ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారితో ఆదివారం సోమాజి గూడా ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్‌కుమార్ ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రాసిన "శూన్యం నుండి శిఖరాగ్రం వరకు" పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా వారికి శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరుగింది. ఆ తర్వాత సీనియర్ పత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్ రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, సెక్రటరీ సురేష్‌కొండేటిగారు కలిసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారికి ఘన సత్కార కార్యక్రమం జరిగింది ఆ తర్వాత సన్మాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌గారు మాట్లాడుతూ... ఈ రోజు ఆదివారం పత్రికా విలేఖరులు ఉదయం తొమ్మిది, పది గంటలకే రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మన మిత్రుడు, మన పుత్రుడు మన స్నేహితుడు మన శ్రేయోభిలాషి మన ఆప్ద్‌బాంధవుడు ప్రభుగారికి గద్దర్ అవార్డు రావడం యావత్ సినీ పాత్రికేయులందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే రైట్ పర్సన్‌కి ఈ అవార్డు వచ్చింది. రైట్ పర్సన్ అని ఎందుకన్నానంటే... నేను మద్రాసు వెళ్ళిన కొత్తల్లో ఉమా (స్వర్గేయ) మిక్కిలినేని జగదీష్‌బాబు, బి.ఎ.రాజుగారు, బి.ఎ. జయ, పసుపులేటిరామారావుగారు, ట్రేడ్‌గైడ్ వెంకటేశ్వరావుగారు, రెడ్డిగారు వీరంతా ఉండేవారు. ఉమాగారు నన్ను పర్సనల్‌గా నన్ను తమ్ముడు అని పిలిచేవారు. ఆయన నాతో ఎన్నో మంచిమంచి పనులు చేయించుకున్నారు. అందుచేత ప్రభుకి నాకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభు, నేను ఇంకా ఇంకా దగ్గరయ్యాం. దానికి కారణం జర్నలిస్టులో ఎవరికి ఎటువంటి పని ఉన్నా కూడా తలలో నాలుకలా తయారయ్యి ప్రతిఒక్కరికి చేస్తాడు ప్రభు. దాసరినారాయణరావుగారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కొంతమందికి చేశారు. కానీ ప్రభు ఏ జర్నలిస్టుకి కష్టమొచ్చినా ఎంత అర్ధరాత్రి అయినా సరే ప్రభు ఉన్నాడు అనే స్టేజీకి భగవంతుడు ప్రభుని తీసుకెళ్ళాడు. ఇటువంటి ప్రభు మనందరి ఆయురారోగ్యాలు పోసుకుని నలుగురికి ఇంకా మంచి చేయాలని, గద్దర్ అవార్డు అందుకున్నందుకు అందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇక మీరేమైతే ప్రశ్నలు అడుగుతారో నిస్సదేహంగా అడగండి వాటన్నిటికీ కూడా నేను జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.
ప్రశ్న - జవాబులు
చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు?... డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఇతర రాష్ట్రాలలో ఒక సినిమాకి మూడు నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తే మన వద్ద వచ్చేసి 10వేల వరకు వసూలు చేస్తున్నారు క్యూబ్, యుఎఫ్‌ఓవారు? ఇది ఒక 100 థియేటర్స్‌లో ఒక చిన్న నిర్మాత సినిమాను విడుదల చేస్తే అక్కడే 10లక్షలు పోతున్నాయి దీని పై మీ అభిప్రాయం?
జ... చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్‌కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్ సపోర్ట్ కూడా చాలా అవసరం అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చాలా అవసరం ఎందుకంటే...చిన్న సినిమా అనేది ఎదుగుదలకి ఒక మొక్కలాంటిది. ఎంత పెద్ద హిట్ అవ్వాలన్నాకూడా చెట్టుకి విత్తనం ఎంత అవసరమో చిన్న సినిమా కూడా ఇండస్ట్రీకి అంతే అవసరం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్‌దేవరకొండనుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమానుంచే పైకి వచ్చారు. ఆఖరికి రాజమౌళిగారు కూడా డైరెక్టర్లు కోదండరామిరెడ్డిగారు కూడా రాఘవేంద్రరావుగారు కూడా, దాసరినారాయణరావుగారు కూడా 'స్వర్గం నరకం' సినిమా అందుచేత చిన్న సినిమాలను బ్రతికిస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అందుచేత ప్రభుత్వం కంటే కూడా అవగాహనతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. గతంలో 20,30ఏళ్ళ క్రితం చంద్రబాబుగారి హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. ఒక సినిమాతో సక్సెస్ వస్తుందని ఎప్పుడూ నిర్మాత నమ్మకూడదు. అనుభవంతో ఉంటే ఏ నిర్మాత అయినా కూడా మంచి సినిమా తీయగలరు. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
ఇటీవల ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏ సినిమా అయినా సరే థియేటర్ ఎనిమిది వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని తెలిసింది? ఈ ప్రభావం చిన్న సినిమాల పైన ఎంత వరకు పడుతుందని మీరు అనుకుంటున్నారు?
జ... చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్ చేయడం చాలా కష్టమయిపోయింది. సినిమా ప్రాడక్ట్ వరకు మనం తయారు చేయగలం. కానీ అవి విడుదలవ్వాలంటే థియేటర్లు గతంలో లాగా ఉండడం లేదు. ఒకప్పుడు థియేటర్‌కు జనం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలా సినిమాలు ఉండడం వల్ల ఆడియన్స్ తగ్గిపోయారు. చిన్న సినిమాకి పర్సంటేజి, రేట్లు అన్నీ చూసుకుంటే ముఖ్యంగా విపరీతమైన తినుబండారాల రేట్ల వలన థియేటర్‌కి ప్రేక్షకులు రాకపోవడం వల్ల ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంటైర్ విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో బాలేదు అది సత్యం.
గతంలో మీరు ఒక మాట అననారు నిర్మాతలకు అసలు వాల్యూ లేదు...డైరెక్టర్‌కానీ, హీరోలు కానీ ప్రొడ్యూసర్‌కి వాల్యూ ఇవ్వడం లేదు అన్నారు. ఎందుకని ప్రొడ్యూసర్ ఒక క్యాష్‌బ్యాంక్‌లాగా ఎందుకు అయిపోయారు?
జ...ఎందుకు అవుతారు నేను అయ్యానా. సరైన నిర్మాత ఎవరికైనా ఎందుకు లొంగుతారు. ఎప్పుడూ ఎదుటివారిది తప్పు ఉండదు. మనదే తప్పు ఉంటుంది. నేను కూడా పెద్ద సినిమాలు తీయగలను కానీ ఎందుకు తీయను. గతంలో నేను నాగేశ్వరావుగారితో, ఎన్టీఆర్‌తో, శోభనబాబుగారితో, కృష్ణతో, కృష్ణంరాజుతో పెద్ద సినిమాలే తీశాను కదా ఇప్పుడు ఎందుకు తీయడం లేదు. ఆ హీరోలు ఆ రోజుల్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆ సిన్సియారిటీ ఆ హానెస్టీ ఈరోజు లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గవి తీస్తున్నాను. నిర్మాత విలువ తగ్గించడం లేదు నేను అని అన్నారు.
చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్ లు ఉన్నాయి, 24 శాఖలు ఉన్నాయి. కానీ ఏ శాఖకు ఉండాల్సిన అసోసియేషన్ ఆ శాఖకు ఉంది. డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, కెమెరమెన్లకు కానీ అలాగే నిర్మాతలకు ప్రొడ్యైసర్ కౌన్సిల్ ఉంది. ఏ అసోసియేషన్ కూడా దాంట్లో నుంచి పక్కకు వెళ్ళి వేరు కుంపటి పెట్టుకోలేదు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌నుంచి కొంత మంది నిర్మాతలు గిల్డ్ అనేది పెట్టుకున్నారు. గిల్డ్ ప్రయోజనాలకి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యొక్క ప్రయోజనాలకి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో సమస్యలు అనగానే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలే తప్ప చిన్న సినిమాలను అడ్రస్ చేయడానికి లేకుండా పోయింది. అలా గిల్డ్ వేరుపడడానికి గల పరిస్థితుల గురించి వివరించండి?
జ...రెండు కుటుంబాలుంటే అందులో ఒకటి పేద కుటుంబం, ఒకటి రిచ్ కుటుంబం అనుకుందాం. అందులో పేద కుటుంబం అందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారు. పెద్ద కుటుంబంలో తండ్రి సంపాదించాక అందులో ఇద్దరు మేం బాగా సంపాదించాం అని బయటకు వెళ్ళిపోతే ఎలాగో మా సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారయింది. ఎవరైతే ఇండస్ట్రీ ద్వారా పెరుగుతున్నారో వాళ్ళు నలుగురు ఒకటయి కేవలం బిజినెస్‌తో అంటే భగవంతుడు గాలి, నీరు ఇచ్చారు కాబట్టి మనమందరం పీల్చుకుంటున్నాము. లేదంటే వీళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని కూడా కొని మేము నలుగురమే బ్రతకాలి అంటారు ఈ గిల్డ్ అనేవారు. గిల్డ్ అనేది ఒక విషపురుగు, విషసస్కృతి. నేను గతంలో కూడా ప్రభుత్వానికి చెప్పాను. మళ్ళీ కూడా చెబుతున్నాను ఈ విష సంస్కృతిని పోషించే సినీ పెద్దలను ప్రభుత్వం ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండనా మీకు ఓట్లు వేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే కానీ మీరు …