pizza

Swayambhu on 10 April
నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్

You are at idlebrain.com > news today >

24 January 2026
Hyderabad

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది.

స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సమ్మర్ రిలీజ్ కి ఇది పర్ఫెక్ట్ డేట్.

స్వయంభు విఎఫ్ఎక్స్ అద్భుతంగా వుండబోతున్నాయి. ఇండియాలో టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి.

విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ అవుట్‌పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారు.

స్వయంభు నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ వున్న సినిమా.

ఇందులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద భారీ అంచనాలను పెంచింది.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. రాజమౌళితో ఐకానిక్ సినిమాలు అందించిన KK సెంథిల్ కుమార్ సినిమాకి డిఓపి గా పనిచేయడం విశేషం. కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్స్.

తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
DOP: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved