6 July 2023
Hyderabad
Baby is the upcoming Telugu romantic movie written and directed by Sai Rajesh, who produced the National Award winning film Color Photo. Anand Deverakonda, Vaishnavi Chaitanya, and Viraj Ashwin are the film’s leads. The film is bankrolled by SKN through his production house, Mass Movie Makes. The film creating excellent buzz with each song. The movie is a live testament to what exceptional music can do when it comes to film promotions.
The film releasing worldwide on July 14th and makers are currently busy with promotions.On the occasion of his birthday on July 7th (Tomorrow), Today producer SKN interacted with the media about the film Baby and how special this film is. He said "Looking back, I don't think I've celebrated a birthday in the last five years. This time is special since our film Baby is being released. This film is an intensely emotional love story. The music is also excellent. This film boasts the best music in recent times. The dialogues and scenes are fresh."
There are scenes in this film that have never been seen before in a love story. I'm amazed how the director crafted those scenes. The film's sequences between the three main characters take a novel approach. Before the interval, there will be a major twist. When Sai Rajesh narrated this story to me during the filming of Taxiwala, I was impressed with the story and assured him that this will be my next project. I liked the director's approach and decided to make this film following Taxiwala. I've done several films in collaboration with other producers in the past, but I've decided to make this one as a solo producer.
Because of Corona, no one made films for two years. Baby took a year and a half to make. Maruthi, the director, is also a partner in this project. Bunny Vass, Maruthi, and UV Creations Vamsi and I have been friends since before we started making films. With Mirchi, Vamsi became producer. Bunny Vass with the film 100% love, then Maruthi became the director. We all hear stories, and everyone enjoyed the story in this film.
The director informed me that he would do this film with Anand. When he made his decision, even Anand's first film was not released. Even if there is a star hero in the house, Anand is simple. In this film, there are two heroes, and I believed Anand would do well. I'm not a big believer of market. What we build is a market. When I did the film with Vijay Deverakonda, Arjun Reddy had not yet been released. I made the film with the expectation that he would become a star. And with this film, Anand will make a name for himself as an actor. Baby will become a special film in his career.
The dialogues in the film are excellent. Dialogues are the reactions of characters to situations. Music takes a larger importance in the film. Music department and the singers are all Telugu people. If there is a buzz before the film's release, it is due to the songs composed by Vijay.
Concerning the poster, The poster was removed from Twitter because it was poorly created. We had previously considered a different poster. He stated that if the poster is vertical and located in Prasad Multiplex, they can take it from there. With this, we have released an additional poster in addition to the already scheduled poster. However, it did not come as predicted. It was instantly deleted. Everyone said don't cancel. I am a person who believes that publicity should come from content, not from controversy. There is a good buzz about the movie as the songs are already clicking.
In my life, I've had love failures. As a result, I watch more love stories. I've been on the Baby film sets for two years. From now on, I intend to do two films per year. All of the stories I've heard during Corona's time will be made in the future. I've decided that two films will be released in theatres and one on OTT. The film's will be in different genre like popular in sci-fi, horror, and the supernatural. But if we all do the same thing, we'll end up with fewer stories. In the future, I shall not move in that route. Many people recommended I direct, but I'm not interested. Sai Rajesh will work on two more films with mass producers and two more with colour photographers.Sai Rajesh will do two more films with Mass movie makers, two films with Color Photo director, one film with VI nand and another film with Shyam Singha Roy director Rahul. There will be an official announcement soon.
I developed discipline because I began my profession as a journalist. What can we do to increase market share? What will the audience think? Will we be safe if we do what? As a journalist and PR, I learned everything. I learned about film promotions while working as a PRO for celebrities. I feel more like a member of the audience than a producer.
I feel the Baby movie will connect with the audience because it will.thier story. They leave the cinema hall with a heavy heart and thinking about the film. Bunny garu is not required to attend the promotions. He's my everlasting attachment.
ప్రతీ ప్రేక్షకుడు బేబీ సినిమాను తన సొంత కథ గా ఫీల్ అవుతాడు - నిర్మాత ఎస్.కే.ఎన్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ తన పుట్టిన రోజు సందర్భంగా బేబీ విశేషాలను పంచుకున్నారు. అవేంటంటే..
గత ఐదేళ్ల నుంచి రివర్స్ లెక్కపెడుతున్నా.. నాకు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఈసారి బేబీ మూవీ ఉండడంతో ప్రత్యేకమైంది. ఈ సినిమా హై ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమ కథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సీన్స్, డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్కరు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో కొత్తదనం అనే పదం వాడి చాలా పాతది చేశారు. కానీ నేను గర్వంగా చెబుతున్నా.
ఈ సినిమాలో ఇది వరకు చూడని సీన్లు.. చూడని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం నచ్చింది. ఆ విధానం నచ్చే నేను ట్యాక్సీవాలా తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమానే చేయాలని అనుకున్నా. ఇది వరకు నేను కాంబినేషన్‌లో చాలా సినిమాలు చేశా గానీ.. ఈ సినిమాను సోలో నిర్మాతగా చేయాలని ఫిక్స్ అయ్యా. ముగ్గురు మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు పెద్ద షాక్ ఉంటుంది. ఈ షాక్ నచ్చే సినిమాను నేను చేయాలని ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా చేస్తున్నప్పుడే సాయి రాజేష్ కథ చెప్పాడు. అప్పుడే నా తరువాతి సినిమా ఇదే అని చెప్పా.
కరోనాతో రెండేళ్లు సినిమాలు ఎవరు తీయకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం మేకింగ్‌లో ఉంది. డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాలో ఓ పార్ట్‌నర్. నేను, బన్నీ వాసు, మారుతి, యూవీ క్రియేషన్స్ వంశీ సినిమాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్. డిస్టిబ్యూషన్ చేసే వాళ్లం. మిర్చితో వంశీ ప్రొడ్యూసర్ అయ్యాడు. 100% సినిమాతో వాసు, ఆ తరువాత మారుతి డైరెక్టర్ అయ్యాడు. మేం అందరం కథలు వింటాం. ఈ సినిమా స్టోరీ అందరికీ బాగా నచ్చింది.
ట్యాక్సీవాలా సినిమా చేస్తున్నప్పుడే ఆనంద్‌తో మూవీ చేస్తానని చెప్పా. అప్పటికి అతని ఫస్ట్ సినిమా రాలేదు. ఇంట్లో హీరో ఉన్నా.. చాలా సింపుల్‌గా ఉంటాడు. కథలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇందులో ఆనంద్ చేస్తే బాగుంటుందనిపించింది. మార్కెట్లను నేనే పెద్దగా నమ్మను. మనం క్రియేట్ చేసేదే మార్కెట్. విజయ్ దేవరకొండతో నేను సినిమా తీసే సమయానికి అర్జున్ రెడ్డి ఇంకా విడుదల కాలేదు. ఆయన స్టార్ అవుతాడని నమ్మి మూవీ తీశా. ఇక ఈ సినిమాతో నటుడిగా ఆనంద్‌కు బ్రాకెట్ క్రియేట్ చేస్తుంది. ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.
సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. పరిస్థితులను బట్టి పాత్రలు ప్రతిస్పందించే తీరుతోనే డైలాగ్స్ ఉంటాయి. నేను చేసే సినిమాలలో మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజుల్లో, ట్యాక్సీవాలా సినిమాల్లో సంగీతం బాగుంటుంది. ఈ మూవీలో కూడా చాలా బాగుంది. అందరూ తెలుగువాళ్లే పని చేశారు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్, సింగర్లు అంతా తెలుగు వాళ్లే. అంతా తెలుగుదనమే ఉంటుంది. సినిమా విడుదలకు ముందే క్రేజ్ ఉందంటే.. విజయ్ కంపోజ్ చేసిన పాటలే కారణం.
పోస్టర్ సరిగా కంపోజింగ్ అవ్వకపోవడంతో ట్విటర్‌లో డిలీట్ చేశా. ముందు వేరే పోస్టర్ అనుకున్నాం. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వర్టికల్ పోస్టర్ అయితేనే అక్కడి నుంచి తీయగలరని అన్నారు. దీంతో ముందు అనుకున్న పోస్టర్ కాకుండా మరో పోస్టర్ రిలీజ్ చేశాం. అయితే అనుకున్న విధంగా రాలేదు. దీంతో వెంటనే డిలీట్ చేశా. అందరూ కాల్ ఆఫ్ చేయకండి.. అలానే పెడితేనే మీకు పబ్లిసిటీ అని చెప్పారు. పబ్లిసిటీ కంటెంట్ నుంచి రావాలి.. కాంట్రవర్సీ నుంచి కాదని నమ్మే వ్యక్తి నేను. ఇప్పటికే సాంగ్స్ క్లిక్ అవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఉంది.
నా జీవితంలో అన్ని లవ్ ఫెయిల్యూర్స్. అందుకే ఎక్కువ ప్రేమ కథ సినిమాలు చూస్తుంటా. నాకు రెండేళ్లు ఒకే సినిమాతో ఆ సెట్‌లో ఉండడం అలవాటు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు తీయాలని అనుకుంటున్నా. కరోనా టైమ్‌లో ఓకే చేసిన కథలన్నీ ఇక నుంచి రాబోతున్నాయి. రెండు సినియాలు థియేటర్లో.. ఒకటి వెబ్‌లో ఉండాలని ఫిక్స్ చేసుకున్నా. నాక్ సైన్స్ ఫిక్షన్, హర్రర్, సూపర్ నేచురాల్ ఈ జోనర్ ఇష్టం. అయితే అన్ని అవే చేస్తే కథలు తక్కువగా ఉంటాయని అన్నీ చేస్తున్నాం. భవిష్యత్‌లో డైరెక్షన్ జోలికి వెళ్లను. చాలా మంది దర్శకత్వం వహించమని సలహాలు ఇచ్చారు. వంటలో ఉప్పు వేసినంత మాత్రానా.. వంట వస్తుందో రాదో తెలియక ఆగిపోయాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే సినిమాకు కాకుండా వెబ్ కోసం చేస్తాం. సాయి రాజేష్‌తో రెండు సినిమాలు, కలర్ ఫోటో డైరెక్టర్‌తో రెండు సినిమాలు, వీఏ ఆనంద్ గారితో ఒక సినిమా, శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్‌తో మరో సినిమా చేస్తా. హీరోలకు చెబుతున్నాం. త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది.
జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించడంతో ఓ క్రమశిక్షణ వచ్చింది. ముందే ప్లానింగ్ అయిపోయింది. ఏం చేస్తే మార్కెట్ చేయగలం..? ఏం చేస్తే జనాలకు నచ్చుతుంది..? ఏం చేస్తే సేఫ్‌లో ఉంటాం..? అన్నీ జర్నలిస్టుగా, పీఆర్‌వోగా ఉన్నప్పుడే నేర్చుకున్నా. అగ్రహీరోలకు పీఆర్‌వోలకు పనిచేసినప్పుడు ప్రమోషన్ గురించి తెలుసుకున్నా. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్‌గా కాకుండా.. కామన్ ఆడియన్‌గా ఫీలవుతా. ట్యాక్సీవాలా సీక్వెల్ ప్లాన్ ఏం లేదు. సందీప్ కథలు హీరోలకు చెప్పాం. ఆగస్టులో ఓ క్లారిటీ వస్తుంది. బేబీ సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాను నా స్టోరీ అని చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సినిమా నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా కథ అనుకుని బరువెక్కిన గుండెతో వెళతారు. బన్నీ గారు ప్రత్యేకంగా ప్రమోషన్స్‌కు రావాల్సిన అవసరం లేదు. ఆయనది నాది విడదీయలేని అనుబంధం.