“Though Dil Raju offered to pay me for Thammudu, I haven’t taken my remuneration” – Sriram Venu
'తమ్ముడు' కి రెమ్యునరేషన్ దిల్ రాజు గారు ఇచ్చినా తీసుకోలేదు- శ్రీరామ్ వేణు
As part of the promotions for Thammudu, director Venu Sriram gave an interview to Idlebrain Jeevi, where he shared many insights about his film journey. He revealed that his real name is Sriram Venu, with “Sriram” being his family name, but the media widely refers to him as Venu Sriram.
He said that regardless of whether a film succeeds or fails, he always analyzes the outcome. Although his debut film Oh My Friend was considered a failure at the time, today’s generation relates to it deeply. He’s been working with Dil Raju’s banner since Arya and continues to enjoy that comfort and association.
He mentioned that after MCA, he was supposed to do Icon, but the project was delayed. Interestingly, a year after he proposed the title Icon, Allu Arjun began referring to himself as “Icon Star.” However, he clarified that Icon will not be made with Allu Arjun and will instead be done with someone else.
Talking about Vakeel Saab, he said it didn’t feel like a difficult project. As a fan of Pawan Kalyan, just having the opportunity to direct him was so fulfilling that he never thought in terms of effort or measurements. He described the happiness as akin to a child receiving candy. Not a single scene was deleted from Vakeel Saab, he noted.
The story for Thammudu was inspired by an article he read in Eenadu newspaper. He mentioned that the young girl who acted in the film is actually his daughter, a detail he initially wanted to keep under wraps — but her name was revealed on the trailer release day.
When Game Changer came up, he stated that it’s not his place to speak about the film. However, he emphasized that Telugu audiences are not the type to oppose a film out of anger towards an individual. If any Mega fans were hurt, he extended his apology.
Venu Sriram said he watches fewer films, but among those, he really liked Middle Class Melodies — which led him to cast Varsha. He also appreciated the film Commitment Kurraallu. He humorously noted that Malayalam food is different, while Telugu food is its own flavor — likening Telugu cinema to a full-course meal. He reiterated his love for Telugu cinema and its audience.
He proudly shared that he watched RRR four times in a row. He called Siddharth “multi-talented,” expressed gratitude toward Nani for giving him a solid commercial hit, admired Pawan Kalyan for his ability to read people, and praised Nithiin for being free of insecurities.
'తమ్ముడు' కి రెమ్యునరేషన్ దిల్ రాజు గారు ఇచ్చినా తీసుకోలేదు- శ్రీరామ్ వేణు
తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా ఐడిల్ బ్రెయిన్ జీవికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు. తన సినీ ప్రయాణంలో చాలా విషయాలను జీవితో పంచుకున్నారు. తన అసలు పేరు 'శ్రీరామ్ వేణు' అని, 'శ్రీరామ్' తమ ఇంటిపేరని, కానీ మీడియా అంత తనను 'వేణు శ్రీరామ్' అనే పిలుస్తారన్నారు. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎప్పటికప్పుడు అనాలసిస్ చేసుకుంటున్నారు. మొదటి సినిమా 'ఓ మై ఫ్రెండ్' అప్పట్లో ఫెయిల్ అయినా ఇప్పుడు జనరేషన్ చాలామంది ఆ సినిమాను రిలేట్ చేసుకుంటున్నారన్నారు. ఆర్య సినిమా నుండి ఇప్పటి వరకూ దిల్ రాజు గారి సంస్థలోనే పనిచేశానని, అలాంటి కంఫర్ట్ దిల్ రాజు గారి దగ్గర ఉంటుందన్నారు.
MCA తరువాత ఐకాన్ చేయాల్సి ఉందని, కానీ ఐకాన్ లేట్ అయిందన్నారు. తను ఐకాన్ సినిమా టైటిల్ అనుకున్న సంవత్సరం తరువాత అల్లు అర్జున్ 'ఐకాన్ స్టార్' అని పేరు పెట్టుకున్నారన్నారు. కానీ ఐకాన్ సినిమా అల్లు అర్జున్ తో చేయడం లేదన్నారు. వేరే వాళ్ళతో ఉంటుందన్నారు.
'వకీల్ సాబ్' సినిమా చేయడం తనకు పెద్దగా కష్టమనిపించలేదన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా, ఆయనకు యాక్షన్ చెప్తున్నామన్న ఆనందం ముందు ఏ కొలతలూ ఏ లెక్కలూ వేసుకోలేదన్నారు. చిన్న పిల్లాడికి క్యాండీ ఇస్తే ఎంత హ్యాపీ గా ఉంటాడో అంతే సంతోషంతో ఉండేవాడిన్నారు. వకీల్ సాబ్ సినిమాలో ఒక్క సీన్ కూడా డిలీట్ చేయలేదన్నారు. ఈనాడు లో వచ్చిన ఒక ఆర్టికల్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ అక్కా తమ్ముళ్ళ కథ రాసానన్నారు. ఈ సినిమాలో నటించిన పాప తన కూతురన్న విషయం అప్పుడే చెప్పకూడదనుకున్నానన్నారు. కానీ ట్రయిలర్ రోజు తన పేరు రిలీజ్ చేశారన్నారు.
'గేమ్ చేంజర్' గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడే రైట్ తనకు లేదన్నారు. కానీ ఒకరి మీద కోపంతో ఇంకొకరి సినిమా మీద వ్యతిరేకత చూపే నైజం తెలుగు ప్రేక్షకులకు లేదన్నారు. మెగా అభిమానులు బాధపడితే తను కూడా సారీ చెప్తున్నానన్నారు. తను ఎక్కువ సినిమాలు చూస్తాను, తక్కువ సినిమాలు చూస్తానన్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చూసే వర్ష ను తీసుకున్నామన్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. మలయాళం ఫుడ్ వేరు, తెలుగు ప్రజల ఫుడ్ వేరన్నారు. తెలుగు సినిమా ఫుల్ మీల్స్ మాదిరి అన్నారు. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు అంటే తనకిష్టమన్నారు. RRR సినిమాను వరుసగా నాలుగు షో లు చూశానన్నారు. సిద్ధార్థ్ మల్టీ టాలెంటెడ్ అని, మంచి కమర్షియల్ హిట్ తనకిచ్చిన నాని పట్ల తనకు కృతజ్ఞత ఉందని, పవన్ కళ్యాణ్ మనుషులను చదవగలరని, నితిన్ కు ఎటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదన్నారు.