pizza

England Rani lyrical from SWAG released
శ్రీవిష్ణు, రీతూ వర్మ, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'శ్వాగ్' నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఇంగ్లాండు రాణి సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

21 September 2024
Hyderabad

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు ను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రజెంట్ చేసిన టీజర్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సింగరో సింగ, సెకండ్ సింగిల్- గువ్వ గూటి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ శ్వాగ్ థర్డ్ సింగిల్ 'ఇంగ్లాండు రాణి' సాంగ్ ని రిలీజ్ చేశారు.

వివేక్ సాగర్ క్యాచిగా స్కోర్ చేసిన సాంగ్ లో అనుభూతిగా రీతూ వర్మ క్యారెక్టర్ ని చాలా ఇంట్రస్టింగా ప్రజెంట్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. కైలాష్ ఖేర్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ఈ చిత్రంలో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.

శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved