత్త ఆల్బమ్ ఇచ్చారు. ఇది చాలా మెమొరబుల్ ప్రాజెక్ట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఆయన ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మా కోసం సమయం తీసుకుని, నా లాంటి డెబ్యూ ఫిలిం మేకర్‌ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆయన మా అందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్యూ. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఫిలిం. విజయ్ గారితో నేను ‘వారిసు’ సినిమా చేశాను. ఇప్పుడు సంజయ్ సినిమాకి మ్యూజిక్ చేయడం హ్యాపీగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద బాధ్యత. తను చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీశాడు. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంటుంది. సంజయ్‌లో చాలా క్లారిటీ ఉంది. చాలా డౌట్ ఎంత పర్సన్. తనలో చాలా వాల్యూస్ ఉన్నాయి. తను మనిషిగా నాకు చాలా ఇష్టం. మెగాస్టార్ తో ఒక మంచి కమర్షియల్ సినిమాకి పనిచేయడం ఎప్పటినుంచో ఉంది. అది కాకాతో తీరబోతుంది. ‘బ్రూస్ లీ’లో నాకు ఒక పది నిమిషాలు చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు పూర్తి సినిమా చేసే అవకాశం దక్కింది. మెగాస్టార్ అభిమానులందరికీ మాట ఇస్తున్నాను.. మాట నిలబెట్టుకుంటాను. ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు షూటింగ్ చేసి ఆయన ఈ వేడుకకు వచ్చారు. ఆయన కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. మా గుండెల్లో ఉన్న ప్రేమను జనవరిలో చూస్తారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ గుడ్ లక్. డెఫినెట్‌గా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ. చిరంజీవి గారిని ఎప్పుడు కలిసినా నాలో ఉన్న డాన్సర్ బయటికి వస్తుంది. అంతగా ఇన్‌స్పైర్ చేసిన చిరంజీవి గారికి థాంక్యూ. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ‘సిగ్మా’ యాక్షన్-అడ్వెంచర్ కమర్షియల్ ఎంటర్టైనర్. మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సినిమా కోసం నేను చాలా ఎక్సైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. సంజయ్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
చోటా కె. నాయుడు మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. సందీప్‌ని ఎప్పుడు కలవడానికి వెళ్లినా కొత్త కాన్సెప్టులు, కొత్త కొత్త ఐడియాలు చెప్తుంటాడు. తను సినిమా తప్పితే ఇంకేమీ మాట్లాడడు. తను ఇంత పాషన్ గా పని చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తొలిసారి డైరెక్షన్ చేస్తున్న సంజయ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఎస్కేఎన్ మాట్లాడుతూ. చిరంజీవి గారు ఎన్నో సినిమాలకి సపోర్ట్ చేస్తూ విజయంలో భాగస్వామి అయ్యారు. ఆయన ప్రత్యేకంగా సినిమాలను సపోర్ట్ చేయడానికి అంటూ కొన్ని డేట్స్‌ను కేటాయించుకుంటారు. సందీప్ కిషన్ గారు టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాగే ఆయన అప్‌కమింగ్ టాలెంట్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఆయన మంచి మనసుకు ఈ సినిమా రెండు భాషల్లో చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జేసన్ అనుకుంటే వందో మెట్టు నుంచి ఆయన జర్నీ స్టార్ట్ చేయగలరు. కానీ ఆయన మొదటి అడుగు నుంచి దర్శకత్వంతో మొదలుపెట్టడం చాలా గొప్ప విషయం. అక్కడే ఆయన మనసులు గెలిచారు. విజయ్ గారి స్థాయికి జేసన్ కూడా వెళ్లాలని కోరుకుంటున్నాను.
సాయి రాజేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. సందీప్ గారు కష్టపడే వాళ్లకి ఇప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. మా ‘హృదయ కాలేయం’ సినిమాకి ఆయనే గెస్ట్‌గా వచ్చారు. సందీప్ గారి విషయంలో నాకు ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాయి. సంజయ్ గారు దర్శకత్వాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరం. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మిర్చి సంపత్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. సందీప్ కిషన్ అద్భుతమైన నటుడు. జేషన్ ఈజీగా హీరో అయిపోవచ్చు. కానీ తను కష్టమైనా దర్శకత్వం వైపు వచ్చాడు. ఈ సినిమాని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. బౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ నుంచి బయటికి వెళ్లలేదు. ఈ సినిమా అక్టోబర్ 2న వస్తుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను.
యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాట్లాడుతూ.. జేసన్ అందరితో ఎంతో మర్యాదగా, ప్రేమగా ఉంటారు. నేను దర్శకత్వం చేస్తున్న సినిమా సెట్‌కి వచ్చి నాకు బెస్ట్ విషెస్ అందించాడు. తనకు చాలా సహనం ఎక్కువ. నా ఫస్ట్ హిట్ సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తోనే వచ్చింది. ‘సిగ్మా’ తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది.
కృష్ణ చైతన్య మాట్లాడుతూ..‘సిగ్మా’ సినిమాలో పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. సంజయ్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సందీప్ సినిమాలు చాలా యూనిక్‌గా ఉంటాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా రెండు పాటలు రాశాను. జేసన్ దర్శకత్వం వైపు రావడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ నాకు ఎంతో మంచి స్నేహితుడు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అక్టోబర్ 2న తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
తమిళ్ కుమరన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ‘సిగ్మా’ మాకు చాలా స్పెషల్ మూవీ. జేసన్ చాలా మంచి విజన్‌తో తీశాడు. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాము. సంజయ్‌కి మీ అందరి ప్రేమ, ఆదరణ కావాలి. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మేకర్స్, ఎన్వి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.