pizza

“The entire family should come together and enjoy Saampradayini Suppini Suddhapusani in theatres”: Guests at the Pre-Release Event
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.

You are at idlebrain.com > news today >

4 March 2026
Hyderabad

After classic entertainers like Missamma, Adirindayya Chandram, and Tata Birla Madhyalo Laila, the film Saampradayini Suppini Suddhapusani brings back the pair Shivaji and Laya. Following the successes of Little Hearts and Raju Weds Rambai, noted producers Bunny Vaas and Vamsi Nandipati are releasing this film in association with ETV Win. The recently released trailer has significantly raised expectations for the movie.

Presented by Ricky under the banner of Sri Shivaji Productions in association with ETV Win, the film is produced by hero Shivaji himself and directed by Sudheer Sriram. The crime-comedy family thriller is set to hit theatres on March 6. The pre-release event was held grandly, with comedy legend Brahmanandam and Bandla Ganesh attending as chief guests.

Brahmanandam said, “Shivaji is like a younger brother and a very dear person to me. The young team has made a wonderful film together. Ali invited me to attend Shivaji’s film function, and I came immediately without a second thought. I have acted with Shivaji before and also been part of films he produced. It feels exciting to participate in such a festive event. Many talented comedians have acted in this film. It is rare to see so many talented artists together in one movie, and this film has achieved that. I believe this movie, filled with a festive vibe, will entertain everyone with laughter. I wish the film great success and hope Shivaji succeeds as a producer.”

Bandla Ganesh said, “ETV Win has been encouraging many new talents. Shivaji is like a soul brother to me. I always wish the best for him. When I first heard the film was going to OTT, I was disappointed. I called Sai and Nithin and asked them to release it in theatres. With Anil Ravipudi’s suggestion, the film is coming to theatres, which makes me happy. I hope this film becomes a super hit. I also wish ETV Win continues to encourage new talent.”

ETV Win Head Sai Krishna said, “Shivaji and Laya have made this film with great responsibility and love. We want everyone to come with their families. To make it more accessible to family audiences, we have announced a Family Ticket Combo. In single-screen theatres, four tickets and one popcorn will be available for just ₹499. In multiplex theatres, four tickets and one large popcorn will be available for ₹699. I request everyone to make use of this offer.”

Hero Shivaji said, “Whenever a film comes from ETV Win, there is curiosity among the audience. The same interest is seen for Saampradayini Suppini Suddhapusani. With the intention that the film should not become distant from the audience, ETV Win has announced this family package for theatre viewing. The offer includes four tickets and popcorn for ₹499 in single screens and four tickets with a big popcorn for ₹699 in multiplexes. This offer is designed keeping families and friends in mind, helping the film reach more people. I can confidently say this movie will not disappoint the audience. Families can happily enjoy this film together in theatres. I thank Sai, Nithin, and Bapineedu from ETV Win. I am very happy that Brahmanandam garu attended the event. Bandla Ganesh garu came immediately when invited. Ali treated it like his own film. Everyone supported me, and that’s why we achieved such a good output today. My thanks to all.”

Producer Vamsi Nandipati said, “We are happy to release Shivaji garu’s film. Seeing this event has given us great energy. The film has good fun and a crime element. The hero plays a common man, a role that will connect with everyone. With this film’s success, Shivaji’s hard work will bear fruit.”

ETV Win’s Nithin Chakravarthy said, “This event is filled with superheroes. Whenever people face difficulties, comedians like Brahmanandam and Ali help them forget their worries with laughter. It feels like Sankranti is arriving again in March. We wish to continue this journey with Shivaji. There is no one who dislikes comedy. The super comedy heroes in this film will remind everyone of their childhood days. From children to elders, everyone will love this film. Audiences will leave theatres smiling.”

Heroine Laya said, “The event looks colorful with so many people attending. This is my fourth film with Shivaji garu. The movie will exceed audience expectations. I strongly believe everyone will like it. The family package announced is very good. The director has made the film with great clarity and will become a big director in the future. This film will remain memorable for all of us.”

Ali, director Sudheer Sriram, writer Mithil, DOP Ritwik Reddy, editor Balu Manoj, Bole Shavali, Babloo, Rohan, Prince, Shabuddin, Chitram Srinu, Kamal, Chammak Chandra, Emmanuel, Prithvi, Mahipal, and others participated in the event.

‘Saampradayini Suppini Suddhapusani’ Family Ticket Combo Bumper Offer

With the intention of reaching a wider audience, the makers have announced a bumper offer. To ensure the film is accessible to everyone, a special family package has been introduced for theatre viewing. The combo includes four tickets and one popcorn for ₹499 in single screens, and four tickets with one large popcorn for ₹699 in multiplex theatres. With this exciting offer, Saampradayini Suppini Suddhapusani is set to create a festive atmosphere in theatres.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, బండ్లగణేష్‌ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం మాట్లాడుతూ '' తమ్ముడు శివాజీ నాకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి. యంగ్‌ బ్యాచ్‌ అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశారు. అలీ అన్న శివాజీ సినిమా ఫంక్షన్‌కు వెళదాం రా అన్నాడు. వెంటనే ఆలోచించకుడా వచ్చాను. గతంలో శివాజీ నిర్మించిన సినిమాలతో పాటు ఆయనతో కలిసి నటించాను. ఇలాంటి పండగ వాతావరణం ఉన్న ఫంక్షన్‌లో పాల్గొనడం నాకు ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కమెడియన్స్‌ నటించారు. ఇంత మంది టాలెంటెడ్‌ ఆర్టిస్టులు ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అది ఈసినిమాకు దక్కింది. పండగ వాతావరణంలో ఉన్న ఈ సినిమా అందర్ని నవ్వులతో అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈసినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందని, నిర్మాతగా శివాజీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ '' ఈటీవీవిన్‌ సంస్థ ఎంతో మంది నూతన ప్రతిభను ప్రోత్సాహిస్తున్నారు. శివాజీ నా ఆత్మబంధువు, సోదరుడు. శివాజీ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ సినిమా ఓటీటీ అనగానే డిజప్పాయింట్‌ అయ్యాను. సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో విడుదల చేయమని చెప్పాను. అనిల్‌ రావిపూడి సలహాతో ఈ సినిమా థియేటర్‌లో రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఈటీవీ విన్‌ సంస్థ ఇలాగే కొత్తవారిని ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.

ఈ టీవీ విన్‌ హెడ్‌ సాయికృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాను శివాజీ, లయ గారు ఎంతో బాధ్యతగా, ప్రేమగా తీశారు. ఈ సినిమను అందరూ ఫ్యామిలీతో రండి. ఈసినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ కావాలని ఫ్యామిలీ టికెట్‌ కాంబోను ప్రకటించాం. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్‌ కార్న్‌ను సింగిల్‌ స్క్రీన్స్‌లో, 699 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్‌ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు.అందరూ ఈ ఆఫర్‌ను సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ ''
ఈటీవీ విన్‌ నుంచి వస్తున్న సినిమా అంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుది. ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం విషయంలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్‌ వారు థియేటర్‌లో ఈసినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్‌ కార్న్‌ను సింగిల్‌ స్క్రీన్స్‌లో, 699 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్‌ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌, ఫ్రెండ్స్‌ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించారు ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది. ఖచ్చితంగా ఈసినిమా ఆడియన్స్‌ను డిజప్పాయింట్‌ చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యపీగా ఈ సినిమాను థియేటర్‌లో ఎంజాయ్‌ చేయవచ్చు. ఈటీవీ విన్‌ సాయి, నితిన్‌, బాపినీడు గారికి నా కృతజ్క్షతలు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బండ్ల గణేష్‌ గారు కూడా అడగ్గానే వచ్చారు. అలీ కూడా తన సొంత సినిమాలా భావించాడు. అందరూ నాకు సపోర్ట్‌ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఈ సినిమా అంత మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. అందరికి నా కృతజ్క్షతలు'' అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ '' శివాజీ గారి సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ వేడుక చూస్తే మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. ఈ సినిమాలో మంచి ఫన్‌ ఉంది. క్రైమ్‌ ఎలిమెంట్‌ ఉంది. హీరో కామన్‌ మ్యాన్‌ పాత్ర. అందరికి కనెక్ట్‌ అయ్యే పాత్ర ఇది. ఈ సినిమా సక్సెస్‌తో శివాజీ గారి కష్టం ఫలించబోతుంది' అన్నారు.

ఈటీవీ విన్‌ నితిన్‌ చక్రవర్తి మాట్లాడుతూ ''ఈ వేడుకలో అందరూ సూపర్‌హీరోస్‌ ఉన్నారు. ఎంతో మంది కష్టాల్లో ఉన్నప్పుడు బ్రహ్మానందం, అలీ గారు వాళ్ల కామెడీతో బయటపడే సారు. ఈ సారి మార్చిలో సంక్రాంతి రాబోతుంది. శివాజీతో ఈ ప్రయాణ కొనసాగాలని కోరుకుంటున్నారు. కామెడీని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ సినిమాలో సూపర్‌ కామెడీ హీరోస్‌ అందరూ ఈసినిమాతో తమ నటనతో అందరూ చిన్ననాటి రోజులను గుర్తు చేస్తారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చే సినిమా ఇది. సినిమా చూసి అందరూ నవ్వూతూ థియేటర్స్‌ నుండి వెళతారు' అన్నారు.

కథానాయిక లయ మాట్లాడుతూ ''ఈవెంట్‌ ఇంత మంది రాకతో ఎంతో కలర్‌ఫుల్‌గా వుంది. శివాజీ గారితో నా నాలుగో సినిమా. ఆడియన్స్‌ అంచనాలకు మించిన విధంగా ఉంటుంది సినిమా. సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు ప్రకటించిన ప్యాకేజీ ఎంతో బాగుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడు. ఈ సినిమా మా అందరికి గుర్తుండిపోతుంది' అన్నారు.

ఈ కార్యక్రమంలో అలీ, దర్శకుడు సుదీర్‌ శ్రీరామ్‌, రచయిత మిథిల్‌, డీవోపీ రిత్విక్‌ రెడ్డి, ఎడిటర్‌ బాలు మనోజ్‌, బోలే షావలి, బబ్లూ, రోహన్‌, ప్రిన్స్‌, షాబుద్దిన్‌, చిత్రం శ్రీను, కమల్‌, చమ్మక్‌ చంద్ర, ఇమ్మాన్యుయల్‌, పృథ్వీ, మహిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఫ్యామిలీ టికెట్‌ కాంబో బంపర్‌ ఆఫర్‌

ఓ మంచి చిత్రం మరింత మంది ప్రేక్షకులకు రీచ్‌ కావాలని ఉద్దేశంతో ఈసినిమాకు ఓబంపర్‌ ఆఫర్‌ను ప్రకటించారు మేకర్స్‌. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో థియేటర్‌లో ఈసినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్‌ కార్న్‌ను సింగిల్‌ స్క్రీన్స్‌లో, 699 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్‌ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఈ బంపర్‌ఆఫర్‌తో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్లతో కళకళలాడబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved