pizza

Sridevi Movies launches its Production No. 15 - Director Mohanakrishna Indraganti, actor Priyadarshi join hands
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి – రూప కొడువాయూర్ జంటగా శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-15 ప్రారంభం

You are at idlebrain.com > news today >

25 March 2024
Hyderabad

Sridevi Movies, a production house known for its rich taste and a wide range of movies, has collaborated with director Mohanakrishna Indraganti for the third time after 'Gentleman' with Natural Star Nani in 2016 and 'Sammohanam' with Sudheer Babu in 2018. Their latest collaboration is fronted by the versatile actor Priyadarshi and actress Roopa Koduvayur. This yet-to-be-titled film, which is being made as Production No. 15 by Sridevi Movies, was launched on Monday (March 25) with a puja ceremony at the banner's office.

Producer Sivalenka Krishna Prasad's wife Anita clapped for the Muhurtham shot on the portraits of Gods and Goddesses, while director Indraganti's wife Uma Maheshwari switched on the camera.

Speaking on the occasion, producer Sivalenka Krishna Prasad said, "I am very happy to be doing a film with Mohanakrishna Indraganti, who is a dear friend of our Sridevi Movies and who is very close to me. This is our third collaboration after 'Gentleman' and 'Sammohanam'. This is an apt subject for Priyadarshi, who became famous as a male protagonist with 'Balagam'. Roopa Koduvayur is playing the female lead in this film, which I would like to describe as a cute entertainer. We are going to give the audience solid entertainment laced with emotions. The film will be like Jandhyala garu's film made for today's times. The shooting has started in Hyderabad from today."

Cast: Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, Sivannarayana, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, KLK Mani.

Crew:
Costume Chief: N Manoj Kumar.
Costume Designers: Rajesh and Sridevi
Production Controllers: P Rasheed Ahmed Khan, K Ramanjaneyulu.
PRO: Pulagam Chinnarayana
Digital Marketing: Talk Scoop
Co-Director: Kota Suresh Kumar.
Lyricist: Ramajogayya Sastry
Stunts: Venkat
Production Designer: Raveender
Editor: Marthand K Venkatesh
Director of Photography: PG Vinda
Music Director: Vivek Sagar
Line Producer: Vidya Sivalenka, Lipika Alla
Producer: Sivalenka Krishna Prasad
Writer, Director: Mohanakrishna Indraganti

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి – రూప కొడువాయూర్ జంటగా శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-15 ప్రారంభం

2016లో నానితో 'జెంటిల్ మన్' - 2018లో సుధీర్ బాబుతో 'సమ్మోహనం'- ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు.
శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ -"మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభా శాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో జెంటిల్ మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. 'బలగం' తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం. స్వీట్ ఎంటర్టైనర్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాలగారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా . ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది" అని తెలిపారు.

ప్రియదర్శి, రూప కొడవాయూర్, వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, 'వెన్నెల' కిశోర్, 'వైవ' హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి, ఇందులో ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కాస్ట్యూమ్స్-మనోజ్; కాస్ట్యూమ్ డిజైనర్-రాజేష్-శ్రీదేవి; ప్రొడక్షన్ కంట్రోలర్స్- పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు; పి.ఆర్.ఓ- పులగం చిన్నారాయణ; కో-డైరెక్టర్- కోట సురేష్ కుమార్; పాటలు- రామజోగయ్య శాస్త్రి; ఫైట్స్- వెంకట్; ప్రొడక్షన్ డిజైనర్- రవీందర్; ఎడిటర్- మార్తాండ్ కె. వెంకటేష్; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ- పి .జి. విందా; సంగీతం- వివేక్ సాగర్; లైన్ ప్రొడ్యూసర్స్ -విద్య శివలెంక, లిపిక ఆళ్ల , నిర్మాత-శివలెంక కృష్ణప్రసాద్; రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved