The Sound Of A Heart Falling In Love- Gunde Pelipothondhe From Jaya Krishna Ghattamaneni, Rasha Thadani’s Srinivasa Mangapuram Unveiled
జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి, జీవీ ప్రకాష్ కుమార్ ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ 'గుండె పేలిపోతోందే' సాంగ్ రిలీజ్- సినిమా జూలై 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
Director Ajay Bhupathi, who delivered a sensational blockbuster with Mangalavaaram, is now set to captivate with his next big project, Srinivasa Mangapuram. The film introduces Jaya Krishna Ghattamaneni to Telugu cinema, carrying forward the illustrious Ghattamaneni legacy. Starring opposite him is Rasha Thadani, who makes her Tollywood debut after gaining nationwide popularity with the chartbuster Uyi Amma. Senior actor Mohan Babu takes on a powerful antagonist role. Produced by P Kiran and presented by Ashwini Dutt, the makers have now unveiled the film’s third single, Gunde Pelipothondhe.
A celebration of first love and youthful emotions, Gunde Pelipothondhe beautifully captures the feelings of a young man completely mesmerized by the girl he stumbles upon. Lost in her charm, he finds himself floating in a world filled with excitement, wonder, and endless affection, wanting to be wherever she is.
GV Prakash Kumar delivers a spellbinding composition that seamlessly blends classical richness with contemporary appeal. The soothing flute passages, elegant violin arrangements, and lush orchestration create an enchanting musical experience. Oscar-winning lyricist Chandrabose pens heartfelt lines that perfectly reflect the innocence and magic of first love, while Anurag Kulkarni’s soulful rendition elevates the song.
Visually, the song shot in a temple backdrop is equally captivating. The vibrant frames, and appealing aesthetics complement the melody beautifully. Bhanu Master’s choreography effectively conveys the protagonist’s lovestruck euphoria, adding charm and energy to the proceedings. Jaya Krishna Ghattamaneni impresses with his effortless screen presence and natural expressions, while Rasha Thadani looks graceful and radiant in traditional attire. Together, they share a refreshing chemistry that enhances the song’s appeal.
With its melodious tune, and striking visuals, and adorable chemistry, Gunde Pelipothondhe has all the ingredients to become a favorite among music lovers and young audiences alike, earning a permanent place on romantic playlists.
Ajay Bhupathi once again showcases his strength in portraying love stories with freshness and emotional depth. Going by the promotional content released so far, Srinivasa Mangapuram promises a memorable romance backed by strong emotions and engaging storytelling.
The film’s technical team further raises expectations, with Jayakrishna ISC handling cinematography, GV Prakash Kumar composing the music, Madhav Kumar Gullapati overseeing editing, Sahi Suresh serving as production designer, and Real Sathish choreographing the action sequences.
The makers are expected to announce the film’s release date soon.
Technical Crew:
Written & Directed by: Ajay Bhupathi
Presented by: Ashwini Dutt
Produced by: P. Kiran
Banner: Chandamama Kathalu
Music: GV Prakash Kumar
DOP: Jayakrishna ISC
Editor: Madhav Kumar Gullapati
Production Designer: Sahi Suresh
Ex-Producer: Sakamuri Narayana Swamy
Fights: Real Sathish
జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి, జీవీ ప్రకాష్ కుమార్ ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ 'గుండె పేలిపోతోందే' సాంగ్ రిలీజ్- సినిమా జూలై 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
‘మంగళవారం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ ‘ఉయ్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పీ. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే’ పాటను విడుదల చేశారు.
తొలి ప్రేమలో కలిగే మధురమైన భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ పాట, ఓ యువకుడు తొలిచూపులోనే ఓ అమ్మాయిపై ప్రేమలో పడిన తర్వాత అతని మనసులో కలిగే ఉత్సాహం, ఆశ్చర్యం, ఆనందాన్ని అందంగా చూపిస్తుంది. ఆమె చుట్టూనే తిరగాలని, ఆమె ఉన్న చోటే ఉండాలని కోరుకునే ప్రేమికుడి మనసుని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ పాటకు క్లాసిక్, మోడరన్ మెలోడీతో మేళవిస్తూ అద్భుతంగా కంపోజ్ చేశారు. సాఫ్ట్ ఫ్లూట్ బిట్స్, అందమైన వయోలిన్ స్వరాలు, ఆర్కెస్ట్రేషన్ ఈ పాటను సంగీత ప్రియులకు ప్రత్యేక అనుభూతిగామార్చాయి. ఆస్కార్ విజేత గేయరచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యం తొలి ప్రేమ అమాయకత్వాన్ని అద్భుతంగా పలికించగా, అనురాగ్ కులకర్ణి తన హార్ట్ టచ్చింగ్ వోకల్స్ తో పాటకు మరింత ప్రాణం పోశారు.
ఆలయ నేపథ్యంతో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్ ఫ్రేమ్స్, అందమైన లొకేషన్స్, ఆకర్షణీయమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి. భాను మాస్టర్ కొరియోగ్రఫీ ప్రేమలో మునిగిపోయిన యువకుడి భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేసింది.
హీరో జయకృష్ణ ఘట్టమనేని తన నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, రాషా తడానీ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది. వీరిద్దరి మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మధురమైన స్వరాలు, ఆకట్టుకునే సాహిత్యం, అందమైన విజువల్స్, మనసుకు హత్తుకునే ప్రేమ భావాలతో ‘గుండె పేలిపోతోందే’ పాట ఇప్పటికే సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూ రొమాంటిక్ ప్లేలిస్టుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ప్రేమకథలను కొత్తదనంతో, భావోద్వేగాలతో చెప్పడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించిన అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని కూడా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రానికి జయకృష్ణ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘శ్రీనివాస మంగాపురం జూలై 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్