Supreme Hero Sai Durgha Tej, Rohith KP, K Niranjan Reddy, Chaitanya Reddy, Primeshow Entertainment’s Pan India Movie SYG (Sambarala Yeti Gattu) Grand Final Schedule Begins, Theatrical Release In December
సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, రోహిత్ కేపీ, కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల ఏటిగట్టు) గ్రాండ్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్
Mega Supreme Hero Sai Durgha Tej’s ambitious Pan-India project SYG (Sambarala Yeti Gattu), directed by debutant Rohith KP and produced by K Niranjan Reddy and Chaitanya Reddy of Primeshow Entertainment, is carrying exceptional buzz, thanks to thumping response to Asura Aagamana glimpse and other promotional material. The production house that delivered the Pan-India sensation HanuMan, is making the movie on a grand scale, leaving no stone unturned to ensure a cinematic experience of the highest order. From expansive sets to top-notch technical standards, the makers are mounting the film with uncompromising ambition and vision.
Sambarala Yeti Gattu has entered its final shooting schedule today in Hyderabad, marking the beginning of the last and most crucial phase of production. A massively erected bespoke set, has been constructed on an extravagant scale to bring to life some of the most visually stunning, emotionally charged and action-packed sequences of the film. This final schedule will feature key episodes involving the principal cast, setting the stage for an unforgettable cinematic experience.
Sai Durgha Tej presents himself in one of the most powerful, intense and career-defining roles. The actor, known for constantly reinventing himself and choosing distinctive subjects, undergoes a remarkable transformation for Sambarala Yeti Gattu, promising audiences a never-seen-before avatar packed with raw energy, emotion and mass appeal.
Director Rohith KP is mounting the movie as a grand action drama blending powerful storytelling, breathtaking visuals and high-octane sequences, making it one of the most awaited Pan Indian films currently in production.
Having successfully completed multiple schedules across diverse locations, the film now enters its concluding phase, with post-production activities expected to commence soon after the completion of this schedule.
A top Bollywood actor is playing a crucial role in the film, where Aishwarya Lekshmi, Jagapathi Babu, Sai Kumar, Srikanth, and Ananya Nagalla will be seen in prominent roles.
Strengthening the film's grand vision is an accomplished technical team. Cinematographer Vetrivel Palanisamy captures the epic scale, while B Ajaneesh Loknath provides the music. Editor Nawin Vijay Krishna and production designer Gandhi Nadikudikar further elevate the film with their expertise.
With anticipation soaring among fans and movie lovers alike, the makers are confidently eyeing a grand theatrical release in December 2026, aiming to deliver a wholesome festival entertainer that resonates across audiences.
The exact release date will be announced soon.
Cast: Sai Durgha Tej, Aishwarya Lekshmi, Jagapathi Babu, Sai Kumar, Srikanth, Ananya Nagalla
Technical Crew:
Writer, Director: Rohith KP
Producers: K Niranjan Reddy, Chaitanya Reddy
Banner: Primeshow Entertainment
DOP: Vetri Palanisamy
Music: B Ajaneesh Loknath
Editor: Nawin Cuts
Production Designer: Gandhi Nadikudikar
Fights: Kevin Master
Costume Designer: Ayesha Mariam
సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, రోహిత్ కేపీ, కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల ఏటిగట్టు) గ్రాండ్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం 'హనుమాన్'ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు నాంది పలుకుతూ 'సంబరాల ఏటిగట్టు' చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించింది. అత్యంత అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలకు జీవం పోయడానికి, ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను గ్రాండ్ గా నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన ఘట్టాలు ఉంటాయి, ఇది ఒక మరపురాని సినిమా ఎక్స్ పీరియన్స్ కి వేదిక కానుంది.
సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ పాత్రలలో కనిపించబోతున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన సాయి తేజ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని మాస్ అప్పీల్‌తో కూడిన సినిమాని ప్రామిస్ చేస్తోంది.
దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ కథనం, ఉత్కంఠభరితమైన విజువల్స్, హై-ఆక్టేన్ సన్నివేశాల మేళవింపుతో ఒక గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.
విభిన్న ప్రదేశాలలో పలు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశలోకి ప్రవేశించింది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ చిత్రంలో ఒక టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు.
డీవోపీ వెట్రివేల్ పళనిస్వామి ఈ భారీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఎడిటర్ నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్.
అభిమానులు, సినీ ప్రేమికులలో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక సంపూర్ణ పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు 2026 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ఘనంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.