శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటూ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ '' ఈ రోజు నా సక్సెస్‌కు కారణం నా టీమ్. ఈ వేదికపై ఈ రోజు నేను ఉండటానికి, సినిమా జనాల్లో రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణారెడ్డి గారు. ఈసినిమాకు ప్రీమియర్స్ దగ్గర నుంచే మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సినిమా విడుదల తరువాత అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ ఇంకా ఆడియన్స్ నుంచి మరింత సపోర్ట కావాలి. ఈ సినిమా చూసి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంతకు ముందు తెలుగు నుంచి మలయాళ వాళ్లకు ప్రశంసలు వచ్చేవి. ఇప్పుడు మా సినిమాకు మలయాళం నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు మీ మౌత్‌టాక్‌తో మరింత మందికి చెప్పండి. ఈ సినిమా ఈరోజు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మా టెక్నిషియన్స్ కూడా కారణం. వాళ్లకు నా కృతజ్క్షతలు' అన్నారు.
చింత గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ '' కొత్త టీమ్‌తో చేసిన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. సినిమా చూసిన వాళ్లు బాగుందని ఫోన్ చేస్తున్నారు. కొత్త టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ విజయానికి కారణమైన అందరికి థ్యాంక్స్. నిర్మాతగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హ్యపీగా ఉన్నాను. మా ప్రయత్నంలో ఉన్న నిజయితీని గుర్తించారు. త్వరలో మరో కొత్త దర్శకుడితో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను' అన్నారు.
వంశీ తుమ్మల మాట్లాడుతూ '' నా మొదటి సినిమాకే ఇంత మంచి అప్లాజ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరూ హీరోనే. నా పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఫోటోగ్రఫీతో, సంగీతంతో మరో లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ సంగీతాన్ని, విజువల్స్‌ని థియేటర్‌లో అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చిదంబరం ప్రపంచంలోకి వచ్చిన అందరూ కొత్త అనుభూతికి లోనవుతున్నారు' అన్నారు.
సంధ్య వశిష్ట మాట్లాడుతూ '' శ్రీ చిదంబరం గారు' సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాకు అందరూ పాజిటివ్ రివ్యూస్ రాశారు. లీల పాత్ర అందరికి నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది. మా నిర్మాత మా లాంటి కొత్త టాలెంట్‌ను మరింత మందిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఇదొక క్లీన్ రీఫ్రెషింగ్ స్టోరీ తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది అన్నారు.
ఈ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్‌లో బాలనటుడు శశికిరణ్, నిర్మాత రమణా రెడ్డి, డీఓపీ అక్షయ్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి, చందు తదితరులు పాల్గొన్నారు.