pizza

Sree Vishnu, Lightbox Media, Picture Perfect Entertainment and director Hussain Sha Kiran joined forces for an Investigative Thriller, 60% shoot is completed
శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి

You are at idlebrain.com > news today >

17 April 2024
Hyderabad

Hero Sree Vishnu is enjoying the best form of his career with consecutive blockbusters- Samajavaragamana and Om Bheem Bush. The talented actor who signed some exciting projects announced his next movie today. The film is an Investigative thriller directed by Hussain Sha Kiran. The film is bankrolled by Sandeep Gunnam and Vinay Chilakapati under Lightbox Media and Picture Perfect Entertainment banners.

Reba John is playing the female lead, opposite Sree Vishnu after the blockbuster Samajavaragamana. This exciting thriller completed 60% of its shoot and makers are on track to complete the shoot soon. The film also stars Veer Aryan, Ayyappa Sharma, Sudarshan, Racha Ravi and others.

Sree Vishnu, who is doing different genre movies, is making sure every film has adequate entertainment. Coming to this film, it is an Investigative Thriller in Sree Vishnu style with another interesting theme. While cinematography is handled by Vidhya Sagar, the film's music is scored by Kaala Bhairava. Sreekar Prasad will handle the editing works. Production design will be handled by Manisha A. Dutt. More details of this interesting project will be announced soon.

శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి

వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved