Srikakulam Sherlock Holmes pre release event
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కంటెంట్ చాలా కొత్తగా వుంది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చాలా పాజిటివ్ గా వుంది. ఖచ్చితంగా బిగ్ హిట్ అవుతుంది: డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బాబీ కొల్లి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నేను ఈవెంట్ కి రావడం కారణం రైటర్ మోహన్. నేను, మోహన్ కలిసి ఒక డైరెక్టర్ దగ్గర రైటర్స్ గా పని చేసాం. ఈ సినిమాతో తను దూసుకుపోతాడనే నమ్మకం ఉంది. మోహన్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. ఈ సినిమాని ఫన్ తో పాటు సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేయడం చాలా మంచి ఐడియా. తను సస్పెన్స్ ని చాలా అద్భుతంగా తీసాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనన్య గారికి చాలా సక్సెస్ లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ ని నమ్మి ఈ సినిమా చేసిన రమణా రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. వంశి గారి పేరు మారుమ్రోగిపోతోంది. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థం అవుతుంది. కంటెంట్ చాలా కొత్తగా వుంది. డిసెంబర్ 25న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమాతో ఒక హిట్ సినిమాని థియేటర్స్ లోకి పంపిస్తున్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చాలా పాజిటివ్ గా ఉంది. ఈ సినిమా కథని నమ్మే సినిమా చేసిన రమణ రెడ్డి గారికి కంగ్రాజులేషన్స్. చిన్న సినిమాలు పెద్ద హిట్ లు కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో కూడా అదే కోరుకుంటున్నాను. ఇందులో కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారెంటీ. మోహన్ గారు డైరెక్టర్ గా కూడా పెద్ద పెద్ద సక్సెస్ లు కొట్టాలని కోరుకుంటున్నాను. అనన్య గారు ఏ క్యారెక్టర్ చేసిన అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వంశి గారు ఈ సినిమాకి చాలా బాగా యాడ్ అయ్యారని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్' అన్నారు.
నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ... వంశి గారు చాలా కాన్ఫిడెంట్ గా తన నెంబర్ ఇచ్చారు. డబల్ హ్యాట్రిక్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ అది. మీరంతా సినిమా బాగుంది అనిపిస్తే కూడా కాల్ చేసి చెప్పండి. కాల్స్ తో ఆయన ఫోన్ పగిలిపోవాలి (నవ్వుతూ). ఈ సినిమా నేను చూశాను లాస్ట్ 40 మినిట్స్ సినిమా అదిరిపోతుంది. ఇందులో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. లాస్ట్ వరకు ఫుల్ గా ఎంగేజ్ చేస్తుంది కంటెంట్ చూసి ఈ సినిమాని వంశీ గారు తీసుకున్నారు. ఆయన జడ్జ్మెంట్ బాగా నమ్ముతాము. అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి వంశీ గారికి చాలా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. ఈ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబి గారికి కళ్యాణ్ గారికి థాంక్యూ' అన్నారు
డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ. అందరికి నమస్కారం. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశాను. లాస్ట్ 40 మినిట్స్ సినిమా చించేసిందే. మామూలుగా లేదు. అసలు ఇందులో మడ్రర్ ఎవరో గెస్ చేయలేకపోయాను. థ్రిల్ ని చాలా కొత్తగా చెప్పారు. రైటర్ మోహన్ గారు చాలా అద్భుతంగా తీశారు. అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా వంశీకి సెకండ్ హ్యాట్రిక్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్' అన్నారు
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. డైరెక్టర్ గారికి హిట్ నుంచి సూపర్ హిట్ చేద్దామని చెప్పాను. డైరెక్టర్ గారు నిర్మాత చాలా కోపరేటివ్. చెప్పిన సజెషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేశారు. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లే కొద్ది కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. 2018 పొలిమేర 2, కమిటీ కుర్రాళ్ళు క... చిత్రాలకు దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. కానీ ఈ సినిమాకు వచ్చేసరికి లీడ్ యాక్టర్స్ సపోర్ట్ ఉంటే ప్రమోషన్స్ ని ఇంకా బలంగా తీసుకెళ్లొచ్చని నమ్మా. కానీ కొన్ని కారణాలవల్ల మేము అనుకున్నట్లు కొన్ని కుదరలేదు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా కంటెంట్ ని నేను బలంగా నమ్మాను. ఆకంటెంట్ నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 2024 లో పుష్ప తర్వాత హైయ్యస్ట్ గ్రోసర్ ఈ సినిమానే అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసి నచ్చలేదని ఎవరైనా అంటే నా నెంబర్ కి సంప్రదించవచ్చు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈ సినిమా మీద. ఈ సినిమా నా కెరీర్ ని అలాగే ఇందులో నటించిన నటీనటులు టెక్నీషియన్స్ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బాబీ గారికి కళ్యాణ్ కృష్ణ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి ఎర్లీ బర్డ్ షోస్ వేస్తున్నాను. వర్డ్ అఫ్ మౌత్ తో బాగా స్ప్రెడ్ చేసి సినిమాని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..ఈ ఈవెంట్ కి విచ్చేసిన బాబీ గారికి కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' నా కెరీర్ లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా. నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చిన మోహన్ గారికి థాంక్ యూ. వంశీ గారు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం వలన సినిమాపై అందరికీ మరింత నమ్మకం కలిగింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. ఇప్పటివరకూ చాలా మంచి పాత్రలు, సినిమాలు చేశాను. ఈ సినిమాతో ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ గా సక్సెస్ మీట్ లో కలుద్దామని కోరుకుంటున్నాను' అన్నారు.
యాక్టర్ రవితేజ మహాదాస్యం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నాకు చాలా అనుబంధం వుంది. నేను రాజంలో పుట్టాను. వైజాగ్ లో చదువుకున్నాను. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'టైటిల్ తో సినిమా రావడం చాలా అనందంగా వుంది. నటుడిగా ఈ సినిమా నాకు చాలా కీలకం, నిర్మాత చాలా బాధ్యతగా సినిమాని నిర్మించారు. మోహన్ గారు అద్భుతంగా తీశారు. అనన్యతో కలసి నటించడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.
దర్శకుడు రైటర్ మోహన్ మాట్లాడుతూ..ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత రమణా రెడ్డిగారికి, ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యుల్ లో కూడా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన బాబీ గారికి కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. వెన్నెల కిషోర్ గారితో పాటు అందరూ తమ పాత్రలని అద్భుతంగా చేశారు. అనన్య నాగళ్ల గొప్ప చేసింది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 25న సినిమా వస్తోంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.
నిర్మాత వెన్నపూస రమణారెడ్డి మాట్లాడుతూ.. బాబీ గారికి, కళ్యాణ్ గారి ధన్యవాదాలు. మోహన్ గారు కథ చెప్పినప్పుడు చాలా నచ్చంది. వెంటనే చేద్దామని భావించాను. ఈ సినిమాకి నలుగురు ఆర్టిస్ట్ లు, నలుగురు టెక్నిషియన్స్ మొత్తం ఎనిమిది మంది ప్రొడ్యూసర్స్ వున్నారు. కష్టానికి తగిన ఫలితం తీసుకోకుండా కథపైన, నా పై వున్న నమ్మకంతో సినిమా చేశారు. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం, వాళ్ళందరికీ లాభాలు పంచిపెట్టాలన్నదే నా ఉద్దేశం' అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రాంబాల మాట్లాడుతూ.. బాబీ గారికి కళ్యాణ గారి థాంక్ యూ, వారు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. వారికి ఎప్పుడూ రుణ పడి వుంటాం. రమణా రెడ్డి గారు సినిమాని ఎక్కడా రాజీపడకుండా తీశారు. అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' తెలిపారు.
సంగీత దర్శకుడు జ్ఞాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం . ఈ సినిమాల్లో పని చేసిన అందరూ చాలా అద్భుతంగా చేశారు. రైటర్ మోహన్ గారు ఈ సినిమా స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా రాశారు. స్క్రీన్ ప్లే చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది. వంశీ గారు చేయి వేస్తె సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. 25న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.
యాక్టర్ అనీష్ కురివిల్ల మాట్లాడుతూ...రైటర్ మోహన్ గారు చాలా కష్టపడి చాలా పాషన్ తో సినిమా తీశారు. ఆయన కామిక్ టైమింగ్, స్క్రీన్ ప్లే చాలా యూనిక్ గా వుంటాయి. ఆయన ఒరిజినల్ ఫిలిం మేకర్. వంశీ నందిపాటి గారు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఈ సినిమాకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఇందులో నా పాత్ర కొత్తగా వుంటుంది. ఇలాంటి ఫిజికల్ టచ్ కామెడీని నేను ఎప్పుడూ చేయలేదు. ఖచ్చితంగా సినిమా కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది' అన్నారు
లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడుతూ..ఇది నాకు హార్ట్ కి కనెక్ట్ అయిన సినిమా. మోహన్ అన్న దగ్గరుండి చూసిన పర్సన్ ఆయనకి హిట్ పడితే ఇండస్ట్రీలో ఇంకా బలంగా నిలబడతారు. ఇందులో యూత్ ఫుల్ సాంగ్ రాశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాత రమణ రెడ్డి గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించాలని కోరుతున్నాను'అన్నారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.