హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ' ఆగస్టు 27న విడుదలకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సుందరకాండ ర్యాప్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ హిలేరియస్ ఫన్ & లవ్ రైడ్ ని ప్రామిస్ చేసింది.
ఓ మిడిల్ ఏజ్ బ్యాచిలర్ తన లైఫ్ పార్ట్‌నర్‌లో ఉండాల్సిన అయిదు క్వాలిటీస్ కోసం సెర్చ్ చేయడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ జర్నీ లో అతని కాలేజి డేస్ లవ్ స్టోరీ, ప్రజెంట్ లవ్ స్టోరీ.. ఇలా రెండు ప్రేమకథలతో హిలేరియస్ గా సాగుతుంది. ట్రైలర్‌లో ఈ రెండు టైమ్‌లైన్‌ల మధ్య లవ్ టగ్-ఆఫ్-వార్‌ని ఫన్, మనసుని హత్తుకునే ఎమోషన్‌తో అద్భుతంగా చూపించారు.
ర్యాప్ స్టైల్లో కట్ చేసిన ఈ ట్రైలర్ ఫ్రెష్‌గా, సినిమా లైట్-హార్టెడ్ వైబ్‌ని ప్రజెంట్ చేసింది. నారా రోహిత్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఆయనకి తోడు నరేశ్, సత్య, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం స్క్రీన్ మీద ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా పండించారు. డైరెక్టర్ వెంకటేశ్ రాసిన సీన్‌లు క్రిస్ప్‌గా, సిట్యుయేషనల్ కామెడీ, ఎమోషనల్ బీట్స్‌కి స్మార్ట్ బ్యాలెన్స్ చేశాయి. ట్రైలర్ హిలేరియస్ గా వుంది.
ప్రదీప్ ఎం. వర్మ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా వుంది, లియాన్ జేమ్స్ మ్యూజిక్‌లో రాప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెషల్ ఫీల్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో వున్నాయి. రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్‌గా, సుందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
మొత్తానికి, రాప్ ట్రైలర్ ఎంటర్‌టైనింగ్ మూడ్‌ను సెట్ చేస్తూ, ఇంకో రెండు వారాల్లో రానున్న సినిమాపై మంచి అంచనాలు పెంచింది.
తారాగణం: నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు.
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP)
DOP: ప్రదీష్ ఎం వర్మ
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: రోహన్ చిల్లాలే
ఆర్ట్ డైరెక్టర్: రాజేష్ పెంటకోట
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
కాస్ట్యూమ్ డిజైనర్లు: హర్ష & పూజిత తాడికొండ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్
యాక్షన్ కొరియోగ్రఫీ: పృథ్వీ మాస్టర్
డాన్స్ కొరియోగ్రఫీ: విశ్వ రఘు
VFX సూపర్‌వైజర్: నాగు తలారి
#Sundarakanda trailer packs entertainment with a catchy rap track, and the “Dil Raju - Tejaswini” dialogue at the end is the perfect icing on the cake.
Nara Rohith fits the role perfectly, and this rom-com with its quirky conflict promises solid entertainment.