pizza

Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Skanda Pre-release Thunder On August 26th
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2023
Hyderabad

Blockbuster maker Boyapati Sreenu has mastered the art of pleasing family audiences with mass action entertainers. Though he is a specialist in making commercial entertainers, he makes certain there is adequate entertainment and family drama in his movies. He teams up with energetic & mass Ustaad Ram Pothineni for Skanda. RaPo is known for his high-octane energy and uber style. He underwent an unbelievable mass transformation for his Skanda which became the talking point of many. RaPo is seen in different shades. He excelled in both the looks of ultra mass as well as class. RaPo proved he is the best of the both worlds in these mass and class posters. In beefed up look and muscled body, RaPo nailed it.This combo & content indicates that Skanda appeals to masses and family audiences in equal proportion.

Meanwhile, the makers came up with an update. The film’s pre-release thunder will be out on August 26th. Ram and Sreeleela share a sparkling chemistry in the poster. While Ram appears in a panchekattu, Sreeleela looks homely in a half saree. They are seen flashing beautiful smiles, as they enjoy the beauty of nature while sitting on farms.

SS Thaman scored the music for the movie and the first two songs became sensational hits. The first thunder followed by the title glimpse received thumping response. The pre-release thunder is expected to set the bar high.

Santosh Detake cranks the camera for the film produced prestigiously by Srinivasaa Chitturi on a massive budget with high production values and top-notch technical standards under Srinivasaa Silver Screen banner. It is presented by Zee Studios South and Pavan Kumar. Editing is handled by Tammiraju.

Skanda is getting ready for release worldwide on September 15th in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.

Cast: Ram Pothineni, Sreeleela

Technical Crew:
Writer, Director: Boyapati Sreenu
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Zee Studios South, Pavan Kumar
Music: SS Thaman
DOP: Santosh Detake
Editing: Tammiraju

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న విడుదల

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో దిట్ట. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తన సినిమాల్లో తగిన వినోదం, ఫ్యామిలీ డ్రామా ఉండేలా చూసుకుంటారు. బోయపాటి ‘స్కంద’ కోసం ఎనర్జిటిక్ & మాస్ ఉస్తాద్ రామ్ పోతినేనితో చేతులు కలిపారు. రాపో హై-ఆక్టేన్ ఎనర్జీ, ఉబర్ స్టయిల్ కి చిరునామా. రామ్ ‘స్కంద’ కోసం అన్ బిలివబుల్ గా మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రాపో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్స్ లో అల్ట్రా మాస్‌తో పాటు క్లాస్‌ లుక్స్‌లోనూ అదరగొట్టారు. కండలుతిరిగిన శరీరంతో పవర్ ఫుల్ లుక్ లో ఎక్స్ టార్డినరిగా కనిపించారు. ఈ కాంబో & కంటెంట్ ‘స్కంద’ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని సమానంగా అలరిస్తుందని సూచిస్తోంది.

ఇప్పుడు, మేకర్స్ మరో అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థండర్ ఆగస్ట్ 26న విడుదల కానుంది. పోస్టర్‌లో రామ్, శ్రీలీల బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు

ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి రెండు పాటలు సంచలన విజయం సాధించాయి. ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ మరింతగా అంచనాలని పెంచనుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved