Chennai Love Story Team Celebrates Cult Producer SKN's Birthday in Grand Style
"చెన్నై లవ్ స్టోరీ "టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్
Cult producer SKN celebrated his birthday in a grand manner today in the presence of the Chennai Love Story team at FNCC, Hyderabad. The celebrations were attended by lead actor Kiran Abbavaram, producer and writer Sai Rajesh, producer Dheeraj Mogilineni, director Ravi Namburii, actress Sri Gouri Priya, and several other members of the film's team. The team cut a cake and extended their heartfelt birthday wishes to SKN.
Producer Dheeraj Mogilineni said, "I wish my dear friend SKN many more wonderful birthdays. I hope he produces at least two films every year and continues to deliver blockbuster entertainers to the industry."
Actress Sri Gouri Priya said, "I wish SKN garu many more happy birthdays like this. May he continue producing many successful films and provide opportunities to talented newcomers like us."
Director Sai Rajesh said, "Happy Birthday to my friend SKN. We are celebrating his special day today, and on the 24th of this month, we hope to present him with the biggest birthday gift by delivering a blockbuster with Chennai Love Story."
Actor Arun Adith said, "SKN always used to tell me, 'Let's make good films, darling.' Today, he is living by those words and producing quality cinema. I wish him many more grand birthday celebrations, and I hope Chennai Love Story becomes a huge success."
Actor Kiran Abbavaram said, "I wish SKN garu celebrates every birthday with the same grandeur. I hope he continues delivering many more successful films. I also wish that his impeccable timing and infectious energy remain unchanged as he achieves even greater milestones in his career."
Speaking at the event, cult producer SKN said, "I began my career as a journalist and later worked as a PRO. During those years, I earned the friendship and support of many media professionals. Today, I stand here as a producer, and throughout this journey, the media has stood firmly by my side. My success would not have been possible without your encouragement. Three years after delivering the cult blockbuster Baby, we are now coming before audiences with Chennai Love Story, a film we believe will become a classic blockbuster."
"చెన్నై లవ్ స్టోరీ "టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మా మిత్రుడు ఎస్ కే ఎన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలి. ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలి. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ - ఎస్ కేఎన్ గారు ఇలాగే ప్రతి పుట్టినరోజు హ్యాపీగా జరుపుకోవాలి. మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలి. ఆ చిత్రాల్లో మాలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ - నా మిత్రుడు ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల 24న చెన్నై లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఎస్ కేఎన్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తాం. అన్నారు.
హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ - మనం మంచి మూవీస్ చేద్దాం డార్లింగ్ అని ఎస్ కేఎన్ గతంలోనే చెప్పేవారు. ఆయన చెప్పినట్లే మంచి మూవీస్ చేస్తున్నారు. ఎస్ కేఎన్ ఇంకా గ్రాండ్ బర్త్ డే ఈవెంట్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఆయన నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఘన విజయం సాధించాలి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - ఎస్ కేఎన్ గారు ప్రతి బర్త్ డే ను ఇలాగే గ్రాండ్ జరుపుకోవాలి. ఆయన నుంచి మరిన్ని సక్సెస్ పుల్ మూవీస్ రావాలి. ఆయన టైమింగ్ లో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఇంకా మరింత ఎనర్జీతో ఆయన కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నా. అన్నారు.
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - నేను జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించా. పీఆర్ఓగా పనిచేశా. పాత్రికేయ మిత్రుల్లో ఒకరిగా మీ స్నేహాన్ని పొందా. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఈ వేదిక మీద నిలబడ్డా. ఈ జర్నీలో ప్రతి సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులు నా తోడుగా ఉన్నారు. మీరు లేకుండా నా సక్సెస్ లేదు. బేబి కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూడేళ్ల తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ తో మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.