pizza

Venkatesh Nimmalapudi about Sundarakanda
సుందరకాండ' ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్‌టైనర్‌: డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి

You are at idlebrain.com > news today >

23 August 2025
Hyderabad

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సుందరకాండ ఐడియా ఎలా జనరేట్ అయింది?
-నాకు ఫ్యామిలీ కథలు ఇష్టం. కలిసుందాం రా నా ఫేవరెట్ సినిమా. అలాంటి ఒక క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఉండేది.
-రోహిత్ గారితో నాకు ఎనిమిదేళ్ల జర్నీ వుంది. నా ఫస్ట్ సినిమాని క్యూట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. రోహిత్ గారికి చెప్పాను. కథ రాసి పంపించాను. ఆయన చదివి ఇంప్రెస్ అయ్యారు. అలా ప్రాజెక్టు మొదలైంది.

హీరో క్యారెక్టర్ రాయడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా?
-అందరి ఇన్స్పిరేషన్ ఉంది (నవ్వుతూ). 30 దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయతీ అనుకుంటే, ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కోనే పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదనే ఆలోచన నుంచి వచ్చింది.

మీరు ఇండస్ట్రీలో ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా?
-పవన్ సాధినేని గారి దగ్గర ఒక వెబ్ సిరీస్ చేశాను. సాగర్ కే చంద్ర, పల్నాటి సూర్య ప్రతాప్ గారి దగ్గర రైటింగ్ లో చేశాను. వీర భోగ వసంతరాయులు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గాపని చేశాను. అలాగే నేల టికెట్ సినిమాకి అప్రెంటిస్ గా చేశాను.

సుందరకాండ టైటిల్ గురించి చెప్పండి? దీనికి రామాయణంతో లింక్ ఉందా?
-రామాయణంలో హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్లి రాముల వారిచ్చిన ఉంగరాన్ని చూపించే ఘట్టం సుందరకాండ. అదొక సెలబ్రేషన్. అయితే సెలబ్రేషన్ కి ముందు ఎన్నో సవాళ్లు వున్నాయి. హనుమంతులవారు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. అలా మా హీరో కూడా ఒక విషయాన్ని ఎచీవ్ చేయాలనుకుంటారు. దానికి ఆయన పెట్టే ఎఫెర్ట్స్ ఎమిటనేది కథ. అలా సుందరకాండ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇది పాజిటివ్ టైటిల్. రామాయణం నాకు చాలా ఇష్టం. ఆ టైటిల్ కూడా అలా కలిసి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రోహిత్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నేను రోహిత్ గారితోనే ఎనిమిదేళ్ళుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ బిగినింగ్ నుంచి చివరి వరకు ఆయన సపోర్ట్ వుంది. మేము ఒక ఫ్యామిలీలానే వుంటాం.

ఈ సినిమా కోసం శ్రీదేవి విజయ్ కుమార్ ని ఎంపిక చేయడానికి కారణం?
-రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపున్న లవ్ స్టోరీ ఇది. రోహిత్ గారి కంటే ఏజ్ గా కనిపించాలి అదే సమయంలో బ్యూటిఫుల్ గా ఉండాలి. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు శ్రీదేవి విజయ్ కుమార్ గారిని అనుకున్నాను. శ్రీదేవి గారు రోహిత్ గారికి తెలుసు. అయితే ఆమెని ఈ క్యారెక్టర్ లో ఒప్పించే బాధ్యత మాత్రం రోహిత్ గారు నా మీద పెట్టారు. నేను వెళ్లి కథ చెప్పాను. కథ నచ్చి వెంటనే ఓకే చేశారు. ఈ సినిమా కోసం ఆవిడ చాలా ఎఫర్ట్ పెట్టారు. స్కూల్ అమ్మాయి గా కనిపించడానికి డైట్ కూడా చేశారు

-వృతి వాఘాని క్యారెక్టర్ కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.

-ఈ సినిమాలో నరేష్ గారు చాలా అద్భుతంగా నటించారు. అలాగే సునైనా, వాసుకి గారి పాత్రలు కూడా చాలా బాగుంటాయి. అందరూ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఒక న్యూ ఫిలిం మేకర్ కి చాలా సపోర్ట్ చేశారు.

ఈరోజుల్లో కామెడీ పండించడం చాలా కష్టం.. ఈ విషయంలో మీరు ఏదైనా చాలెంజ్ ఎదుర్కొన్నారా ?
-నాకు కామెడీ చాలా ఇష్టం. అయితే రాయడం అంత ఈజీ కాదు. వీటన్నిటికంటే కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం. లక్కీగా మాకు చాలా అద్భుతమైన నటులు దొరికారు.

-సత్య గారు సునయన క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సత్య గారిది కేవలం కామెడీ అని కాకుండా ఈ కథలో చాలా కీలకమైన పాత్రగా ఉంటుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అందరితో కలిసి చాలా హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

మ్యూజిక్ గురించి?
-లియోన్ జేమ్స్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

ప్రొడక్షన్ హౌస్ గురించి?
ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. క్రియేటివ్ గా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

-చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నపుడు ఆడియన్స్ హాయిగా నవ్వుతూనే ఉంటారు. చాలా క్లీన్ ఫిల్మ్. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved