pizza

Telangana exhibitors meet Chiranjeevi
సింగిల్  స్క్రీన్స్ కి  పర్సెంటేజ్  విషయంలో ప్రస్తుతం నెలకొన్న  సంక్షోభాన్ని    తెలుగు సినీ పరిశ్రమ  పెద్దలు  ఈ  రోజు  మధ్యాహ్నం , మెగాస్టార్  శ్రీ చిరంజీవి గారి  దృష్టికి  తీసుకొచ్చారు. 

You are at idlebrain.com > news today >

25 May 2026
Hyderabad

విషయాలన్నీ  పూర్తిగా  విన్న  శ్రీ  చిరంజీవి పరిశ్రమ లో  భాగస్వాములయిన  అందరికీ  పూర్తి న్యాయం జరిగేలా వుండాలని , ఒక్క  సినిమా  గురించో  , ఒక్క  సెక్టార్  గురించో  ఈ  చర్చ కాదని, అందరికీ  ఆమోదయోగ్యంగా  వుండాలనే పరిశ్రమ  కొన్ని పద్దతులను  ఏర్పరుచుకుంది అన్నారు. 

తెలుగు  చిత్ర  పరిశ్రమ కి  హైయెస్ట్  బాడీ  తెలుగు  ఫిలిం  ఛాంబర్  ఆఫ్  కామర్స్  అన్న  విషయాన్ని  గుర్తు చేసి, ఆ  ఛాంబర్  తీసుకున్న  నిర్ణయానికి  కట్టుబడి  వుండటం అందరికీ  సముచితం  అన్నారు. ఒకసారి  అందరినీ  సంప్రదించి , పర్సెంటేజ్ మోడల్ మీద  ఒక  కమిటీని  ఏర్పాటు  చేస్తూ ఛాంబర్  ఒక  నిర్ణయాన్ని  తీసుకున్న  తర్వాత  దాన్ని  వ్యతిరేకిస్తూ  మీడియా  ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు  వ్యక్తపరచటం తగదని అన్నారు.
ఇలాంటి వాటివల్ల  ఇండస్ట్రీ ఒక్కటిగా  లేదన్న సందేశం  ఇవ్వకూడదని  అన్నారు.

ఇంతకు  ముందు  వేసిన  వేరే  కమిటీ ల  పని  తీరు , ఫలితాల పట్ల  సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత   అసంతృప్తి , అపనమ్మకం  వుందన్న  విషయం  అర్ధం అయిందన్నారు. ఈ సారి  ఛాంబర్  ఏర్పాటు చేసిన  కమిటీ  అనుకున్న గడువులో  అంటే  జూన్  30 వ  తేదీ  వరకూ , అన్ని  విషయాలని పూర్తిగా  పరిశీలించి  ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్ర్స్ , ఎక్సహిబిటర్స్ అందరికీ  న్యాయం  జరిగేలా  పర్సెంటేజ్ మోడల్ మీద  ప్రతిపాదనని  చేస్తుందని  తనకు  నమ్మకం వుందని,  ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు  పూర్తిచేసి  నివేదిక  ఇవ్వటానికి  తనవంతు కూడా పూర్తి  ప్రయత్నం   చేస్తానని   శ్రీ చిరంజీవి  హామీ  ఇచ్చారు.

శ్రీ  చిరంజీవి  సమయం వెచ్చించి  తమకున్న సమస్యలని , భయాలని,  ప్రస్తుతం  సింగిల్  స్క్రీన్స్  కి  వున్న  పరిస్థితులని అవగాహన  చేసుకుని  అందరికీ  న్యాయం  జరిగేలా  చూస్తానని  భరోసా  ఇవ్వటం పట్ల  సభ్యులందరూ పూర్తి సంతృప్తి  వ్యక్తం చేశారు . వారి  అసోసియేషన్స్ లో  వున్న  మిగతా  సభ్యులందరికి ఈ సమావేశం గురించి  తెలియచేసి  24 గంటలలో తమ ఆమోదాన్ని  తెలియచేస్తామని  తెలిపారు. 

ఈ  సమావేశంలో  TFCC  ప్రెసిడెంట్  శ్రీ  సురేష్  బాబు , శ్రీ  అల్లు  అరవింద్ , TFDC  చైర్మన్. శ్రీ  దిల్  రాజు , ప్రముఖ  నిర్మాతలు  శ్రీ  కే ఎల్ నారాయణ, శ్రీ  సునీల్  నారంగ్ ,  శ్రీ  భరత్  నారంగ్ , తెలంగాణ  ఫిలిం  ఛాంబర్ ప్రెసిడెంట్  శ్రీ  శేఖర్ ,  శ్రీ అనుపమ్ , శ్రీ  శ్రీధర్ , శ్రీ  సదానంద్  గౌడ్ , సుదర్శన్   థియేటర్ ప్రొప్రయిటర్ శ్రీ రాజ్   తదితరులు  పాల్గొన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved