హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుండి డియర్ ఐరా సాంగ్ ని రిలీజ్ చేశారు. లియాన్ జేమ్స్ డియర్ ఐరా ని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు.
శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ వోకల్స్ సాంగ్ ని మరింత లవ్లీగా మార్చాయి.
ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా కనెక్ట్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఆగస్ట్ 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు.
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు
VFX సూపర్‌వైజర్: నాగు తలారి