pizza

Sukruthi Veni Bandreddy Receives National Award for Best Child Artist
ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న సుకృతి వేణి బండ్రెడ్డి

You are at idlebrain.com > news today >

24 September 2025
Hyderabad

The 71st National Film Awards ceremony was held with grandeur on Tuesday at Vigyan Bhavan in New Delhi. For the year 2023, the central government selected the best films, actors, and technical experts for national recognition. The President of India, Droupadi Murmu, presented the award winners with trophies, mementoes, and certificates of commendation.

As part of the honours, Sukruthi Veni Bandreddy, daughter of renowned director Sukumar, received the award for Best Child Artist for her outstanding performance in the film Gandhi Tata Chettu. Her acting was widely appreciated by both audiences and critics.

During her address at the ceremony, President Droupadi Murmu made special mention of the film Gandhi Tata Chettu and praised Sukruthi Veni for her performance. She highlighted the actress's commendable talent, noting that her acting deserved special appreciation.

ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న సుకృతి వేణి బండ్రెడ్డి

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం ఢీల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అవార్డు విజేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతో పాటు జ్ఞాపికలు, ప్రశాంసపత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో ఉత్తమ నటనను కనబరిచి ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో గాంధీ తాత చెట్టు సినిమా గురించి, ఆ చిత్రంలో అందరూ ప్రశంసించ దగ్గ నటనను కనబరిచిన సుకృతి వేణి గురించి ఆమె ప్రత్యేకంగా ప్రశంసించడం.. మాట్లాడటం విశేషంగా చెప్పుకోవాలి.




 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved