pizza

Jai Krishna about Srinivasa Mangapuram
'శ్రీనివాస మంగాపురం' మహేష్ బాబాయ్‌కి చాలా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వైజయంతి మూవీస్‌ ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీనివాస మంగాపురంలో లవ్, యాక్షన్, ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: హీరో జై కృష్ణ ఘట్టమనేన

You are at idlebrain.com > news today >

25 July 2026
Hyderabad

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జై కృష్ణ ఘట్టమనేని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు యాక్టర్ కావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?
-నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నా 16వ ఏటా యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. డిసైడ్ అయిన తర్వాత ప్రాపర్‌గా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. రెండేళ్లు ముంబై వెళ్లాను. తర్వాత పాండిచ్చేరి వెళ్లాను. అక్కడ కొంతకాలం శిక్షణ తీసుకున్న తర్వాత న్యూయార్క్ వెళ్లాను. అక్కడ కూడా రెండు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాను. తిరిగి వచ్చిన తర్వాత కథలు వినడం మొదలు పెట్టాను.

-ఈ సినిమా కోసం అజయ్ గారు మూడు నెలల పాటు వర్క్‌షాప్ చేయించారు. లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్... ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యాం.

'శ్రీనివాస మంగాపురం' జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-జెమినీ కిరణ్ గారి ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆయనే అజయ్ గారిని పరిచయం చేశారు. అలా ఈ సినిమా మొదలైంది. ఇంతకుముందు కూడా నేను కొన్ని కథలు విన్నాను. కాకపోతే అజయ్ గారు చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి ఎమోషన్, మంచి క్యారెక్టర్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. అలా అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయి

మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మహేష్ గారు ఈ సినిమా చూశారా ?
-నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ప్రతి అడుగులో బంగారు తాతయ్య ప్రోత్సాహం ఉంది.

- మహేష్ బాబాయ్ ప్రతి విషయంలో గైడెన్స్ ఇస్తారు. ఆయన ఆయన సినిమా కూడా చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయనకు చాలా నచ్చింది. నాకు మెసేజ్ కూడా పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ చాలా నచ్చాయని చెప్పారు. స్క్రీన్ మీద చాలా డిఫరెంట్‌గా ఉన్నానని, క్యారెక్టర్‌లోకి పూర్తిగా వెళ్లిపోయానని చెప్పారు.

వైజయంతి మూవీస్‌లో మీ తొలి సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది?
-అశ్వినీ దత్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ గారి తొలి సినిమా కూడా వైజయంతి మూవీస్‌లోనే వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన యాక్సెప్టెన్స్ ఈ సినిమాకి కూడా వస్తుందని ఆశిస్తున్నాను.

మీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నారంటే చాలా అంచనాలు ఉంటాయి కదా... మీ మీద ఆ ఒత్తిడి ఉందా?
-నేను ఈ సినిమా చేస్తున్నానని తెలియక ముందే ఘట్టమనేని అభిమానులు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదటి నుంచే ఉంది. ఈ విషయంలో ఒత్తిడి మంచిదే. అది నన్ను మంచి కథల వైపు, ప్రేక్షకులను, అభిమానులను అలరించే పాత్రల వైపు తీసుకెళ్తుంది.

-నేను అభిమానులకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. కచ్చితంగా మంచి సినిమాలు చేయడంతో పాటు వాళ్లతో మరింత దగ్గరగా ఉండాలని భావిస్తున్నాను.

'శ్రీనివాస మంగాపురం' ఎలా ఉంటుంది?
-ఇది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రా రస్టిక్ గా అనిపిస్తాయి. అలాగే ఇది ఒక టెంప్లేట్ లవ్ స్టోరీ కాదు. ఇందులో చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ట్విస్టులు కూడా చాలా కొత్తగా ఉంటాయి.

రాషా తడానీ గురించి?
-రాషా ఈ సినిమా చేయడం ఈ సినిమాకి ఒక మంచి అసెట్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. కచ్చితంగా ఆడియన్స్ ఆమె పెర్ఫార్మెన్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు.

ఇందులో మీరు చేసిన శ్రీను పాత్ర ఎలా ఉండబోతుంది?
-శ్రీను వెరీ ఫన్ లవింగ్. తనలో అల్లరి ఉంటుంది. తనకేం కావాలో తనకి క్లియర్‌గా తెలుసు. తను మంగని ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

-ఇందులో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ప్రేమకథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులోని ఎమోషన్స్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. కచ్చితంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను.

షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?
-ఈ సినిమా కోసం 70 రోజుల పాటు అవుట్‌డోర్ షూటింగ్ చేశాం. ప్రతిదీ పబ్లిక్‌లోనే షూట్ చేశాం. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను.

మోహన్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?
-మోహన్ బాబు గారు వెరీ స్వీట్. చాలా క్లోజ్‌గా ఉంటారు. కెమెరా ముందుకు వచ్చే సమయంలో మాత్రం చాలా ఏకాగ్రతతో ఉంటారు.

యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం ఎలా అనిపించింది?
నాకు యాక్షన్ చేయడం చాలా ఇష్టం. యాక్టర్ కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను.

జీవీ ప్రకాష్ మ్యూజిక్ గురించి?
జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న ఆరు పాటలు కూడా దేనికవే ప్రత్యేకం. అలాగే డాన్స్ నంబర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆడియన్స్ సాంగ్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. అజయ్ గారిని చాలా బాగా అర్థం చేసుకుని ఆయన మ్యూజిక్ ఇచ్చారు.

-సినిమాలో కొన్ని సర్‌ప్రైజెస్ కూడా ఉన్నాయి. అవి ఆడియన్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు.

టీజర్, ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాల్లో మీరు మహేష్ బాబు గారిలా అనిపించారనే కామెంట్స్ వస్తున్నాయి?

-కొన్ని షాట్స్‌లో అలా అనిపించొచ్చు. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం మీకు అలా అనిపించదు. సినిమా చూస్తున్నప్పుడు మీకు క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది.

అజయ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ఆయన చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నా తొలి సినిమాకే అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్‌తో వర్క్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆయనతో తొలి సినిమా చేయడం నాకు చాలా లక్కీగా భావిస్తున్నాను.

ప్రమోషన్స్‌కు వెళ్లారు కదా... ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?
-చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా బుర్రిపాలెం కూడా వెళ్లాను. ఇకపై తరచుగా అక్కడికి వెళ్లి వాళ్లందరినీ కలవాలని ఉంది.

నాన్నగారు మీకు చిన్నప్పుడు ఏమైనా చెప్పేవారా?
-ఆయన చాలా సినిమాలు చూసేవారు. మేమిద్దరం సినిమా గురించి చాలా మాట్లాడుకునేవాళ్లం.

-చిన్నప్పుడు నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి 'నిజం' సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత 'అర్జున్' సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ తర్వాత 'గుంటూరు కారం' సినిమా షూటింగ్‌కు వెళ్లాను.

భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
-నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. అయితే పర్సనల్‌గా నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలని ఉంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s