pizza

SIIMA felicitates national award winners
సైమా సక్సెస్ ఫుల్ గా 13వ ఎడిషన్ కి చేరుకోవడం చాలా ఆనందంగా వుంది. నేషనల్ అవార్డ్ విన్నర్స్ ని సైమా సత్కరించడం అభినందనీయం: SIIMA 2025 గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

You are at idlebrain.com > news today >

13 August 2025
Hyderabad

ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది

ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విష్ణు, బృందాకి కంగ్రాజులేషన్స్ .12 ఏళ్లుగా ఈ వేడుకని విజయవంతంగా నిర్వహిస్తూ ఇప్పుడు 13వ ఎడిషన్ కి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు పరిశ్రమకు ఏడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇండస్ట్రీ స్పందించక ముందే సైమా వారు స్పందించి వారందరినీ ఒక స్టేజి మీద తీసుకొచ్చి సత్కరించాలని అనుకోవడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా నేషనల్ అవార్డు విజేతలు అందరికీ అభినందనలు. నిజంగా దీన్ని ఒక పండగ లాగా జరుపుకోవాలి. సైమా దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నందుకు వారికి మరోసారి కంగ్రాచ్యులేషన్స్.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. భగవత్ కేసరి నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేషనల్ అవార్డు కమిటీకి జ్యూరీకి థాంక్యూ. సినిమాని నిర్మించిన సాహూ గారపాటి గారికి, పాయింట్ ని ఒప్పుకున్న మా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. సైమా విష్ణు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నా ఫస్ట్ మూవీ పటాస్ సినిమాకి ఆయన అవార్డు ఇవ్వడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆ ఫస్ట్ అవార్డు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి సినిమాకి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు తీసుకున్నాను. ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడే విష్ణు గారు ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని వస్తుందని చెప్పారు. ఆయన అప్పుడే గెస్ చేశారు. థాంక్యూ విష్ణు గారు. సైమా అవార్డ్స్ ఒరిజినల్ కంటెంట్ ని బట్టి అవార్డు ఇస్తారు. ఈ విషయంలో సైమాకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది కేవలం అవార్డులు వేడుకే కాదు నాలుగు భాషల సినీ టాలెంట్ ని కనెక్ట్ చేస్తుంది. డిఫరెంట్ టాలెంట్స్ అన్నీ ఒక వేదిక మీద కలవడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఏడాది కూడా అద్భుతంగా జరగబోతుంది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విష్ణు గారికి బృందా గారికి సైమాకి థాంక్యూ సో మచ్. విష్ణు గారు ముందే చెప్పారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని. సినిమాపై అంత నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది తొలి సత్కారం. అందరూ నేషనల్ విన్నర్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విష్ణు గారికి బృందా గారికి సైమాకి ధన్యవాదాలు. అవార్డు వచ్చిన వారికే కాదు సినిమా కోసం పని చేసిన అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. సైమా టాలెంట్ ని సెలబ్రేట్ చేసుకునే చాలా గొప్ప వేదిక. ఎన్నో గొప్ప సినిమాలు రావడానికి కారణం అవుతున్నందుకు ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు బృందా గారికి విష్ణు గారికి కంగ్రాజులేషన్స్.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తొలి గుర్తింపు సైమా ఇచ్చిందే. విష్ణు గారికి బృందా గారికి థాంక్యూ. నా కెరీర్ లో పది అవార్డులు తీసుకుంటే అందులో ఎనిమిది అరవింద్ గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సైమా అనేది మన సౌత్ ఇండియన్ సినిమాలకి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చి పెట్టే అవార్డు వేడుక. నాకు సౌత్ ఇండియాలో ఉన్న దాదాపు 80% కోలాబరేషన్స్ సైమా వేడుక ద్వారానే వచ్చాయి. సైమా ప్రతి ఏడాది గొప్పగా ముందుకు వెళుతుంది. మన దేశంలో అవార్డు బ్రాండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలా అందరికీ తెలిసిన ప్రెస్టీజియస్ అవార్డ్స్ లో సైమా ముందుంటుంది అది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మనందరికీ ఆనందదాయకం. వేడుకలో పాలుపంచుకోవడం గర్వంగా భావిస్తున్నాను బృందా గారికి విష్ణు గారికి కంగ్రాజులేషన్స్ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను.

హీరోయిన్ వేదిక మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియన్ టాలెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది అవార్డు వేడుక మాత్రమే కాదు సెలబ్రేషన్స్ ఆఫ్ కల్చర్. విష్ణు గారు బృందా గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ ఏడాది నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను.

హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. దుబాయ్ లో సినిమాని సెలెబ్రేట్ చేయడం మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్.

హీరోయిన్ మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సైమా13వ ఎడిషన్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. విష్ణు, బృందా కి కంగ్రాచ్యులేషన్స్. వారి వల్లే సైమా ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది. సంక్రాంతి దీపావళి లాగానే సైమా అనేది మాకు ఒక పండుగ. నాలుగు భాషల సినీ టాలెంట్ కి ఒక వేదిక పైకి తీసుకొచ్చి సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.

సైమా చైర్ పర్శన్ బృందా మాట్లాడుతూ అందరికి నమస్కారం. మరో రీయూనియన్ కి సైనా సిద్ధమైంది. 13 ఏళ్లంటే లాంగ్ జర్నీ. చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఫ్రెండ్స్, స్టార్స్ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ పాసిబుల్ అయ్యేది కాదు. వారి వల్లే సైమా ప్రతి ఏడాది ఇంకా అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. మమ్మల్ని గొప్పగా బిలీవ్ చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సైమా కేవలం అవార్డు వేడుక కాదు. టాలెంట్ ని కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే గ్లోబల్ స్టేజ్. ప్రతి ఏడాది మేము కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తున్నాము. 13వ ఎడిషన్ కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 5, 6న దుబాయ్ లో కలుద్దాం’అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved