Welcome To The Crazy & Fun-Filled World Of Swag- Sree Vishnu, Hasith Goli, TG Vishwa Prasad, People Media Factory's Swag Teaser Released
-శ్రీ విష్ణు, హసిత్ గోలి, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'శ్వాగ్' క్రేజీ & ఫన్-ఫిల్డ్ టీజర్ లాంచ్
King of Content Sree Vishnu continues to impress with his diverse choice of roles. Known for balancing compelling subjects with ample entertainment, he is set to shine in his next film- Swag, which marks his second collaboration with Hasith Goli, after the super hit Raja Raja Chora. TG Vishwa Prasad producing under the People Media Factory banner. The makers today released the film’s teaser.
Centuries ago, during a time when the very existence of men was under threat, Queen Rukmini Devi of the Vinjamara dynasty harboured such intense hatred for men that she would not hesitate to kill a son if she were to give birth to one. However, a curse on the dynasty eventually reversed the situation, leading to a gradual shift where men began to dominate women.
Fun is certainly guaranteed in the combination of Sree Vishnu and Hasith Goli. However, this time, they have a stronger story with a unique backdrop. The movie will have elements which weren’t touched before in Indian cinema, which will be revealed in the next promotional material.
Sree Vishnu excels in his diverse roles, delivering standout performances as King, Bhavabhuthi, Singa, and Yayathi, each distinctly different from the other. Ritu Varma also impresses as Queen Rukmini Devi. The teaser also introduces characters played by Meera Jasmine, Sunil, Daksha Nagarkar, and Saranya Pradeep, among others.
Vedaraman Sankaran’s camera work is effective, while Vivek Sagar enhanced each element with his impressive score. GM Shekar handles the art department, while Nandu Master takes care of stunts.
The crazy and fun-filled teaser sets good expectations for the movie which is getting ready for release.
-శ్రీ విష్ణు, హసిత్ గోలి, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'శ్వాగ్' క్రేజీ & ఫన్-ఫిల్డ్ టీజర్ లాంచ్
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా 'శ్వాగ్' తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజమర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశంపై ఒక శాపం చివరికి పరిస్థితిని రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు.
శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ గా ఉంటుంది. ఈసారి, వారు యూనిక్ బ్యాక్ డ్రాప్ లో బలమైన కథతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు టచ్ చేయని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి, అవి నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్‌లో రివిల్ అవుతాయి.
శ్రీ విష్ణు...కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. టీజర్‌లో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి.
వేదరామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ పుల్ గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. క్రేజీ అండ్ ఫన్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు.. మగ మహారాజులకు, మకుటం లేని మహారాణులకు స్వాగనిక వంశానికి స్వాగతం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ఇలాంటి కథ నాకు ఇచ్చిన హసిత్ చాలా థాంక్స్. చాలా గొప్ప కథ. ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటివరకూ రాలేదు. ఇది మనఅందరి ఇళ్ళలో వున్న పాయింట్ అయినా స్క్రీన్ పైకి ఇప్పటివరకూ రాలేదు. ఇలాంటి కంటెంట్ ని సినిమా చేయడానికి ముందుకువచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా దమ్ముండాలి. టీంలో అందరికీ థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.'అన్నారు.
నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ .. శ్రీవిష్ణు, హసిత్ తో కలసి రాజ రాజ చోర సినిమా చేశాం. ఇది మా సెకండ్ మూవీ. ఇది కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ. కమల్ హసన్ గారి ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలు చూసిన ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఒక మంచి వెరైటీ కంటెంట్ ని ఇస్తున్నామని అనుకుంటున్నాం' అన్నారు
డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ తో కొంత అర్ధమైవుంటుంది. జనరేషన్ గా వస్తున్న జెండర్ వార్ టచ్ చేసి వుంది. టీజర్ లో కొంచమే చెప్పాం. ఇది అచ్చ తెలుగు సినిమా. కంటెంట్ చాలా మాట్లాడుతుంది. ఇండియన్ కంటెంట్ లో ఇప్పటివరకూ రాలేదు. తాతలు ముత్తతలతో పాటు చూడగలిగే సినిమా. విష్ణు గారు గ్రేట్ పెర్ఫార్మార్. అన్ని క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇలాంటి యూనిక్ కంటెంట్ కి సపోర్ట్ చేసిన విశ్వగారికి చాలా థాంక్ యూ' అన్నారు.
సినిమాటోగ్రాఫర్ గా వేదరామన్ శంకరన్ మాట్లాడుతూ.. హలో ఆల్. వెల్ కం టూ వరల్డ్ అఫ్ శ్వాగ్. ఎంజాయ్' అన్నారు
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. టీజర్ చిన్న పార్ట్.. మూవీలో దీనికి వందరెట్లు చూస్తారు. ఒకొక్క క్యారెక్టర్ ఒకొక్క ప్రపంచం. చాలా ఎంజాయ్ చేస్తారు'అన్నారు
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్
The #Swag teaser stands out with two distinctive features: Sree Vishnu portraying four diverse characters and an intriguing exploration of how the dynamics between men and women have evolved over centuries. Director Hasith Goli appears to be crafting something truly unique. Can't… pic.twitter.com/keiL4PD6fp