The most anticipated pan-India project Slum Dog: 33 Temple Road marks the coming together of maverick filmmaker Puri Jagannadh and versatile performer Vijay Sethupathi for the very first time. Positioned as an intense action drama laced with mystery and emotion, the film has already generated considerable curiosity among audiences across languages. Having successfully wrapped up production, Slum Dog: 33 Temple Road is currently in the final stages of post-production, with work progressing at a brisk pace for all versions. Ever since the makers revealed the intriguing title and striking first-look poster, the project has remained a hot topic among cinephiles. Produced by Puri Jagannadh and Charmme Kaur under the Puri Connects banner in association with JB Narayan Rao Kondrolla’s JB Motion Pictures, the film carries substantial expectations. Adding to the excitement, the makers have now unveiled the film’s teaser.
The teaser opens on a powerful note, with the protagonist speaking about the harsh and often overlooked lives of beggars while delivering a stern warning to those who exploit or mistreat them. What follows is a gripping montage of action, emotion, and mystery, introducing the film’s principal characters one after another. While the teaser offers several glimpses into the world of the film, it cleverly leaves its biggest question unanswered- is Vijay Sethupathi’s character genuinely blind, or is there a deeper secret behind his appearance?
Known for crafting distinctive character arcs and presenting stories in his own style, Puri Jagannadh has once again created a fascinating character for Vijay Sethupathi. The mystery surrounding the lead character instantly becomes the teaser’s biggest strength, adding an extra layer of intrigue to the narrative.
Vijay Sethupathi delivers a commanding presence, effortlessly slipping into the skin of a visually impaired beggar while simultaneously showcasing the strength, intensity, and heroism of the character. His transformation and screen presence stand out as major highlights. Samyuktha plays the female lead, while Tabu makes a powerful impression as a police officer. Duniya Vijay appears in a menacing negative-shaded role, and the teaser also offers glimpses of key characters portrayed by Brahmaji and VTV Ganesh.
Technically, the teaser leaves a strong impression. Cinematographer Sam K Naidu lends a gritty visual texture and stylish presentation to the film’s world. National Award-winning composer Harshavardhan Rameshwar elevates the impact with a pulsating score that perfectly complements the intensity on screen. Editor Santosh Noozilla keeps the narrative crisp and engaging with sharp cuts, while the overall production values reflect the film’s ambitious scale.
Overall, the teaser succeeds in generating excitement by establishing the film’s tone, introducing its intriguing characters, and leaving audiences eager to uncover the mystery at its core. With a compelling premise, a powerful lead performance, and Puri Jagannadh’s trademark storytelling style, Slum Dog: 33 Temple Road has set the stage impressively for its grand pan-India release in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది; అన్ని భాషల వెర్షన్లకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసక్తికరమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రం మంచి బజ్ నెలకొంది. మ్ డాగ్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేశారు
''ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతాను' అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన టీజర్ అదిరిపోయింది. యాక్షన్, ఎమోషన్, మిస్టరీ అంశాలతో కూడిన ఆసక్తికరమైన సన్నివేశాలు కట్టిపడేశాయి. సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూనే, విజయ్ సేతుపతి పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీని ఆసక్తికరంగా వుంది. నిజంగా ఆయన పాత్ర గుడ్డివాడా? లేక దాని వెనుక మరేదైనా రహస్యం ఉందా? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది.
విభిన్నమైన పాత్రలు, తనదైన శైలిలో కథలను ఆవిష్కరించడంలో పేరుగాంచిన పూరి జగన్నాథ్, ఈసారి కూడా విజయ్ సేతుపతి కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను సృష్టించారు. కథానాయకుడి చుట్టూ నడిచే మిస్టరీ ఈ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచి, కథపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
విజయ్ సేతుపతి దృష్టి లోపం ఉన్న బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. అదే సమయంలో ఆ పాత్రలోని హీరోయిజాన్ని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథానాయికగా సంయుక్త నటిస్తుండగా, పోలీస్ అధికారిణి పాత్రలో టబు తనదైన ముద్ర వేశారు. విలన్ గా దునియా విజయ్ ఫెరోషియస్ గా కనిపించారు. అలాగే బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ పోషించిన పాత్రలు కూడా టీజర్‌లో కీలకంగా కనిపించాయి.
సాంకేతికంగా కూడా టీజర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ సామ్ కె. నాయుడు చిత్రానికి రా, గ్రిటీ విజువల్ టెక్స్చర్‌తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్‌ను అందించారు. జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఎడిటర్ సంతోష్ నూజిళ్లా షార్ప్ కట్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా మలిచారు. నిర్మాణ విలువలు సినిమా గ్రాండియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి.
‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ టీజర్ సినిమా వరల్డ్ ని, ఆసక్తికరమైన పాత్రలను పరిచయం చేయడమే కాకుండా, కథలోని ప్రధాన మిస్టరీని తెలుసుకోవాలనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో పెంచడంలో విజయవంతమైంది. విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి జగన్నాథ్ మార్క్ కథనం, మిస్టరీతో కూడిన కథాంశం ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై టీజర్ మరింత అంచనాలను పెంచింది.
చెన్నైలో గ్రాండ్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా మంచి టీమ్‌తో కలిసి చేసిన సినిమా ఇది. దునియా విజయ్ గారు చాలా టాలెంటెడ్ నటుడు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. అలాగే వీటీవీ గణేష్ గారితో నటించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆయన తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ పాపులర్. సంయుక్త చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ నటి. తన పాత్రను అద్భుతంగా చేసింది. హర్షవర్ధన్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన తమిళ్‌లో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. టీజర్ మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరామెన్ శ్యామ్ గారు చాలా నేచురల్‌గా, ఓపెన్‌గా ఉంటారు. ఆయన మనసులో ఏది ఉంటే అది మాట్లాడతారు. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్. ఆయన తీసిన ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఛార్మీ మేడమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె చాలా డెడికేటెడ్ ప్రొడ్యూసర్. ఎంతో స్ట్రాంగ్‌గా ప్రొడక్షన్‌ను నిర్వహిస్తారు. ఛార్మీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారు అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తెలుగులో విడుదలైన తర్వాత, దాన్ని తమిళ్‌లో జయం రవి రీమేక్ చేశారు. ఆ చిత్రంలో నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. ఇప్పుడు పూరి గారి దర్శకత్వంలో హీరోగా సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. పూరి గారు క్షణాల్లో కథలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతి కథ, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంటుంది. అలాంటి దర్శకుడితో పని చేయడం నటుడికి చాలా ఈజీగా, చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. ఈ సినిమా విడుదలయ్యే ప్రతి భాషలో ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది ఒక ‘యాక్షన్-ఎమోషన్ ప్యాక్డ్’ సినిమా. ' 'స్లమ్ డాగ్' పూరి జగన్నాథ్ గారి సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాను. పూరి గారితో పనిచేయడం నేను చాలా ఆస్వాదించాను. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. స్లమ్ డాగ్ నా తొలి తమిళ్ సినిమా. విజయ్ సేతుపతి గారికి థ్యాంక్యూ. లవ్ యూ, విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి లాంటి నటుడు ఒక దర్శకుడికి దొరకడం కంటే ఇంకేం అవసరం లేదు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఎప్పుడైనా షూటింగ్‌కు వచ్చినా ఒక కొత్త నటుడిలాగే కనిపిస్తారు. ఆయనలో ఎక్కడా అహంకారం కనిపించదు. అది చాలా అద్భుతమైన గుణం. ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ సినిమాలో మీరు చాలా పవర్‌ఫుల్, యూనిక్ విజయ్ సేతుపతిని చూస్తారు. సంయుక్త చాలా ఎనర్జిటిక్‌గా నటించింది. ఇందులో ఆమె వరలక్ష్మి పాత్రలో కనిపించబోతోంది. ఆ పాత్ర మీ అందరికీ చాలా నచ్చుతుంది. దునియా విజయ్ గారు కూడా అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే టబు గారు, జరీనా చేసిన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. జరీనా గారు కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. జేబీ గారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఆయనకు వెల్కమ్. హర్షవర్ధన్ జాతీయ అవార్డు గ్రహీత. ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అలాగే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాలో చాలా మంచి నటీనటులు ఉన్నారు. వారందరినీ ఒకచోటికి చేర్చింది చార్మీ. స్లమ్ డాగ్... ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసిన కథ. ఇందులో రియల్ ఎమోషన్స్ ఉంటాయి. మనం సాధారణంగా బిచ్చగాళ్లను పెద్దగా పట్టించుకోము. కానీ వాళ్ల జీవితాల్లో కూడా ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాను మేము నెక్స్ట్ జనరేషన్, జెన్-జీ, యూత్ ప్రేక్షకుల కోసం చేశాం. యూత్ అందరూ ఫ్యామిలీ కలసి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. ఇది చాలా ఎమోషనల్ ఫిల్మ్. తప్పకుండా మీరు ఈ సినిమా చూడాలి. థ్యాంక్యూ.
నిర్మాత ఛార్మీ కౌర్ మాట్లాడుతూ...“పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ గారితో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశాం. కానీ స్లమ్ డాగ్ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది మా తొలి స్ట్రెయిట్ తమిళ్ సినిమా. మీ అందరూ ఇప్పటికే ఈ సినిమాపై ఎంతో ప్రేమ చూపించారు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌లతో కూడిన కథ. ఇందులో చాలా రియల్ యాక్షన్‌తో పాటు బలమైన హ్యూమన్ కనెక్షన్ కూడా ఉంటుంది. చాలా ఒరిజినల్ ఎమోషన్స్, అద్భుతమైన స్టోరీటెల్లింగ్, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పూరి జగన్నాథ్ గారు, విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్‌గా కుదిరింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నేను బలంగా చెప్పగలను. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం పనిచేయడం నాకు ఒక గౌరవంగా భావిస్తున్నాను. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. టబు గారి పాత్రలో మరెవరినీ ఊహించుకోలేం. ఈ కథ విన్న వెంటనే ఒప్పుకుని మాకు ఎంతో సహకరించారు. అలాగే దునియా విజయ్ గారు కూడా ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ఈ సినిమా చేశారు. సంయుక్త ఇందులో తన పాత్రను అద్భుతంగా పోషించింది. ఆమె నటన చాలా నేచురల్‌గా ఉంటుంది. జేబీ గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత సక్సెస్ అయ్యారో, సినీ నిర్మాణ రంగంలో కూడా అంతే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మేము చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ గారితో పనిచేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన డైరెక్ట్ చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేస్తారు. ఆయనతో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. హర్షవర్ధన్ గారు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఛార్మీ గారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఎంతో ఇన్వాల్వ్‌మెంట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అందరినీ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పూరి జగన్నాథ్ గారికి ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఆ అభిమానులందరినీ ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది. నేను కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి ధన్యవాదాలు. ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. మొదట ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ ఆయన చాలా ఫ్రెండ్లీగా, చాలా నేచురల్‌గా ఉంటారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ సేతుపతి గారికి, సంయుక్త గారికి, ఈ చిత్ర బృందంలోని అందరికీ ధన్యవాదాలు. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అవి ప్రేక్షకులను ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.
నిర్మాత జేబీ నారాయణరావు మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ గారికి ధన్యవాదాలు. పూరి గారితో ఇది నా తొలి సినిమా. ఆయనతో నిర్మాణ బాధ్యతలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే విజయ్ సేతుపతి గారు వంటి గొప్ప నటుడితో నా తొలి సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సంయుక్త గారికి, టబు గారికి, చిత్ర బృందంలోని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.