Su From So (Telugu) Pre Release Press-Meet
'సు ఫ్రం సో’ కన్నడలో బిగ్ బ్లాక్‌బస్టర్. తెలుగు ఆడియన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని
లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ రాజ్ బి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. మేము ఇండీ ఫిలిం మేకర్స్. మంచి కంటెంట్ తీస్తే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేస్తారని నమ్మకం కలిగింది. ఇంత మంచి కంటెంట్ ని ఆదరిస్తున్న మైత్రి శశి గారికి, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. వారు లేకపోతే మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. ఈ సినిమా చాలా మంచి ఎంటర్టైనర్. ఈ సినిమా కన్నడలో అద్భుతాలు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎప్పుడు చూస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా గొప్పగా ఆదరిస్తారు. గరుడగమన రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ మర్చిపోలేను. మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ సినిమా మిమ్మల్ని గొప్పగా అలరిస్తుంది'అన్నారు
నటుడు షనీల్ గౌతమ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము. ఈ సినిమాకి గొప్పగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను'అన్నారు
దర్శకుడు జేపీ తుమినాడ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ అందరిని ఈ వేడుకలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కన్నడలో చాలా అద్భుతమైన విజయం సాధించింది. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తెలుగులో కూడా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ‘సు ఫ్రమ్ సో’ కన్నడలో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తారనే నమ్మకం వుంది. సినిమా తప్పకుండా ఆడియన్స్ ని ఎక్స్ట్రార్డినరీగా ఎంటర్టైన్ చేస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్'అన్నారు
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అయితే ఒరిజినల్ తెలుగులోకి వస్తేనే బావుంటుందని మేము సుప్రీత్ గారితో చెప్పడం జరిగింది. ఈ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద సినిమా కాబోతోంది. రాజ్ బి శెట్టి గారు ఈ సక్సెస్ ని ముందుగానే ఊహించారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అదిరిపోతుంది. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సినిమాలో అందరం ఇన్వాల్వ్ అయిపోతాం. ఒకప్పుడు ఇవివి సత్యనారాయణ గారిని సినిమాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. తర్వాత అది చాలా రోజులు మిస్ అయ్యాం. ఆ లోటును ఈ సినిమా ఫిల్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారు. రాజ్ బి శెట్టి గారు ఇకపై కూడా తెలుగులో సినిమాలు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాన. మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు'అన్నారు.
తారాగణం: షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం - JP తుమినాడ్
నిర్మాతలు - శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలస, రాజ్ బి శెట్టి
తెలుగు రిలీజ్: మైత్రి మూవీ మేకర్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - ఎస్.చంద్రశేఖరన్
సంగీతం - సుమేద్ కె
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - సందీప్ తులసీదాస్