pizza

Sri Sri single on 27 July
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే 'శ్రీ శ్రీ' ఫస్ట్ సింగిల్ బొమ్మ బొమ్మ జూలై 27న రిలీజ్

You are at idlebrain.com > news today >

25 July 2026
Hyderabad

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇటివల రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. జూలై 27న ఫస్ట్ సింగిల్ బొమ్మ బొమ్మ జూలై 27న రిలీజ్ కానుంది.

సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ట్రెక్కింగ్ కాస్ట్యూమ్స్‌లో కొండ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జిపై నడుస్తూ కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ, చిరునవ్వులు పోస్టర్‌కు ఫ్రెష్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్న రంగురంగుల జెండాలు, ప్రకృతి అందాలు సాంగ్ విజువల్ టోన్‌ను చూపిస్తున్నాయి.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి ప్రతిభతో చిత్రం విజువల్‌గా ఎమోషనల్ గా అద్భుతంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

"శ్రీ శ్రీ" చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రవి నెలకుదిటి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్.ఎల్.వి. సినిమాస్
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సీఈఓ: విజయ్ కుమార్ చాగంటి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ: అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s