11 December 2023
Hyderabad
Star Boy Siddhu Jonnalagadda, has been wearing multiple hats as an actor, screenwriter, co-editor and creative producer. He attained phenomenal success with the film DJ Tillu. He is being choosy in selecting his films. The actor has joined hands with blockbuster director Bomarillu Baskar.
The film is bankrolled by the popular producer BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner. The project tentatively titled SVCC 37 launched recently with a formal pooja ceremony.
Today, the makers commenced the shoot and announced it with a striking poster. In the poster, director Bommarillu Bhaskar is seen shooting with a gun, while producer BVSN Prasad and hero Siddhu are also featured.
The film has captured everyone's attention as it is an interesting combo - Bhaskar, who made a comeback with 'Most Eligible Bachelor,' and the current youth sensation Siddhu Jonnalagadda. Siddhu Jonnalagadda impressed with youthful entertainers and Bomarillu Baskar is supreme in making romantic and family entertainers. Thier collaboration is going to give enthralling experience to audience.
The film will be made as hilarious entertainer. The cast and crew details are currently kept under wraps. More details about this exciting project will be announced soon.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్, బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో రాబోతోన్న ‘ఎస్వీసీసీ 37’ షూట్ ప్రారంభం
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ ఉన్నారు. డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే అంచనాలు పెరిగాయి. వీరిద్దిరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.